'గుడివాడకు రా.. తేల్చుకుందాం..'
అసెంబ్లీలో ప్రతిపక్ష సభ్యులను తీవ్రపదజాలంతో దూషించి సభా సంప్రదాయాల్ని మంటగలిపిన టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావుకు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కొడాలి నాని కౌంటర్ ఇచ్చారు.
చంద్రబాబు రాసిచ్చిన స్లిప్పులు చదవడం.. చట్టసభల్లో ఇష్టం వచ్చినట్లు మాట్లాడటంకాదు.. గుడివాడకొస్తే ఎవరి దమ్మెంతో తేల్చుకుందామని సవాల్ విసిరారు. బాబు, బోండా రాష్ట్రానికి శనిలా దాపురించారని దుయ్యబట్టారు. సీఎంగా ప్రమాణం చేసినప్పటినుంచి రకరకాల విదేశీయాత్రలు, అనవసర కార్యక్రమాలకోసం చంద్రబాబు రూ.10 వేల కోట్ల ప్రజాధనాన్ని వృథాచేశారని ఆరోపించారు.