mekapati chandrasekhar reddy
-
ఉదయగిరిలో ఫ్యాన్ ప్రభంజనమే
జిల్లాలో ఉదయగిరి నియోజకవర్గానికి ప్రత్యేక స్థానం ఉంది. ఎనిమిది మండలాలతో అతి పెద్ద వైశాల్యం గల ప్రాంతంగా పేరు గడించింది. విలక్షణ తీర్పునివ్వడం ఇక్కడి ప్రజల ప్రత్యేకత. గడిచిన ఆరు ఎన్నికల సరళిని పరిశీలిస్తే ఇక్కడి ఓటర్లు ఎక్కువగా మేకపాటి కుటుంబం వైపే మొగ్గు చూపారు. నాటి నుంచి 2019 ఎన్నికల వరకు కేవలం రెండుసార్లే టీడీపీ విజయం సాధించింది. ఈ క్రమంలో సీఎంగా జగన్మోహన్రెడ్డి అందించిన సంక్షేమ, అభివృద్ధి పాలన.. మేకపాటి కుటుంబానికి ఉన్న ఆదరణతో ఈ ఎన్నికల్లోనూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీదే విజయమనే సంకేతాలు వెలువడుతున్నాయి.ఉదయగిరి: ఈ ఎన్నికల్లోనూ ఉదయగిరిధారణ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి దక్కే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. సమర్థ పాలన.. పేదల ఆర్థికాభివృద్ధి కోసం సంక్షేమ పథకాలు.. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి చర్యలు.. పదవుల్లో బడుగు, బలహీనవర్గాలకు పెద్దపీట.. ఇలా సీఎం జగన్మోహన్రెడ్డి తన ఐదేళ్ల పాలనను సాగించారు. మరోవైపు ఉదయగిరి నియోజకవర్గంలో 40 ఏళ్లుగా మేకపాటి కుటుంబానికి పట్టుంది. పై రెండు కారణాలతో ఈ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థి మేకపాటి రాజగోపాల్‌రెడ్డికే విజయం వరించే అవకాశాలు మెండుగా మారాయి.సైకిల్‌కు అన్నీ మైనస్సులే..ఉదయగిరిలో టీడీపీ అభ్యర్థిగా బరిలో ఉన్న కాకర్ల సురేష్ ఎన్నారై. రాజకీయ అనుభవలేమి.. పార్టీ నేతల మధ్య కొరవడిన సఖ్యత.. చంద్రబాబు మాటలను ప్రజలు విశ్వసించకపోవడం.. గ్రూపు తగాదాలు.. వెరసి కాకర్లకు మైనస్సుగా మారాయి. కేవలం డబ్బునే నమ్ముకొని విజయ తీరాలకు చేరాలని ఆయన చేస్తున్న యత్నాలు ఫలించేలా కనిపించడంలేదు. కాకర్ల ట్రస్ట్ పేరిట కొన్ని కార్యక్రమాలను చేపట్టినా.. టికెట్ వచ్చేంత వరకు ప్రజలతో సత్సంబంధాల్లేకపోవడం ఆయనకు ఇబ్బందికరంగా పరిణమించింది. టీడీపీ టికెట్ ఖరారయ్యాక సైతం ప్రజల్లో తిరిగేందుకు తగిన సమయం లేకపోవడంతో సుడిగాలి పర్యటనలకే పరిమితమయ్యారు.మేకపాటి కుటుంబానికి సడలని పట్టుఉదయగిరి రాజకీయ ముఖచిత్రంలో మేకపాటి కుటుంబానికి దీర్ఘకాలంగా మంచి పట్టుంది. మేకపాటి కుటుంబానికి చెందిన రాజమోహన్‌రెడ్డి 1982లో రాజకీయ ప్రవేశం చేశారు. నాటి నుంచి నేటి వరకు ఉదయగిరి ప్రజల్లో ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో వ్యక్తిగత సంబంధాలు కలిగి ఉన్నారు. 1985లో కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యేగా ఈయన గెలుపొందారు. తదుపరి 2004, 2009లో మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి కాంగ్రెస్ తరఫున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. వైఎస్సార్సీపీ ఆవిర్భావం అనంతరం తన ఎమ్మెల్యే పదవి, కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసిన ఆయన 2012 ఉప ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై పోటీ చేసి ఘన విజయం సాధించారు. అనంతరం 2019 ఎన్నికల్లో మరోసారి వైఎస్సార్సీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. గెలుపోటములతో సంబంధం లేకుండా ఉదయగిరి ప్రజలతో నిత్యం సత్సంబంధాలను కొనసాగిస్తుండటంతో మేకపాటి కుటుంబీకులు మన్ననలను పొందగలిగారు.16 ఎన్నికల్లో రెండు సార్లే..1955లో ఉదయగిరి నియోజకవర్గం ఆవిర్భవించింది. ఇప్పటి వరకు 16 సార్లు జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఒకసారి జనతా పార్టీ, మరోసారి బీజేపీ, రెండుసార్లు స్వతంత్రులు, రెండుసార్లు టీడీపీ అభ్యర్థులు గెలుపొందారు. మిగిలిన అన్నిసార్లు కాంగ్రెస్, వైఎస్సార్సీపీకే విజయాలే దక్కాయి. 1999లో కంభం విజయరామిరెడ్డి.. 2014లో బొల్లినేని వెంకటరామారావు స్వల్ప మెజార్టీతో టీడీపీ తరపున విజయం సాధించారు. దీన్ని బట్టి వైఎస్సార్సీపీ విజయం నల్లేరుపై నడకేననే సంకేతాలు వెలువడుతున్నాయి.ఫ్యాన్‌కే జై..ఉదయగిరి బరిలో రెండు ప్రధాన పార్టీల అభ్యర్థులూ కొత్తవారే కావడం విశేషం. అయితే వైఎస్సార్సీపీ అభ్యర్థి మేకపాటి రాజగోపాల్‌రెడ్డికి కుటుంబ బలం, ప్రజల్లో ఆదరణ ఎక్కువగా ఉండటంతో విజయావకాశాలు ఆయనకే మెండుగా కనిపిస్తున్నాయి. 20 ఏళ్లుగా జరిగిన సార్వత్రిక ఎన్నికలను పరిశీలిస్తే నియోజకవర్గంలోని ఉదయగిరి, వింజమూరు, జలదంకి, కలిగిరి మండలాలు టీడీపీయేతర పార్టీలకే అనుకూలంగా ఫలితాలిస్తున్నాయి. ప్రస్తుతం ఈ నాలుగు మండలాలతో పాటు సీతారామపురంలోనూ వైఎస్సార్సీపీకే స్పష్టమైన ఆధిక్యత కనిపిస్తోంది. కొండాపురం, వరికుంటపాడు, దుత్తలూరు మండలాల్లో హోరాహోరీ తప్పేలా లేదు. ఉదయగిరి కోటలో వైఎస్సార్సీపీ జెండా ఎగరడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.నిరంతరం మమేకంతొమ్మిది నెలలుగా వైఎస్సార్సీపీ అభ్యర్థి రాజగోపాల్‌రెడ్డి నిత్యం ప్రజల్లో ఉంటూ నియోజకవర్గంలోని ప్రతి ఊరు, గడపకూ వెళ్లి సీఎం జగనన్నను ఆశీర్వదించాలని కోరారు. తమ పార్టీకి అండగా ఉండాలంటూ విస్తృత ప్రచారం చేయడం.. ప్రజలతో మమేకమవ్వడం ఆయనకు కలిసొచ్చే అంశం. -
వెన్నుపోటు నేతలకు భంగపాటు
సాక్షి ప్రతినిధి, నెల్లూరు:నమ్మిన వారిని మోసం చేయడం, వారిని నట్టేట ముంచేయడం చంద్రబాబు నాయుడి నైజం. సొంత మామనే వెన్నుపోటు పొడిచి అధికారాన్ని లాక్కున్న చంద్రబాబు నిజస్వరూపం తెలిసి కూడా మరోసారి నెల్లూరు జిల్లాకు చెందిన వైఎస్సార్సీపీ బహిష్కృత ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్రెడ్డిలు బొక్కబోర్లా పడ్డారు. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఆ ఎమ్మెల్యేల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. పార్టీలోకి ఆహ్వానించినప్పుడు చెప్పిన తియ్యటి మాటలు ఇప్పుడు విన్పించడం లేదు. దీంతో ఆ ముగ్గురి రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. మాటమార్చి మోసం చేసి.. వెంకటగిరి, నెల్లూరురూరల్, ఉదయగిరి ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్రెడ్డిలు చంద్రబాబు చేసిన మోసంపై మథన పడుతున్నారు. జిల్లాలోనే ప్రముఖ రాజకీయ కుటుంబం నుంచి వచ్చి సీనియర్ పొలిటీషియన్‌గా ఉన్న ఆనం రామనారాయణరెడ్డి పరిస్థితి ప్రస్తుతం కుడితిలో పడ్డ ఎలుకలా తయారైంది. కాంగ్రెస్ పార్టీలో ఓ వెలుగు వెలిగిన ఆనం ప్రస్తుతం చంద్రబాబు రాజకీయ క్రీడలో ఓ పావుగా మారారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఆయనను 2016లో ఎమ్మెల్సీ లేదా మంత్రి పదవి ఆశ చూపడంతో టీడీపీలో చేరారు. పచ్చ కండువా కప్పుకోగానే మాట మార్చిన చంద్రబాబు కనీసం ఆత్మకూరు పార్టీ ఇన్‌ఛార్జ్‌గా కూడా ఇవ్వకుండా అవమానించారు. టీడీపీలో జరిగిన అవమానాల్ని తట్టుకోలేక కుమిలిపోతున్న తరుణంలో వైఎస్సార్సీపీ అక్కున చేర్చుకుని వెంకటగిరి నుంచి బరిలోకి దింపి గెలిపించుకుంది. అయితే అక్కున చేర్చుకున్న పార్టీనే కాదనుకున్న ఆనం పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు చేయడంతో ఆయన్ను పార్టీ నుంచి బహిష్కరించాల్సి వచ్చింది. దీంతో ఆనం టీడీపీ నేతలతో టచ్‌లోకి వెళ్లి పార్టీ కండువా కప్పుకోకుండానే లోకేశ్ యువగళం పాదయాత్రలో హల్చల్ చేశారు. జిల్లా పార్టీ సారథ్య బాధ్యతలతో పాటు నెల్లూరు సిటీ, ఆత్మకూరు సీట్లు ఇస్తామని టీడీపీ అధినేత నమ్మబలకడంతో ఆనం యువగళంలో పాల్గొన్నారు. తీరా ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అ«ధినేత మాట మారింది. జిల్లా పార్టీ సారథ్య బాధ్యతలు కాకుండా.. ఒక్క ఆత్మకూరుకే పరిమితం కావాలని ఆదేశాలొచ్చాయి. ఆత్మకూరులో వైఎస్సార్సీపీ బలంగా ఉంది. టీడీపీ అంతర్గత సర్వేల్లో కూడా ఈ విషయం తేలడంతో ఆత్మకూరులో పోటీ చేస్తే ఓటమి తప్పదని తెలుసుకున్న ఆనం తనకు నెల్లూరు సిటీ లేదా వెంకటగిరి స్థానాన్ని కేటాయించాలని చంద్రబాబు వద్ద మొర పెట్టుకున్నా ఫలితం లేకుండా పోయింది. ఆత్మకూరు లేదా సర్వేపల్లిలో పోటీ చేయాలని తెగేసి చెప్పడంతో ఆనంకు దిక్కతోచని పరిస్థితి నెలకొంది. చంద్రబాబును నమ్మి మరోసారి మోసపోయానంటూ ఆంతరంగికుల వద్ద వాపోయినట్లు ప్రచారం జరుగుతోంది. ఇటీవల ఉదయగిరికి చెందిన కొందరు టీడీపీ నేతలు ఆనం వద్దకు వెళ్లి ఉదయగిరి రావాలని ఆహ్వానించగా పార్టీలో తన పరిస్థితి ఏమిటో అర్థం కావటం లేదని వాపోయారని తెలుస్తోంది. కోటంరెడ్డి సీటు వెనుక కుట్ర నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి పరిస్థితి కూడా టీడీపీలో అయోమయంగా మారింది. రూరల్ టీడీపీ టికెట్ నీదేనంటూ మాట ఇచ్చిన చంద్రబాబు ఇప్పుడు ఆ సీటు జనసేనకు ఇచ్చేందుకు తెరవెనుక రాజకీయం చేస్తున్నారన్న సమాచారం రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. జిల్లాలో ఒక్క సీటైనా జనసేన అడిగే అవకాశం ఉంది. ముందుగా నెల్లూరు సిటీ మీద జనసేన కన్నుపడింది. అయితే మాజీ మంత్రి పొంగూరు నారాయణ తన సామాజికవర్గంలో ఉన్న పరపతిని ఉపయోగించి జనసేన అధినేత వద్ద పంచాయితీ పెట్టారని, నెల్లూరు సీటు ఆశించకుండా ఉంటే ప్యాకేజీతోపాటు మరోచోట పోటీ చేస్తే అక్కడ అయ్యే ఖర్చంతా తానే భరిస్తానంటూ షరతు పెట్టారని ప్రచారం జరుగుతోంది. కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డికి రూరల్ టికెట్ రాకుండా తెరవెనుక కుట్ర చేస్తున్నారనే ప్రచారం కూడా ఉంది. చంద్రశేఖర్‌రెడ్డికి చంద్రబాబు ఝలక్ ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి రాజకీయ భవితవ్యం అగమ్యగోచరంగా మారింది. ఉదయగిరి టికెట్ నీదేనంటూ చంద్రబాబు మాటలు నమ్మి టీడీపీ కండువా కప్పుకున్న చంద్రశేఖర్‌రెడ్డికి చంద్రబాబు ఝలక్ ఇచ్చారు. అసెంబ్లీ టికెట్ కాదు కదా ఎమ్మెల్సీ కూడా ఇచ్చేది లేదని, ముందు పార్టీకి పనిచేయాలంటూ ఆదేశాలిచ్చారంట. చంద్రశేఖర్‌రెడ్డి సతీమణికి పార్టీ పదవి ఇచ్చి ‘ఈ పదవే నీకు ఎక్కువ ఇక చాలు’ అని చెప్పడంతో చంద్రశేఖర్‌రెడ్డి మైండ్ బ్లాంక్ అయిందని చెప్పుకుంటున్నారు. ఇటుఉదయగిరిలో కూడా టీడీపీ నేతలు చంద్రశేఖర్‌రెడ్డికి కనీస గౌరవంకూడా ఇవ్వటం లేదు. పార్టీ కార్యక్రమాలకు కూడా ఆహ్వానించక పోవడంతో ఆయన పరిస్థితి కూడా కుడితిలో పడ్డ ఎలుకలా తయారై ఇంటికే పరిమితం అయ్యారనే ప్రచారం సాగుతోంది. -
ఏపీ: ఫిరాయింపు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై వైఎస్సార్సీపీ ఫిర్యాదు
సాక్షి, అమరావతి: పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై వైఎస్సార్సీపీ అధిష్టానం సీరియస్ అయ్యింది. పార్టీ ఫిరాయించిన నలుగురు ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎమ్మెల్సీలను అనర్హులుగా చేయాలని అసెంబ్లీ స్పీకర్‌కు, మండలి చైర్మన్‌కు ఫిర్యాదు చేసింది. ఎమ్మెల్యేలు ఉండవల్లి శ్రీదేవి, ఆనం రాంనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు వంశీకృష్ణ, సీ రామచంద్రయ్యపై అనర్హత వేటు వేయాలని ఫిర్యాదు చేసింది. పార్టీ తరపున మండలి కార్యదర్శికి ఎమ్మెల్సీలు మేరుగు మురళి, లేళ్ల అప్పిరెడ్డి ఫిర్యాదు చేశారు. -
నా వల్ల ఇబ్బందులు పడి ఉంటే క్షమించండి!.. టికెట్ నాకే ఇప్పించండి
బద్ధ శత్రువులుగా ఉండి ఉదయగిరి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించిన ఆ ముగ్గురు నేతలు ఇప్పుడు ఒక్కటైపోయారు. తమ రాజకీయ అవసరాల కోసం కలిసిపోయారు. వారే కంభం విజయరామిరెడ్డి, బొల్లినేని వెంకటరామారావు, మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి. దశాబ్దాలపాటు ఆదరించిన పార్టీకి మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి వెన్నుపోటు పొడిచి టీడీపీ నేతలతో చేతులు కలిపారు. నైతిక విలువలకు పాతరేసి ఆ ముగ్గురు నేతలూ ఏకం కావడంతో ప్రజల్లో పలచబడ్డారు. సాక్షి ప్రతినిధి, నెల్లూరు: రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, మిత్రులు ఉండరనేది నానుడి. కానీ ప్రస్తుత రాజకీయాల్లో నైతిక విలువలు లేకుండాపోయాయి. ఉదయగిరి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేలుగా ప్రాతినిధ్యం వహించిన, వహిస్తున్న కంభం విజయరామిరెడ్డి, బొల్లినేని వెంకటరామారావు, మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి గ్రూపు రాజకీయాలను ప్రోత్సహించారు. కంభం, బొల్లినేని ఒకే పార్టీలో ఉన్నప్పటికీ ఆ ఇద్దరూ ఎప్పుడూ ఒకే వేదికను పంచుకున్న దాఖలాలే లేవు. ఎవరికి వారు యమునా తీరే అన్నట్లుగా వ్యవహరించారు. ఒకరిపై ఒకరు పార్టీ పెద్దల వద్ద పంచాయితీలు పెట్టుకున్న సందర్భాలు కోకొల్లలు. అయితే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డికి కంభం, బొల్లినేనితో బద్ధ వైరం ఉండేది. వీరిలో ఎవరైనా మేకపాటిని విమర్శిస్తే.. నియోజకవర్గంలోని అన్ని మండలాల నేతలతో ప్రెస్మీట్లు పెట్టించి మరీ తిట్టించారు. మేకపాటి బహిరంగ వేదికలపై బొల్లినేనిపై అవినీతి ఆరోపణలు చేయడమే కాకుండా తన క్యాడర్‌తోనూ చేయించారు. ఇక కంభంపై అయితే మేకపాటి గతంలోనే విమర్శలు, ఆరోపణలు చేశారు. వైఎస్సార్ కుటుంబంతో ఎదిగి.. జిల్లాలో మేకపాటి కుటుంబానికి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అత్యంత ప్రాధాన్యం కల్పించారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సైతం వారికి అంతే ప్రాధాన్యం ఇచ్చారు. అయితే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి స్వార్థ రాజకీయాలు చేసి స్థాయిని దిగజార్చుకున్నారు. ఈ పరిణామాలు ముందుగానే గ్రహించిన మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి తన సోదరుడైనప్పటికీ చంద్రశేఖరరెడ్డిని దూరం పెట్టారు. నియోజకవర్గంలో అవినీతి, అక్రమాలకు తెరతీసిన చంద్రశేఖర్‌రెడ్డి తన గ్రాఫ్ పడిపోవడంతో రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో తనకు టికెట్ రాదనే అనుమానంతో రాజకీయ భిక్ష పెట్టిన పార్టీకి, ఆదరించిన ప్రజలను విస్మరించి టీడీపీతో చేతులు కలిపారు. పార్టీ క్యాడర్ దూరం రాజకీయ అవసరాల కోసం ఒకరికొకరు దూషించుకున్న చంద్రశేఖర్‌రెడ్డి, కంభం విజయరామిరెడ్డి, బొల్లినేని వెంకటరామారావు ఇప్పుడు ఒక వేదికపైకి రావడంతో వీరితో అంటకాగిన పార్టీ క్యాడర్ దూరంగా వెళ్లిపోతున్నారు. రాజకీయ విమర్శలు, అవినీతి ఆరోపణలు, భౌతికదాడులు చేసిన చంద్రశేఖర్‌రెడ్డితో ఎలా కలిసి పనిచేయాలని లోలోనే టీడీపీ క్యాడర్‌తోపాటు అధికారపార్టీ శ్రేణులు రగిలిపోతున్నాయి. ఈ పరిణామాలతో ప్రజల్లోనూ ఆ ముగ్గురు నేతలు పలచబారారు. టీడీపీలో బీసీ వాదన వైఎస్సార్సీపీ బీసీలకు ప్రాధాన్యం ఇచ్చేలా గత ఎన్నికల్లో జిల్లాలో ఒక ఎమ్మెల్యే టికెట్ కేటాయించింది. తర్వాత రాజ్యసభ టికెట్ బీసీలకు ఇచ్చింది. కానీ టీడీపీ మాత్రం బీసీలను ఉపయోగించుకోవడమే తప్ప వారికి పదవులు ఇవ్వడం లేదనే వాదన ఉంది. తాజాగా ఉదయగిరిలో బీసీ నేతగా ఉన్న చెంచలబాబు యాదవ్ టీడీపీ టికెట్ ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తున్నారు. బీసీలకు న్యాయం జరగాలంటే టికెట్ తమకే ఇవ్వాలని ఆయన పార్టీ అధిష్టానంపై ఒత్తిడి తెస్తున్నారు. వలస నేతల రాకతో టీడీపీలో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయో వేచిచూడాల్సిందే. కంభంతో కలిసి నిన్నటి వరకు రాజకీయ ప్రత్యర్థిగా ఉన్న కంభం విజయరామిరెడ్డిని చంద్రశేఖర్‌రెడ్డి కలిసి గతం..గతః అంటూ తనకు ఆశీస్సులు కావాలని కాళ్లబేరానికి వెళ్లాడని, తన వల్ల ఏవిధంగా అయినా ఇబ్బందులు పడి ఉంటే క్షమించమని ప్రాధేయపడ్డాడని తెలిసింది. ఈ పరిణామాలను చూసి టీడీపీ శ్రేణులు నివ్వెరపోయారని సమాచారం. అవసరం కోసం దిగజారి ఈ దఫా ఎన్నికల్లో పోటీపై ఆసక్తి చూపని బొల్లినేని గతంలోనే పార్టీ అధిష్టానానికి సంకేతం పంపారు. దీంతోపాటు పార్టీ అభ్యర్థిత్వం ఇప్పిస్తానంటూ ప్యాకేజీ మాట్లాడుకున్న ఇద్దరు నేతలను టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు వద్దకు తీసుకెళ్లిన ఘటనలు ఉన్నాయి. కాని ఆ నేతలను చంద్రబాబు పెద్దగా పట్టించుకోలేదు. ఈ క్రమంలో చినబాబు లోకేశ్ కాకర్ల సురేష్‌ను రంగంలోకి దింపడంతో ఆయన టికెట్ నాదేనంటూ ప్రకటించుకుంటున్నారు. ఇప్పటికే టీడీపీలో టికెట్ల లొల్లి జరుగుతున్న క్రమంలో టికెట్ తనకిస్తే పోటీ చేస్తానంటూ మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి రంగంలోకి దిగారు. నైతిక విలువలకు పాతరేసిన చంద్రశేఖర్‌రెడ్డి తనకు రాజకీయ శత్రువులుగా ఉన్న బొల్లినేని, కంభం ఇళ్లకు వెళ్లి వారి ఆశీస్సులు కోరారు. -
‘ఎమ్మెల్యే వీడినా నష్టం లేదు.. ఉదయగిరిలో వైఎస్సార్సీపీ బలంగా ఉంది’
సాక్షి,నెల్లూరు: ఉదయగిరి ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డికి వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ పార్టీలోని ముఖ్యనేతలు ఏకమౌతున్నారు. ఈ సందర్భంగా నెల్లూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశాన్ని మండలాల నేతలు భారీగా హాజరయ్యారు. సమావేశం అనంతరం ఉదయగిరి నియోజకవర్గ మాజీ పరిశీలకులు కొడవలూరు ధనుంజయ రెడ్డి దీనిపై మాట్లాడుతూ.. నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ బలంగానే ఉంది.. ఎమ్మెల్యే పార్టీ వీడినా ఎలాంటి నష్టం లేదని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి వైఖరి వల్ల నేతలు పార్టీకి దూరమయ్యారని ధ్వజమెత్తారు. ఎమ్మెల్యే ప్రోద్బలంతో వైసీపీ నేతలపై కేసులు నమోదయ్యాయని.. మండల కన్వీనర్ పదవులను చంద్రశేఖర్ రెడ్డి డబ్బులకు అమ్ముకున్నారని మండిపడ్డారు. పార్టీ పదవులను ఎమ్మెల్యే అమ్ముకుని అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని.. వీటిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని కోరారు. తన పై చంద్రశేఖర్ రెడ్డి చేసిన వ్యక్తిగత విమర్శల మీద న్యాయ పోరాటం చేస్తానన్నారు. -
ప్రతిసవాల్‌ను స్వీకరించని ఎమ్మెల్యే చంద్రశేఖర్‌రెడ్డి
ఉదయగిరి/ఆత్మకూరు: శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి విసిరిన సవాల్‌కు వైఎస్సార్సీపీ నాయకులు ప్రతిస్పందించారు. అయితే ఆయన మాత్రం వారి సవాల్‌ను స్వీకరించలేదు. ఉదయగిరికి రాలేదు. వివరాలిలా ఉన్నాయి. పార్టీకి అన్యాయం చేసిన చంద్రశేఖర్‌రెడ్డి ఉదయగిరిలో అడుగుపెడితే ఒప్పుకోబోమని సొసైటీ మాజీ అధ్యక్షుడు మూలె వినయ్‌రెడ్డి గురువారం ఉదయం హెచ్చరించారు. దీనికి స్పందించిన చంద్రశేఖర్‌రెడ్డి సాయంత్రం ఉదయగిరి బస్టాండ్ సెంటర్‌కు చేరుకుని ‘నేను బస్టాండ్‌లో ఉన్నాను.. ఏం చేస్తారో రా..’ అంటూ సవాల్ చేశారు. ఈ విషయం తెలిసిన వినయ్‌రెడ్డి.. తన అనుచరులతో బస్టాండ్ వద్దకు చేరుకునేలోపు ఎమ్మెల్యే వెళ్లిపోయారు. ఈ సందర్భంగా వినయ్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘ఈ రాత్రి, రేపు ఉదయగిరి బస్టాండ్‌లోనే ఉంటా.. దమ్ము, ధైర్యం ఉంటే ఇక్కడికి వచ్చి మాట్లాడాలి’ అని ఎమ్మెల్యే సవాల్‌కు ప్రతిసవాల్ చేశారు. శుక్రవారం ఉదయం ఉదయగిరి మాజీ ఎంపీపీ చేజర్ల సుబ్బారెడ్డి తమ అనుచరులతో బస్టాండ్‌కు వచ్చి అక్కడే ఉన్న వినయ్‌రెడ్డికి సంఘీభావంగా నిలిచారు. వారు ఎమ్మెల్యేకు ఫోన్ చేయగా.. ఆయన ఫోన్ కట్ చేశారు. ఆ తర్వాత అక్కడి వైఎస్సార్సీపీ నేతలు మాట్లాడుతూ.. సీఎంను, పార్టీ పెద్దలను ఒక్క మాట అన్నా సహించేది లేదని హెచ్చరించారు. కాగా, ఉదయగిరి బస్టాండ్ వద్ద సీఐ వి.గిరిబాబు ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అనారోగ్యంగా ఉన్నాను ఎమ్మెల్యే చంద్రశేఖర్‌రెడ్డి శుక్రవారం మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ.. తన సోదరుడు మేకపాటి రాజమోహన్‌రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను అనారోగ్యంతో ఉన్నానని, మెరుగైన వైద్యం కోసం ఆస్పత్రికి వెళుతున్నానని, ఆరోగ్యం కుదుటపడిన తర్వాత తనపై సవాల్ చేసిన వారి గురించి మాట్లాడతానని చెప్పారు. 2024లో తన ఆరోగ్య పరిస్థితిని బట్టి ఎన్నికల్లో పోటీచేస్తానని చెప్పారు. పార్టీకి భిన్నంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవు: ఎమ్మెల్యే విక్రమ్‌రెడ్డి ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డితో 3 సంవత్సరాలుగా తాము దూరంగా ఉంటున్నామని, ఎవరి వ్యాపారాలు వారు చేసుకుంటున్నామని ఆత్మకూరు ఎమ్మెల్యే విక్రమ్‌రెడ్డి చెప్పారు. ఆత్మకూరులో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. పార్టీ సిద్ధాంతాలకు భిన్నంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని పేర్కొన్నారు. మేకపాటి కుటుంబం పట్ల సీఎం జగన్, వారి కుటుంబ సభ్యులు ఎంతో ఆదరణగా ఉంటున్నారని తెలిపారు. సస్పెండైన వారు వెళ్లిపోయినంత మాత్రాన వైఎస్సార్సీపీకి ఎలాంటి నష్టంలేదని అన్నారు. తాను పార్టీ మారుతున్నట్లు కొన్ని చానెల్స్ విషప్రచారం చేశాయని, వాస్తవాలు తెలుసుకోకుండా అలా ప్రసారం చేయడం సరికాదన్నారు. -
మేకపాటి చంద్రశేఖర్ రెడ్డికి ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి దిమ్మదిరిగే కౌంటర్
-
ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి సవాల్‌ను స్వీకరించిన వైఎస్సార్సీపీ
సాక్షి, నెల్లూరు: ఉదయగిరిలో రాజకీయం వేడెక్కింది. ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి సవాల్‌ను వైఎస్సార్సీపీ శ్రేణులు స్వీకరించాయి. వైఎస్సార్సీపీ నేత మూలే వినయ్‌రెడ్డి వర్గీయులు బస్టాండ్ సెంటర్లో కూర్చున్నారు. అవినీతి ఎమ్మెల్యే, పార్టీ ద్రోహి మేకపాటి అంటూ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే మేకపాటి తన వద్ద డబ్బులు తీసుకున్నది వాస్తవం కాదా అంటూ మూలే వినయ్‌రెడ్డి సవాల్ విసిరారు. మేకపాటికి వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ నేతలు ఆందోళనకు దిగారు. పార్టీ ద్రోహి ఎమ్మెల్యే చంద్రశేఖర్‌రెడ్డి అంటూ నినాదాలు చేశారు. ఉదయగిరి నుంచి చంద్రశేఖర్‌రెడ్డి వెళ్లిపోవాలంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. కాగా, వైఎస్సార్సీపీ నేతలపై నోరు పారేసుకున్న మేకపాటి.. వారిపై రెచ్చ గొట్టే వ్యాఖ్యలు చేశారు. మేకపాటి చేసిన సవాల్‌తో వైఎస్సార్సీపీ నేతలు ఆందోళనకు దిగారు. చదవండి: కోటంరెడ్డి బ్రదర్స్ కోసం సొంతవాళ్లకే టీడీపీ వెన్నుపోటు.. పాపం అజీజ్! -
మాజీ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, నెల్లూరు: సీఎం జగన్ టికెట్ ఇచ్చినా.. ఇవ్వకపోయినా పార్టీలోనే ఉంటానని మాజీ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ స్పష్టం చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రస్తుతం గెలిచిన ఎమ్మెల్యేలంతా సీఎం ఫొటోతో గెలిచినవారే.. ఎవరికి టికెట్ ఇచ్చినా పార్టీ గెలుపు కోసం కృషి చేస్తానన్నారు. ‘‘మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డికి ఏ పార్టీలోనూ టికెట్ వచ్చే పరిస్థితి లేదు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి చంద్రశేఖర్‌రెడ్డి ఓటు వేశాడో లేదో అతని అంతరాత్మకు తెలుసు. తప్పు చేసిన వారిని ప్రశ్నిస్తూనే ఉంటా. పార్టీ నుంచి బయటకు వెళ్లిన ముగ్గురిలో ఒక్కరు శాసనసభకు వచ్చినా జీవితంలో రాజకీయాల గురించి మాట్లాడను. ముగ్గురిలో ఒక్కరు గెలిచినా.. రాజకీయాల్లో లేకుండా పోవడమే కాదు. నెల్లూరు జిల్లాకు శాశ్వతంగా దూరమైపోతా. దమ్ముంటే నా సవాల్‌ను స్వీకరించండి’’ అంటూ అనిల్ వ్యాఖ్యానించారు. చదవండి: లోకేష్‌కు ఆ సంగతి తెలిసినా.. తెలియనట్లు నటిస్తున్నారా? -
తండ్రికి తగ్గ తనయుడు సీఎం జగన్..
-
జనసంద్రమైన కలిగిరి
కలిగిరి: వైఎస్సార్సీపీ నెల్లూరు ఎంపీ అభ్యర్థి ఆదాల ప్రభాకర్‌రెడ్డి, ఉదయగిరి ఎమ్మెల్యే అభ్యర్థి మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో కలిగిరిలో శుక్రవారం నిర్వహించిన రోడ్డుషో జనసంద్రాన్ని తలపించింది. కలిగిరి మండలంలోని అన్నిగ్రామాల నుంచి వేలాది మంది నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు. తహసీల్దార్ కార్యాలయం నుంచి కలిగిరమ్మతల్లి ఆలయం వరకు నిర్వహించిన రోడ్డుషో పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహాన్ని నింపింది. వందలాది మంది యువకులు బైక్ ర్యాలీ నిర్వహించారు. వేలాది మంది అభిమానుల మధ్య నేతలు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కలిగిరిలో ఇంతవరకు ఇంతపెద్ద భారీ ర్యాలీ జరగలేదని చర్చించుకోవడం విశేషం. ఎంపీ అభ్యర్థి ఆదాల, ఎమ్మెల్యే అభ్యర్థి మేకపాటి మాట్లాడుతూ ఇదే ఉత్సహంతో మరో ఐదు రోజులు కష్టపడి పనిచేస్తే భారీ మెజారిటీలు సాధించుకోవచన్నారు. కలిగిరి ఎంపీపీ మద్దసాని వెంకటేశ్వరరావు, కలిగిరి బిట్ 1 ఎంపీటీసీ సభ్యుడు కంచెంరెడ్డి మాల్యాద్రిరెడ్డి తమ అనుచరులతో కలసి భారీ సంఖ్యలో వైఎస్సార్సీపీలో చేరారు. కార్యక్రమంలో కావ్య కృష్ణారెడ్డి, పాలూరు మాల్యాద్రిరెడ్డి, కాటం రవీంద్రారెడ్డి, నోటి శ్రీనివాసులురెడ్డి, మెట్టుకూరు చిరంజీవిరెడ్డి, ఎం.భాస్కర్ రెడ్డి, కోడూరు కృష్ణారెడ్డి, ఎం. కేశవులురెడ్డి, లక్ష్మీనారాయణ, మోహన్, ప్రసాద్, రియాజ్‌రెడ్డి, హజరత్‌రెడ్డి, అంకిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఉదయగిరి వైఎస్ఆర్సీపీ అభ్యర్ధిగా మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి నామినేషన్
-
రాష్ట్ర రాజకీయాల్లో చెరగని ముద్ర
సాక్షి, ఉదయగిరి: రాష్ట్ర రాజకీయ ముఖచిత్రంలో మేకపాటి సోదరులకు ప్రత్యేక స్థానం ఉంది. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలోని మర్రిపాడు మండలం బ్రాహ్మణపల్లి గ్రామం నుంచి రాజకీయ ప్రస్థానం ప్రారంభించి జాతీయస్థాయిలో రాజకీయాల్లో తమదైన ముద్రవేసుకున్నారు. మేకపాటి రాజమోహన్‌రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, మేకపాటి గౌతమ్‌రెడ్డి ఈ ముగ్గురూ ఒకే కుటుంబం నుంచి రాజకీయాల్లోకి వచ్చి తమదైన శైలిలో రాజకీయాల్లో కొనసాగుతున్నారు. రాజమోహన్‌రెడ్డి రాజకీయ ప్రస్థానం మేకపాటి రాజమోహన్‌రెడ్డి 1983లో రాజకీయ ఆరంగేట్రం చేశారు. ఆయన అదే ఏడాది కాంగ్రెస్ తరపున ఉదయగిరి అసెంబ్లీ స్థానం నుంచి బరిలో దిగారు. 1985లో కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యేగా గెలుపొంది అసెంబ్లీలో అడుగుపెట్టారు. అనంతరం 1989లో ఒంగోలు పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేసి గెలుపొందారు. 2004లో నర్సరావుపేట ఎంపీగా పనిచేశారు. 2009, 2012, 2014లో నెల్లూరు ఎంపీగా గెలుపొందారు. 2004లో దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డికి సన్నిహితంగా ఉంటూ జిల్లా రాజకీయాల్లో ప్రముఖ స్థానం వహించారు. 2006లో వైఎస్ రాజశేఖరరెడ్డి హయంలోనే ఆరోగ్యశ్రీ పథకాన్ని ఉదయగిరి నుంచే ప్రారంభించారు. పెద్దిరెడ్డిపల్లి, సీతారాంసాగర్ రిజర్వాయర్లు సాధించి వైఎస్సార్ చేతులమీదుగా శంకుస్థాపన చేయించారు. వైఎస్సార్ మరణానంతరం ఆయన తనయుడు జగన్మోహన్రెడ్డి స్థాపించిన వైఎస్సార్సీపీలో చేరి ఆయన పక్షాన నిలిచారు. జిల్లాలో అనేక రాజకీయ ఒడిదొడుకులు ఎదుర్కొని జగన్‌తోనే రాజకీయ ప్రస్థానం కొనసాగిస్తున్నారు. వైఎస్సార్సీపీలో రెండుసార్లు ఎంపీగా గెలుపొందిన రాజమోహన్‌రెడ్డి ఆ పార్టీ నిర్ణయం మేరకు రెండుసార్లు ఎంపీ పదవులకు రాజీనామా చేశారు. వైఎస్సార్సీపీ తరపున పార్లమెంటులో ఆ పార్టీ శాసనసభాపక్ష నేతగా క్రియాశీలక పాత్ర పోషించారు. వైఎస్సార్సీపీలో రాష్ట్రస్థాయి కీలకనేతల్లో ఒకరిగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల పార్టీ ప్రకటించిన మేనిఫెస్టో కమిటీలో కూడా ఆయన సభ్యుడుగా ఉన్నారు. సోదరుడు.. తనయుడు మేకపాటి రాజమోహన్‌రెడ్డి సోదరుడు మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2012లో ఉప ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తరపున ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆయన కూడా జిల్లా, ఉదయగిరి నియోజకవర్గాల్లో క్రియాశీలకపాత్ర పోషిస్తున్నారు. 2014 ఎన్నికల్లో రాజకీయ ఆరంగేట్రం చేసిన మేకపాటి రాజమోహన్‌రెడ్డి తనయుడు గౌతమ్‌రెడ్డి ఆత్మకూరు నుంచి వైఎస్సార్సీపీ తరపున పోటీ చేసి అత్యధిక మెజారిటీతో గెలుపొందారు. 2012 ఉప ఎన్నికల్లో నెల్లూరు ఎంపీగా మేకపాటి రాజమోహన్‌రెడ్డికి జిల్లా ప్రజలు రికార్డుస్థాయిలో మెజారిటీ తీర్పు ఇచ్చారు. అలాగే ఉదయగిరి నుంచి పోటీ చేసిన చంద్రశేఖర్‌రెడ్డి కూడా అత్యధిక మెజారిటీతో గెలుపొందారు. మొత్తమ్మీద మేకపాటి కుటుంబం రాష్ట్ర రాజకీయ ముఖచిత్రంలో కీలకంగా వ్యవహరిస్తోంది. వచ్చే ఎన్నికల్లో మేకపాటి గౌతమ్‌రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థులుగా, మేకపాటి రాజమోహన్‌రెడ్డి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు సన్నద్ధమయ్యారు. -
‘జగన్‌పై హత్యాయత్నం కుట్రలో బాబూ.. లోకేష్ ఉన్నారేమో’
సాక్షి, అనంతపురం : వైఎస్ జగన్‌పై హత్యాయత్నం ఘటనలో చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ ప్రమేయం లేదనుకుంటే సీబీఐ లేదా సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణకు అంగీకరిస్తారని మాజీ ఎంపీ అనంతవెంకట్రామిరెడ్డి అభిప్రాయపడ్డారు. ఈ ఘటనపై అనేక అనుమానాలు ఉన్నాయని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, డీజీపీ వ్యాఖ్యలు కేసును పక్కదారి పట్టించేలా ఉన్నాయని మండిపడ్డారు. కేసును నీరుగార్చేందుకు బాబు యత్నిస్తున్నారని విమర్శించారు. నటుడు శివాజీ చెప్పిన ‘ఆపరేషన్ గరుడ’ పై టీడీపీ సర్కార్ ఎందుకు విచారణకు అంగీకరించడం లేదని ధ్వజమెత్తారు. ఏపీ ప్రభుత్వం అంపశయ్య పై ఉందని, చంద్రబాబు పాలనకు రోజులు దగ్గర పడ్డాయని అన్నారు. టీడీపీ ప్రభుత్వాన్నిఅస్థిరపరచాల్సిన అగత్యం తమకు లేదన్నారు. రాజకీయంగా వైఎస్ జగన్ బలపడడంతో నేరుగా ఎదుర్కొనలేకనే ఆయనను హత్య చేసేందుకు కుట్ర జరిగిందని ఆరోపించారు. వారికి ముందే తెలుసు.. సాక్షి, నెల్లూరు : వైఎస్ జగన్‌పై హత్యాయంత్నం అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డీజీపీ, టీడీపీ ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలు అవాస్తవమని మాజీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. జగన్‌పై దాడి జరుగనుందని ప్రభుత్వానికి ముందే తెలుసునని ఆయన ఆరోపించారు. చంద్రబాబు దుర్మార్గపు పాలనను అంతమొందించాలని పిలుపునిచ్చారు. టీడీపీ నేతల డ్రామాలన్నిటినీ ప్రజలు గమనిస్తున్నారని హెచ్చరించారు. సాక్షి, ఒంగోలు : ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌పై దాడి అనంతరం పరామర్శించాల్సిన చంద్రబాబు మానవత్వం లేకుండా మాట్లాడుతున్నాడని వైస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డి ధ్వజమెత్తారు. అలిపిరిలో చంద్రబాబుపై దాడి అనంతరం నాటి ప్రతిపక్షనేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఆయనకు మద్దతుగా నిలిచి ఏకంగా ధర్నా చేశారని గుర్తు చేశారు. -
చంద్రబాబుది అరాచకపాలన
ఉదయగిరి: రాష్ట్రంలో సీఎ చంద్రబాబునాయుడు చేస్తున్న అరాచక పాలనను అంత మొందించాలని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త మేకపాటి చంద్రశేఖరరెడ్డి పిలుపునిచ్చారు. ఆయన శనివారం సాయంత్రం పట్టణంలోని దిలార్బావివీధి 47, 48 పోలింగ్ బూత్‌ల పరిధిలో ‘రావాలి జగన్–కావాలి జగన్’ కార్యక్రమం నిర్వహించారు. ఆయన ఇంటింటికి తిరిగి వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించిన నవరత్నాలు కరపత్రాలను మహిళలకు అందజేశారు. ఆయన మాట్లాడుతూ చంద్రబాబు ఆరు వందల అబద్ధాలు చెప్పి అధికారం చెప్పి ఆంధ్ర ప్రజలను నిలువునా మోసం చేశాడరన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించిన నవరత్నాల పథకం ద్వారా ప్రతి కుటుంబానికి లబ్ధి చేకూరుతుందన్నారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రవేశ పెట్టిన ఆరోగ్యశ్రీ పథకం ప్రస్తుతం అటకెక్కిందన్నారు. జగనన్నతోనే రాజన్న రాజ్యం సాధ్యమవుతోందన్నారు. ప్రస్తుత పాలనలో ప్రభుత్వ పథకాలు అర్హులైన వారికి అందక ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రభుత్వ పథకాల సంక్షేమ పథకాలు అందరికీ అందాలంటే జన్మోహన్‌రెడ్డి పాలన రావాలన్నారు. నవరత్నాల పథకాలపై ప్రజలకు నమ్మకం ఏర్పడిందని, వాటిని కచ్చితంగా అమలు చేస్తారన్నారు. ఇతర పార్టీలతో పాటు సొంత పార్టీలోని వారు కూడా బాబు పాలనను అసహ్యించుకుంటున్నారన్నారు. ఉదయగిరి నియోజకవర్గంలో తమ పాలనలోనే ఎంతో అభివృద్ధి జరిగిందన్నారు. ప్రస్తుత ఎమ్మెల్యే బొల్లినేని వెంకటరామారావు నియోజకవర్గంలో వేల కోట్ల రూపాయల అభివృద్ధి చేశామని చెబుతున్నా.. పట్టణంలో తాగునీరు లేక బిందెనీటి కోసం ప్రజలు అల్లాడుతున్నారన్నారు. అధికార పార్టీ నాయకులు ట్యాంకర్ల ద్వారా సరఫరా చేసే నీటితో కూడా రాజకీయాలు చేస్తుండడం దారుణమన్నారు. రాబోయే ఎన్నికల్లో సీఎంగా జగన్‌ను, ఎంపీగా మేకపాటి రాజమోహన్‌రెడ్డిని, ఎమ్మెల్యేగా తనను గెలిపించాలని కోరారు. అనంతరం ట్యాంకర్ ద్వారా తాగునీటిని మహిళలకు సరఫరా చేశారు. ఆయన వెంట బూత్ కన్వీనర్లు జబ్బార్, ఎస్దానీ, వైఎస్సార్సీపీ నాయకులు గానుగపెంట శ్రీనివాసులరెడ్డి, గానుగపెంట ఓబుల్‌రెడ్డి, ఉప్పుటూరి హరి, శ్రీనివాసులు, గడియాల్చి ఎస్ధానీ, రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
జగన్‌తోనే రాష్ట్రాభివృద్ధి
వీరారెడ్డిపాలెం (కలిగిరి), న్యూస్‌లైన్: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎం అయితేనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమవుతుందని ప్రజలు బలంగా విశ్వసిస్తున్నారని ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖరరెడ్డి అన్నారు. వీరారెడ్డిపాళెంలో సోమవారం ఎన్నికల ప్రచారంలో మాట్లాడారు. రానున్నవి మంచి రోజులని, జగన్ సీఎం అయి జనరంజక పాలన అందించే సమయం ఎంతో దూరం లేదన్నారు. రానున్న ఎన్నికల్లో నెల్లూరు ఎంపీగా మేకపాటి రాజమోహన్‌రెడ్డిని, ఉదయగిరి ఎమ్మెల్యేగా తనను మంచి మెజార్టీతో గెలిపిం చాలని చంద్రశేఖరరెడ్డి కోరారు. జగన్ ప్రభుత్వంలో తమకు సముచిత స్థానం ఉం టుందని, నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామన్నారు. ఎమ్మెల్యే వెంట జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు పాలూరు మాల్యాద్రిరెడ్డి, మండల కన్వీనర్ నోటి శ్రీనివాసులురెడ్డి, బాపతి చెన్నారెడ్డి, కాటం రవీంద్ర, నర్రావుల అంకిరెడ్డి ఉన్నారు. ప్రజాభిమానమే జగన్‌కు శ్రీరామరక్ష జలదంకి : ప్రజాభిమానమే జగన్‌కు శ్రీ రామరక్ష అని ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖరరెడ్డి అన్నారు. మండలంలోని హనుమకొండపాళెం, కృష్ణాపాడు, సోమవరప్పాడు, కొత్తపాళెం, బోయలపాడు, వేములపాడు, కమ్మవారిపాళెం, చామదల గ్రామాల్లో సోమవారం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మేకపాటి మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎం అయితే నే వైఎస్సార్ సువర్ణయుగం మళ్లీ వ స్తుందన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి వైఎస్సార్సీపీ ని ఆదరించాలన్నారు. తమను గెలిపిస్తే నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతామన్నారు. సీమాంధ్ర అభివృద్ధికి జగన్ నాయకత్వం అవసరమన్నారు. జగన్ ముఖ్యమంత్రి అయి, తాను ఎ మ్మెల్యేగా గెలిచిన వెంటనే కావలి కాలువను పూర్తిస్థాయిలో ఆధునికీకరించి జలదంకి మండల రైతాంగానికి శాశ్వతంగా తాగునీటి కొరత లేకుండా చేస్తానన్నారు. తనను ఆశీర్వదించి గెలిపిం చాలని ఓటర్లను కోరారు. వైఎస్సార్సీపీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు మేదరమెట్ల వెంకటకృష్ణారెడ్డి, మండల కన్వీనర్ పాలవల్లి మాలకొండారెడ్డి, రావి ప్రసాద్, తమ్మినేని సతీష్, ఎస్వీ శేషారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఫ్యాన్ ప్రభంజనంలో టీడీపీ, కాంగ్రెస్ గల్లంతు
- రాజన్న రాజ్యాన్ని మళ్లీ తెచ్చుకుందాం: ఎమ్మెల్యే మేకపాటి జలదంకి, న్యూస్‌లైన్: ఫ్యాన్ ప్రభంజనంలో టీడీపీ, కాంగ్రెస్ గల్లంతు కావడం తథ్యమని ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి అన్నారు. మండలంలోని అన్నవరం, తిమ్మసముద్రం, కేశవరం, చింతలపాళెం, గట్టుపల్లి, 9వ మైలు, చిన్నక్రాక, నాగిరెడ్డిపాళెం, కోదండరామాపురం తదితర గ్రామాల్లో ఆదివారం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మేకపాటి మాట్లాడుతూ రాజన్న రాజ్యం రావాలంటే అందరం వైఎస్సార్సీపీని గెలిపించుకోవాలన్నారు. తొమ్మిదేళ్లు రాష్ట్రాన్ని పాలించిన చంద్రబాబు ప్రజలకు ఒరగబెట్టిందేమీ లేదన్నారు. ఇప్పుడు ప్రజల మధ్యకు వచ్చి ఆల్‌ఫ్రీ అనే మాయమాటలు చెబుతున్నారన్నారు. కాంగ్రెస్‌తో చంద్రబాబు కుమ్మక్కై ఆ ప్రభుత్వాన్ని కాపాడారని విమర్శించారు. రాష్ట్ర విభజనకు అనుకూలంగా లేఖ ఇచ్చి రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేశారని ధ్వజమెత్తారు. మహానేత వైఎస్సార్ పార్టీలకు అతీతంగా ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేసి ప్రజల గుండెల్లో కొలువయ్యారన్నారు. వైఎస్సార్ సువర్ణయుగం జగన్‌తోనే సాధ్యమవుతుందని ప్రజలు నమ్ముతున్నారన్నారు. జగన్ సీఎం అయితే వృద్ధులు, వికలాంగులు, రైతులు, మహిళల జీవితాలు మారుతాయన్నారు. నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా తన సోదరుడు రాజమోహన్‌రెడ్డి, ఉదయగిరి ఎమ్మెల్యే అభ్యర్థిగా తాను పోటీ చేస్తున్నామన్నారు. ప్రతి ఒక్కరూ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి తమను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు మేదరమెట్ల వెంకటకృష్ణారెడ్డి, మండల కన్వీనర్ పాలవల్లి మాలకొండారెడ్డి, రావిప్రసాద్, ఎస్వీ శేషారెడ్డి, మేకల మహేశ్వరావు, లేటి సుధీర్, గద్దె బ్రహ్మయ్య, గొట్టిపాటి ప్రసాద్‌నాయుడు, ఇస్కామదన్ మోహన్‌రెడ్డి, వాకా మాధవరెడ్డి, గంగపట్ల మాలకొండయ్య, గుర్రం జగ్గయ్య, పులి మాల్యాద్రి, యడ్ల మాల్యాద్రిరెడ్డి, వట్టికాల బాలయ్య, బీవీ కృష్ణారెడ్డి, వాకా పద్మనాభరెడ్డి పాల్గొన్నారు. -
వైఎస్సార్సీపీలోకి వంటేరు
సాక్షి ప్రతినిధి, నెల్లూరు : తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ శాసనసభ్యుడు వంటేరు వేణుగోపాల్‌రెడ్డి బుధవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖరరెడ్డి, ఆత్మకూరు సమన్వయకర్త మేకపాటి గౌతమ్‌రెడ్డి ఆయన్ను వైఎస్ జగన్మోహన్రెడ్డికి పరిచయం చేసి పార్టీ కండువా కప్పించారు. వంటేరు రాకతో ఉదయగిరి, కావలి నియోజక వర్గాల్లో వైఎస్సార్సీపీకి అదనపు బలం తోడైంది. తెలుగుదేశం పార్టీ నుంచి 1999లో కావలి ఎమ్మెల్యేగా ఎన్నికైన వేణుగోపాల్‌రెడ్డి తొలి నుంచి పార్టీకి విధేయుడిగా పనిచేస్తూ వచ్చారు. నియోజకవర్గాల పునర్విభజన తర్వాత కాంగ్రెస్ అభ్యర్థి మేకపాటి రాజమోహన్‌రెడ్డి మీద నెల్లూరు లోక్‌సభ స్థానానికి పోటీ చేయడానికి అభ్యర్థి దొరకని సమయంలో వేణుగోపాల్‌రెడ్డి టీడీపీ తరఫున బరిలోకి దిగారు. ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికలో సైతం టీడీపీకి వంటేరే దిక్కయ్యారు. ఆ తర్వాత పార్టీలో చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఆయన అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తూ వచ్చారు. కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి వచ్చిన సర్వేపల్లి శాసనసభ్యుడు ఆదాలప్రభాకర్రెడ్డి నెల్లూరు లోక్‌సభకు బరిలోకి దిగాలని నిర్ణయించారు. దీంతో కావలి, ఉదయగిరి నియోజకవర్గాల్లో ఆయనకు, పార్టీకి తన అవసరం ఉండటంతో వంటేరుకు తగిన ప్రాధాన్యత దక్కుతుందని భావించారు. పార్టీ అధినేత చంద్రబాబు పెత్తనం మొత్తం ఆదాలకే అప్పగించడాన్ని వంటేరు జీర్ణించుకోలేకపోయారు. ఇదే సమయంలో ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖరరెడ్డి స్వయంగా వంటేరును కలసి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో తగిన గౌరవం కల్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు. దీంతో ఆయన వైఎస్సార్సీపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయం తెలిసి టీడీపీ ముఖ్యనేతలు వంటేరును నిలువరించే ప్రయత్నం చేసినా ఆయన ససేమిరా అన్నారు. ఈ నేపథ్యంలో బుధవారం వైఎస్ జగన్ చేతులమీదుగా ఆయన వైఎస్సార్సీపీ తీర్థం పుచ్చుకున్నారు. వంటేరుకు ఉదయగిరి నియోజకవర్గంలోని కలిగిరి, జలదంకి మండలాల్లోను, కావలినియోజకవర్గంలోని కావలి, బోగోలు మండలాల్లోను అనుచరవర్గం, జనంలో పట్టు ఉంది. ఈయన రాకతో వైసీపీకి రెండు నియోజకవర్గాల్లో అదనపు బలం చేకూరనుంది. -
డ్వాక్రా రుణాలను మాఫీ చేస్తాం
భట్టువారిపాలెం (కలిగిరి), న్యూస్‌లైన్: వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే డ్వాక్రా మహిళల రుణాలు మాఫీ చేస్తామని ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖరరెడ్డి తెలిపారు. భట్టువారిపాళెంలోని ఎస్సీ కాలనీలో గ్రావెల్ రోడ్డు పనులను సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆదివారం ఇడుపులపాయలో జరిగిన ప్లీనరీ సమావేశాల్లో ప్రజల శ్రేయస్సు కోసం పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి కీలక నిర్ణయాలు తీసుకున్నారన్నారు. జగన్మోహన్రెడ్డి ఒక నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉంటారన్నారు. రాజన్న రాజ్యం రావాలన్నా, వైఎస్సార్ చేపట్టిన సంక్షేమ పథకాలు అమలు కావాలన్నా జగన్‌తోనే సాధ్యమవుతుందని ప్రజలు ప్రగాఢ విశ్వాసంతో ఉన్నారన్నారు. కాంగ్రెస్, టీడీపీలు కుమ్మక్కు రాజకీయాలకు పాల్పడినా ప్రజల ఆదరణతో వైఎస్సార్సీపీ అధికారంలోకి రావడాన్ని అడ్డుకోలేరన్నారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే మెట్ట ప్రాంతమైన ఉదయగిరి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామన్నారు. భట్టువారిపాలెం కాలనీవాసుల కోరిక మేరకు నియోజకవర్గ అభివృద్ధి పనుల్లో భాగంగా తన నిధుల నుంచి రూ. లక్ష కేటాయించినట్లు తెలిపారు. ప్రజలకు ఎళ్లవేళలా అందుబాటులో ఉంటూ వారి సమస్యలు పరిష్కరించడానికి కృషి చేస్తామన్నారు. రోడ్డు ప్రమాదంలో కాలును కోల్పోయిన ఏడోతరగతి విద్యార్థిని మూలి అనూషకు అన్ని విధాలుగా సాయం అందిస్తామని కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు. రాజన్నదళంకు ఓటు వేస్తే విలువ లేదు నియోజకవర్గంలో కొత్తగా పుట్టుకొచ్చిన రాజన్నదళం పార్టీకి ఓట్లు వేస్తే విలువ ఉండదని మేకపాటి చంద్రశేఖరరెడ్డి అన్నారు. ఆ పార్టీ ఏర్పాటు చేసిన మెట్టుకూరు చిరంజీవిరెడ్డిని గతంలో అన్ని విధాలుగా ఆదరించానన్నారు. ఆయన సూచించిన వారికే పదవులను కట్టబెట్టామన్నారు. అయితే ఆయన నమ్మక ద్రోహం చేశారన్నారు. వారి పరిధిలోని గ్రామాలకు తనను అసలు తీసుకువెళ్లలేదన్నారు. తను, తన సోదరుడు నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి మండలంలో పర్యటిస్తుంటే అతను వేరే వారి వద్దకు వెళ్లడం ఎంత వరకు సబబన్నారు. వైఎస్సార్‌పై ప్రేమ, అభిమానాలతో తాము పదవులకు రాజీనామాలు చేసి జగన్మోహన్రెడ్డికి అండగా నిలిచామన్నారు. చిరంజీవిరెడ్డి వైఎస్సార్ బొమ్మతో ప్రజల్లోకి ఎలా వెళతారని ప్రశ్నించారు. జగన్మోహన్రెడ్డి తరఫున పోటీ చేస్తున్న తమను గెలిపించాలని, నమ్మకద్రోహులకు బుద్ధి చెప్పాలని ఆయన కోరారు. కాలనీలో నిరుపయోగంగా ఉన్న బావిని పూడ్పించాలని కాలనీవాసులు ఎమ్మెల్యేని కోరారు. బావిని పూడ్చడానికి చర్యలు తీసుకోవాలని పంచాయతీరాజ్ అధికారులకు ఎమ్మెల్యే సూచించారు. రోడ్డు పనుల ప్రారంభంలో భాగంగా చర్చి ఫాదర్ ప్రత్యేక ప్రార్థనలు జరిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ ఏఈ శ్రీనివాసులు, వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ నోటి శ్రీనివాసులురెడ్డి, స్థానిక నాయకులు కందుల విల్సన్, మాదాల శ్రీనివాసులు, అంకిరెడ్డి, కృష్ణారెడ్డి పాల్గొన్నారు. -
సమైక్యాంధ్రకు మద్దతుగా ఉదయగిరిలో ఆందోళనలు
నెల్లూరు: సమైక్యాంధ్ర మద్దతుగా ఆందోళనలు మరింత ఊపందుకున్నాయి. సమ్మె బాటలో సీమాంధ్రలోని ఆందోళనకారులు రోడ్డెక్కారు. జిల్లాలోని ఉదయగిరిలోఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి రెడ్డి ఆధ్వర్యంలో నిరసనకారులు భారీ ప్రదర్శన నిర్వహించారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ వారు నిరసన తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విడగొడితే ఊరుకునేది లేదని వారు నినాదాలు చేశారు. అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం కోరుతూ వైఎస్సార్సీపీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ చేపడుతున్న ఆమరణ దీక్షతోనైనా కేంద్రం కళ్లు తెరవాలని వైఎస్సార్సీపీ నేతలు అభిప్రాయపడుతున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ ప్రజా సమస్యల పోరాటంలో ముందుంటుందని వైఎస్సార్సీపీ నేత కాకాని గోవర్థన్ రెడ్డి తెలిపారు.