జనసంద్రమైన కలిగిరి | Ysrcp Road Show in Kaligiri | Sakshi
Sakshi News home page

జనసంద్రమైన కలిగిరి

Published Sat, Apr 6 2019 6:49 PM | Last Updated on Sat, Apr 6 2019 6:50 PM

Ysrcp Road Show in Kaligiri - Sakshi

కలిగిరిలో రోడ్‌షోలో మాట్లాడుతున్న మేకపాటి, పక్కన ఆదాల

కలిగిరి: వైఎస్సార్‌సీపీ నెల్లూరు ఎంపీ అభ్యర్థి ఆదాల ప్రభాకర్‌రెడ్డి, ఉదయగిరి ఎమ్మెల్యే అభ్యర్థి మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో కలిగిరిలో శుక్రవారం నిర్వహించిన రోడ్డుషో జనసంద్రాన్ని తలపించింది. కలిగిరి మండలంలోని అన్నిగ్రామాల నుంచి వేలాది మంది నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు. తహసీల్దార్‌ కార్యాలయం నుంచి కలిగిరమ్మతల్లి ఆలయం వరకు నిర్వహించిన రోడ్డుషో పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహాన్ని నింపింది. వందలాది మంది యువకులు బైక్‌ ర్యాలీ నిర్వహించారు. వేలాది మంది అభిమానుల మధ్య నేతలు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కలిగిరిలో ఇంతవరకు ఇంతపెద్ద భారీ ర్యాలీ జరగలేదని చర్చించుకోవడం విశేషం.

ఎంపీ అభ్యర్థి ఆదాల, ఎమ్మెల్యే అభ్యర్థి మేకపాటి మాట్లాడుతూ ఇదే ఉత్సహంతో మరో ఐదు రోజులు కష్టపడి పనిచేస్తే భారీ మెజారిటీలు సాధించుకోవచన్నారు. కలిగిరి ఎంపీపీ మద్దసాని వెంకటేశ్వరరావు, కలిగిరి బిట్‌ 1 ఎంపీటీసీ సభ్యుడు కంచెంరెడ్డి మాల్యాద్రిరెడ్డి తమ అనుచరులతో కలసి భారీ సంఖ్యలో వైఎస్సార్‌సీపీలో చేరారు. కార్యక్రమంలో కావ్య కృష్ణారెడ్డి, పాలూరు మాల్యాద్రిరెడ్డి, కాటం రవీంద్రారెడ్డి, నోటి శ్రీనివాసులురెడ్డి, మెట్టుకూరు చిరంజీవిరెడ్డి, ఎం.భాస్కర్‌ రెడ్డి, కోడూరు కృష్ణారెడ్డి, ఎం. కేశవులురెడ్డి, లక్ష్మీనారాయణ, మోహన్, ప్రసాద్, రియాజ్‌రెడ్డి, హజరత్‌రెడ్డి, అంకిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement