
సాక్షి, తిరుపతి : ఏపీ సీఎం చంద్రబాబుపై వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఆర్‌కే రోజూ విమర్శల వర్షం కురిపించారు. కేబినెట్ పదవిలో ఉన్న వ్యక్తులకు కూడా రక్షణ కల్పించలేని అసమర్ధ సీఎం చంద్రబాబు అని మండిపడ్డారు. ప్రజా ప్రతినిధులకే రక్షణ ఇవ్వలేని సీఎం ఇక సాధారణ ప్రజలకు ఏవిధంగా రక్షణ కల్పించగలరని ప్రశ్నించారు. తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే ప్రతిపక్షంపై బురదజల్లుతున్నారని విమర్శించారు. టీడీపీ నేతల జంట హత్యల నేపథ్యంలో ప్రభుత్వం ప్రజా ప్రతినిధులకు, ప్రజలకు రక్షణ కల్పించడంలో తీవ్రంగా విఫలమైందని ఆమె ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment