
ఓవైపు విరాళాలు ...మరోవైపు విపరీతమై ఖర్చులా?
హైదరాబాద్ : ఓవైపు రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో ఉందంటూనే మరోవైపు ప్రభుత్వం మంత్రుల ఇంటి అద్దె అలవెన్స్నులను పెంచింది. ఇప్పటివరకూ మంత్రుల ఇంటి అద్దె అలవెన్సు రూ.50వేలు ఉండగా, దాన్ని ప్రభుత్వం లక్షకు పెంచింది. ఈ మేరకు అసెంబ్లీలో బిల్లు ఆమోదం పొందింది. దీనిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రం ఆర్థిక సంక్షోభం ఉందంటూనే ఈ దుబారా ఏంటని ప్రశ్నించారు. రాష్ట్ర రాజధాని కోసం ఓవైపు విరాళాలు అడుగుతూ...మరోవైపు విపరీతంగా ఖర్చులు పెడుతున్నారని కోటంరెడ్డి మండపడ్డారు.