సాక్షి, అమరావతి : భావితరాలకు మంచి జరగాలనే ఆలోచనతోనే సీఎం జగన్‌మోహన్‌రెడ్డి కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. తెలుగు భాషపై టీడీపీ నాయకులకే ప్రేమ ఉన్నట్టు మాట్టాడుతున్నారని విమర్శించారు. శనివారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తెలుగు భాష తల్లిలాంటిదని తమ ప్రభుత్వం ఎప్పుడూ గౌరవిస్తుందని స్పష్టం చేశారు. శుక్రవారం విజయవాడలో జరిగిన ఓ సమావేశంలో ప్రభుత్వంపై కొందరు మాట్లాడిన తీరు అభ్యంతరకరంగా ఉందని, వారి వ్యాఖ్యలను తప్పుపట్టారు. తెలుగు భాషను విస్మరిస్తున్నారంటూ కొందరు కక్షపూరితంగా దుష్ప్రచారం చేస్తున్నారని అంబటి మండిపడ్డారు.
ప్రస్తుతం ఉన్న పోటీ ప్రపంచంలో ఎదగాలంటే ఇంగ్లీష్ తప్పనిసరి అని చెప్పుకొచ్చారు. ఇంగ్లీష్ మీడియంను వ్యతిరేకిస్తున్న వారు వారి పిల్లలను ఏ మీడియంలో చదివించారో చెప్పాలని డిమాండ్ చేశారు. వచ్చే ఏడాది నుంచి ప్రభుత్వం పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంను ఖచ్చితంగా ప్రవేశపెడుతామని అంబటి స్పష్టం చేశారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రభుత్వం ఏం చేసినా కొన్ని పత్రికలు అసత్య ప్రచారం చేస్తున్నాయని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మరోవైపు మీడియా ప్రతినిధులపైన దాడిని అంబటి తీవ్రంగా ఖండించారు. వారిపై దాడి చేసింది రైతులు కాదని, విధ్వంసాలు సృష్టించాలని ప్రయత్నిస్తున్న కొన్ని శక్తులు ఈ ఘటనకు పాల్పడ్డాయని అనుమానం వ్యక్తం చేశారు. జర్నలిస్ట్‌పై దాడికి టీడీపీ నేతల బాధ్యత వహించాలని అంబటి అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment