చైర్మన్ కుర్చీ వైఎస్సార్ సీపీదే | ysrcp Municipal elections Chairman post | Sakshi
Sakshi News home page

చైర్మన్ కుర్చీ వైఎస్సార్ సీపీదే

Published Thu, Jun 19 2014 2:23 AM | Last Updated on Tue, May 29 2018 4:06 PM

చైర్మన్ కుర్చీ వైఎస్సార్ సీపీదే - Sakshi

చైర్మన్ కుర్చీ వైఎస్సార్ సీపీదే

 బొబ్బిలి: మున్సిపల్ ఎన్నికల్లో ఎక్కువ స్థానాలు గెలుచుకున్న వైఎస్సార్ సీపీ అభ్యర్థులే చైర్మన్ స్థానంలో కూర్చుంటారని ఆపార్టీ కౌన్సిలర్లు ధీమా వ్యక్తం చేశారు. తామంతా పార్టీ మారుతున్నామంటూ జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని చెప్పారు. బుధవారం వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లుంతా ఇక్కడి దర్బార్ మహాల్‌లో విలేకరులతో మాట్లాడారు.స్థానిక సంస్థల ఎన్నికలు జరిగినా.. ఇప్పటి వరకూ పదవీ ప్రమాణ స్వీకారాలు చేపట్టలేదని దుస్థితిలో ఈ ప్రభుత్వం ఉందన్నారు. మున్సిపాలిటీలో ఎక్స్ అఫిషియో సభ్యుడితో కలిపి 16 స్థానాలున్న వైఎస్సార్ సీపీ చైర్మన్ స్థానాన్ని దక్కించుకుంటుందన్నారు. తమలో ఎవరికి బొబ్బి లి రాజులు బొట్టు పెడితే వారికి సంపూర్ణ సహకా రం అందిస్తామని తెలిపారు. బొబ్బిలి రాజులు ఇప్పటివరకూ నీతివంతమైన పాలన అందించారని, వారి స్థాయికి భంగం కలగకుండా తాము కూ డా ప్రజలకు మంచి పాలన అందిస్తామని చెప్పా రు. ఈ సమావేశంలో కౌన్సిలర్లు చెలికాని మురళీకృష్ణ, రౌతు రామ్మూర్తి, ఏగిరెడ్డి శ్రీథర్, రాంబార్కి శరత్, తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement