MLA koramutla SRINIVASULU
-
టీడీపీ సభ్యులు రౌడీల్లా ప్రవర్తిస్తున్నారు
-
బాబు పాలనలో దళితులకు రక్షణ కరువు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో దళితులకు ఏమాత్రం రక్షణ లేకుండా పోయిందని, చట్టాలు, రాజ్యాంగ వ్యవస్థలకు చంద్రబాబు సర్కారు తూట్లు పొడుస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు ధ్వజమెత్తారు. హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దౌర్జన్యాల నుంచి రాష్ట్ర ప్రజల్ని అంబేడ్కరే రక్షించాలన్నారు. టీడీపీ హయాంలో దళితులపై దాడులు అధికమయ్యాయని పేర్కొన్నారు. దళితులుగా ఎవరైనా పుడతారా? అని అవమానకరంగా మాట్లాడిన వ్యక్తి చంద్రబాబు అని అన్నారు. ‘‘గరగపర్రులో అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటు చేశారని దళితులను గ్రామ బహిష్కరణ చేశారు. తూర్పుగోదావరి జిల్లాలో చనిపోయిన పశువు చర్మం ఒలిచారని చెట్టుకు కట్టేసి కొట్టారు. కుప్పంలో దళిత మహిళను వివస్త్రను చేశారు. కర్నూలు జిల్లాలో పారిశుద్ధ్య పనులు చేయలేదని గ్రామ బహిష్కరణ చేశారు. ప్రకాశం జిల్లాలో దళితుల భూముల్ని ఆక్రమించుకున్నారు’’ అని గుర్తు చేశారు. -
రాజీనామాకు సిద్ధం:కొరముట్ల
స్పష్టమైన జీఓ చూపించాలి రైల్వేకోడూరు : ప్రజా సంక్షేమం కోసం పోరాటాలు చేస్తున్న వైఎస్సార్సీపీ తరపున తాను ఎమ్మెల్యేగా గెలిచానిని, ఎవరైనా సరే వెయ్యి కోట్లతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానంటే రాజీనామా చేయడానికైనా సిద్ధంగా ఉన్నానని ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు స్పష్టం చేశారు. పట్టణంలో గురువారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. ఇటీవల మాజీ ఎమ్మెల్సీ బత్యాల చంగల్రాయులు ఎమ్మెల్యే రాజీనామా చేస్తే ఆరు నెలల్లో ఎన్నికలు వస్తాయని, వెయ్యి కోట్లతో అభివృద్ది పనులు జరుగుతాయన్న దానిపై స్పందించి తనదైన శైలిలో గట్టిగా ప్రతిఘటించారు. 2014 ఎన్నికల ముందు అన్ని పార్టీల నాయకులు ఇచ్చిన హామీలు నీటిమూటలయ్యాయని ఎద్దేవా చేశారు. రైల్వేకోడూరుకు బైపాస్ రోడ్డు లేదన్నారు. దీంతో ప్రమాదాలు ఎక్కువగా ఉన్నాయని, అసెంబ్లీలో కూడా రెండు మూడు సార్లు చర్చించామన్నారు. కోడూరు– వెంకటగిరి రోడ్డు కలగా మిగిలిపోయిందని, వెంకటగిరికి చిట్వేలి, రేణిగుంట మీదుగా వెళ్లాల్సి వస్తోందన్నారు. గల్లా అరుణకుమారి మంత్రిగా ఉన్న కాలంలో రైల్వేకోడూరు వెంకటగిరి రోడ్డు గురించి పలుమార్లు చర్చించామన్నారు. 14 గ్రామాల ప్రజలు, హైస్కూల్, జూనియర్, డిగ్రీ కళాశాల విద్యార్థులు అండర్ బ్రిడ్జి లేక అవస్థలు పడుతున్నారన్నారు. దీనిపై ఎన్ని పోరాటాలు చేసినా ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో రైల్వేఅండర్ బ్రిడ్జి ఫైల్ కదిలి జీఓ దశకు చేరుకున్నా ఆయన మరణానంతరం దానిని అప్పటి సీఎం ప్రక్కన పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. రైల్వేకోడూరు నియోజకవర్గంలో కోల్డ్ స్టోరేజీ లేకపోవడంతో వేల ఎకరాల్లో పంట దిగుబడి సాధిస్తున్న రైతులకు గిట్టబాటు ధర రాక అవస్థలు పడుతున్నారన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ అమలు చేయకపోవడంతో రైతులు అవస్థలు పడుతున్నారన్నారు. పై నాలుగు పనులకు అధికార పార్టీ నుంచి స్పష్టమైన జీఓ తెచ్చి చూపిస్తే రాజీనామా చేయడానికి సిద్దమేనని సవాల్ చేశారు. ఇలాంటివి ప్రక్కనపెట్టి ఏ ప్రభుత్వం వచ్చినా రోటీన్‌గా వచ్చే నిధులను ఉపయోగించి చేసే పనులను తాను చేసినానని చెప్పుకోవటం ఏమిటని ప్రశ్నించారు. రాజీనామాలు మాకు కొత్త కాదన్నారు. పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో అభివృద్ధి కోసం కృషి చేస్తామని గుర్తు చేశారు. -
ఇవి మాటల ప్రభుత్వాలు..
రైల్వేకోడూరు రూరల్: ఈ నెల 10న ఢిల్లీలో జంతర్‌మంతర్ వద్ద వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో జరిగే ధర్నా పోస్టర్లను స్థానిక వైఎస్ అతిథి గృహంలో శుక్రవారం ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు, నియోజకవర్గ కన్వీనర్ కొల్లం బ్రహ్మానందరెడ్డితో కలిసి విడుదల చేశారు. అనంతరం ఎమ్మెల్యే విలేకర్ల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలవి మాటలే తప్ప చేతలు లేవని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర విభజన చేసే సమయంలో కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తామని చంద్రబాబు గొప్పలు పలికి ఇప్పుడు మౌనంగా ఎందుకు ఉన్నారని ప్రశ్నించారు. తమ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి తలపెట్టిన ఈ ధర్నాలో అందురూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యురాలు మారెళ్ల రాజేశ్వరి, పట్టణ కన్వీనర్ సీహెచ్ రమేష్, జిల్లా మైనార్టీ నాయకులు ఎన్.మస్తాన్, నందాబాలా, నియోజకవర్గ అధికార ప్రతినిధి ఎం.నాగేంద్ర, క్షత్రియ నాయకులు డి.క్రిష్ణమరాజు, ఎంపీటీసీ రవికుమార్, పార్టీ నాయకులు యానాదిరెడ్డి, రామక్రిష్ణయ్య, ఓబులవారిపల్లె మండల యూత్ కన్వీనర్ జయపాల్‌రెడ్డి, జిల్లా యూత్ స్టీరింగ్ కమిటీ సభ్యులు భరత్ కుమార్‌రెడ్డి, తదితరులు ల్గొన్నారు.