=అధినేత జగన్ పిలుపుతో పలు రూపాల్లో నిరసన
=సమైక్య తీర్మానాలు, దిష్టిబొమ్మల దహనం
=నరకాసుర వధ పేరిట వినూత్న కార్యక్రమాలు
=ప్రధాని, రాష్ట్రపతికి ఎస్‌ఎంఎస్‌లు
సాక్షి, విశాఖపట్నం: సమైక్యాంధ్ర ఉద్యమ సెగ లు కొనసాగుతున్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి పిలు పు మేరకు పార్టీ శ్రేణులు ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తున్నాయి. రిలే దీక్షలు, రాస్తారోకో, మానవహారాలు, దిష్టిబొమ్మ దహనం, ధర్నాలతో హోరెత్తిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ అ వతర దినోత్సవం సందర్భంగా పార్టీ పిలుపు మేరకు సమైక్యాంధ్ర కోరుతూ రాష్ట్ర విభజన నరకాసుర వధ పేరిట విభజనవాదుల దిష్టిబొమ్మల దహనం కార్యక్రమాలను నియోజకవర్గాల్లో నిర్వహించారు. గ్రామీణ ప్రాంతంలో పంచాయతీల నుంచి సమైక్య తీర్మానాలు తీసుకున్నారు.
యలమంచిలి నియోజకవర్గంలో సమన్వయకర్త ప్రగడ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో పట్టణంలో సమైక్యాంధ్రకు మద్దతుగా గ్రామ సభ తీర్మానాల్ని చేసి, ప్రధానికి, రాష్ట్రపతికి ఎస్‌ఎంఎస్‌లు పంపారు.
నర్సీపట్నం నియోజకవర్గంలో స్థానిక సమన్వయకర్త పెట్ల ఉమాశంకర్‌గణేష్ ఆధ్వర్యం లో సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద రిలే దీక్షల్లో 15వ వార్డు నాయకులు ఉషారెడ్డి, మహిళలు పాల్గొన్నారు.
పాడేరు నియోజకవర్గంలో సమన్వయకర్త వంజంగి కాంతమ్మ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణు లు సమైక్యాంధ్ర తీర్మానం చేశాయి. పంచాయతీలు చేసిన తీర్మానాల్ని అధిష్టానికి పంపించారు.
అరకు నియోజకవర్గంలో పార్టీ సమన్వయకర్తలు కుంభా రవిబాబు, కిడారి సర్వేశ్వరరావు ఆధ్వర్యంలో సమైక్యాంధ్రకు మద్దతుగా పంచాయతీల తీర్మానం చేశారు. సోనియా, చంద్రబాబు దిష్టిబొమ్మల దహనం చేపట్టారు.
పెందుర్తి నియోజకవర్గంలో పార్టీ సమన్వయకర్త గండి బాబ్జీ నేతృత్వంలో పంచాయతీ ల నుంచి సమైక్యాంధ్ర తీర్మానాలు సేకరించారు.
భీమిలి నియోజకవర్గంలో పార్టీ సమన్వయకర్త కోరాడ రాజబాబు ఆనందపురం మండలంలోని పంచాయతీల నుంచి సమైక్య తీర్మానాలు సేకరించారు. తగరపువలసలో అక్కరమాని విజయనిర్మల ఆధ్వర్యంలో నరకాసుర వధ పేరిట విభజనవాదుల దిష్టిబొమ్మల్ని దహనం చేశారు.
విశాఖ తూర్పు నియోజకవర్గంలో పార్టీ నగ ర కన్వీనర్ వంశీకృష్ణ శ్రీనివాస్ నేతృత్వంలో చినవాల్తేరులో ‘విభజన నరకాసుర వధ’లో భాగంగా సోనియా, చంద్రబాబు దిష్టి బొమ్మ ల్ని దహనం చేశారు. సమైక్యాంధ్రకు మద్దతు గా నినాదాలు చేశారు.
విశాఖ ఉత్తర నియోజకవర్గంలో పార్టీ సమన్వయకర్త జి.వి.రవిరాజు ఆధ్వర్యంలో సమైక్యాంధ్రకు మద్దతుగా గురుద్వార కూడలి వద్ద రాస్తారోకో, సోనియా, చంద్రబాబుల దిష్టిబొమ్మల్ని దహనం చేశారు.
విశాఖ దక్షిణ నియోజక వర్గంలో పార్టీ సమన్వయకర్త కోలా గురువులు ఆధ్వర్యంలో నియోజకవర్గ పరిధిలోని 14 వార్డుల నేతలతో సమైక్య తీర్మానాలు చేయించి పార్టీ అధిష్టానా నికి పంపించారు. సాయంత్రం ‘రాష్ట్ర విభజన నరకాసురుల వధ’ పేరిట సోనియా గాంధీ, చంద్రబాబు దిష్టిబొమ్మల్ని దహనం చేశారు.
విశాఖ పశ్చిమ నియోజక వర్గంలో పార్టీ నగర బీసీ సెల్ కన్వీనర్ పక్కి దివాకర్ నేతృ త్వంలో మల్కాపురం కూడలిలో సోనియా దిష్టి బొమ్మకు చంద్రబాబు, దిగ్విజయ్‌సింగ్, చిదంబరం, షిండే, కేసీఆర్, హరీష్‌రావు, కిర ణ్‌కుమార్‌రెడ్డి, బొత్స, ఉత్తమ్‌కుమార్, జానారెడ్డి తలల్ని తగిలించి మొత్తం పది తలల దిష్టిబొమ్మను ఊరేగించారు. నరకా సుర వధ పేరిట అనంతరం దాన్ని దహనం చేశారు.
గాజువాక నియోజకవర్గంలో పార్టీ సమ న్వయకర్త తిప్పలనాగిరెడ్డి ఆధ్వర్యంలో రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. 51, 52 వార్డుల్లో సమైక్యాంధ్రకు మద్దతుగా సంతకాల సేకరణ చేపట్టారు.