రాజీనామాకు సిద్ధం:కొరముట్ల | Prepared to resign: koramutla | Sakshi
Sakshi News home page

రాజీనామాకు సిద్ధం:కొరముట్ల

Published Fri, Aug 25 2017 3:39 AM | Last Updated on Tue, May 29 2018 4:40 PM

రాజీనామాకు సిద్ధం:కొరముట్ల - Sakshi

రాజీనామాకు సిద్ధం:కొరముట్ల

స్పష్టమైన జీఓ చూపించాలి

రైల్వేకోడూరు : ప్రజా సంక్షేమం కోసం పోరాటాలు చేస్తున్న వైఎస్సార్‌సీపీ తరపున తాను ఎమ్మెల్యేగా గెలిచానిని, ఎవరైనా సరే వెయ్యి కోట్లతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానంటే రాజీనామా చేయడానికైనా సిద్ధంగా ఉన్నానని ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు స్పష్టం చేశారు. పట్టణంలో గురువారం ఆయన  విలేకర్లతో మాట్లాడారు. ఇటీవల మాజీ ఎమ్మెల్సీ బత్యాల చంగల్రాయులు ఎమ్మెల్యే రాజీనామా చేస్తే ఆరు నెలల్లో ఎన్నికలు వస్తాయని, వెయ్యి కోట్లతో అభివృద్ది పనులు జరుగుతాయన్న దానిపై  స్పందించి తనదైన శైలిలో గట్టిగా ప్రతిఘటించారు. 2014 ఎన్నికల ముందు అన్ని పార్టీల నాయకులు ఇచ్చిన హామీలు నీటిమూటలయ్యాయని ఎద్దేవా చేశారు.  రైల్వేకోడూరుకు  బైపాస్‌ రోడ్డు లేదన్నారు. దీంతో ప్రమాదాలు ఎక్కువగా ఉన్నాయని, అసెంబ్లీలో కూడా రెండు మూడు సార్లు చర్చించామన్నారు.

కోడూరు– వెంకటగిరి రోడ్డు కలగా మిగిలిపోయిందని, వెంకటగిరికి  చిట్వేలి, రేణిగుంట మీదుగా  వెళ్లాల్సి వస్తోందన్నారు. గల్లా అరుణకుమారి మంత్రిగా ఉన్న కాలంలో రైల్వేకోడూరు వెంకటగిరి రోడ్డు గురించి  పలుమార్లు చర్చించామన్నారు.
14 గ్రామాల ప్రజలు, హైస్కూల్, జూనియర్, డిగ్రీ కళాశాల విద్యార్థులు అండర్‌ బ్రిడ్జి లేక అవస్థలు పడుతున్నారన్నారు. దీనిపై ఎన్ని పోరాటాలు చేసినా ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. దివంగత నేత వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి హయాంలో రైల్వేఅండర్‌ బ్రిడ్జి ఫైల్‌ కదిలి జీఓ దశకు చేరుకున్నా ఆయన మరణానంతరం దానిని అప్పటి సీఎం ప్రక్కన పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. రైల్వేకోడూరు నియోజకవర్గంలో  కోల్డ్‌ స్టోరేజీ లేకపోవడంతో వేల ఎకరాల్లో పంట దిగుబడి సాధిస్తున్న రైతులకు గిట్టబాటు ధర రాక అవస్థలు పడుతున్నారన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ అమలు చేయకపోవడంతో రైతులు అవస్థలు పడుతున్నారన్నారు.

పై నాలుగు పనులకు  అధికార పార్టీ నుంచి స్పష్టమైన జీఓ తెచ్చి చూపిస్తే రాజీనామా చేయడానికి సిద్దమేనని సవాల్‌ చేశారు. ఇలాంటివి ప్రక్కనపెట్టి ఏ ప్రభుత్వం వచ్చినా రోటీన్‌గా వచ్చే నిధులను ఉపయోగించి చేసే పనులను తాను చేసినానని చెప్పుకోవటం ఏమిటని ప్రశ్నించారు. రాజీనామాలు మాకు కొత్త కాదన్నారు. పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి సారథ్యంలో అభివృద్ధి కోసం కృషి చేస్తామని గుర్తు చేశారు.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement