ఉదయగిరి: రాష్ట్రంలో సీఎ చంద్రబాబునాయుడు చేస్తున్న అరాచక పాలనను అంత మొందించాలని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త మేకపాటి చంద్రశేఖరరెడ్డి పిలుపునిచ్చారు. ఆయన శనివారం సాయంత్రం పట్టణంలోని దిలార్‌బావివీధి 47, 48 పోలింగ్ బూత్‌ల పరిధిలో ‘రావాలి జగన్–కావాలి జగన్’ కార్యక్రమం నిర్వహించారు. ఆయన ఇంటింటికి తిరిగి వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించిన నవరత్నాలు కరపత్రాలను మహిళలకు అందజేశారు. ఆయన మాట్లాడుతూ చంద్రబాబు ఆరు వందల అబద్ధాలు చెప్పి అధికారం చెప్పి ఆంధ్ర ప్రజలను నిలువునా మోసం చేశాడరన్నారు.
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించిన నవరత్నాల పథకం ద్వారా ప్రతి కుటుంబానికి లబ్ధి చేకూరుతుందన్నారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రవేశ పెట్టిన ఆరోగ్యశ్రీ పథకం ప్రస్తుతం అటకెక్కిందన్నారు. జగనన్నతోనే రాజన్న రాజ్యం సాధ్యమవుతోందన్నారు. ప్రస్తుత పాలనలో ప్రభుత్వ పథకాలు అర్హులైన వారికి అందక ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రభుత్వ పథకాల సంక్షేమ పథకాలు అందరికీ అందాలంటే జన్‌మోహన్‌రెడ్డి పాలన రావాలన్నారు. నవరత్నాల పథకాలపై ప్రజలకు నమ్మకం ఏర్పడిందని, వాటిని కచ్చితంగా అమలు చేస్తారన్నారు.
ఇతర పార్టీలతో పాటు సొంత పార్టీలోని వారు కూడా బాబు పాలనను అసహ్యించుకుంటున్నారన్నారు. ఉదయగిరి నియోజకవర్గంలో తమ పాలనలోనే ఎంతో అభివృద్ధి జరిగిందన్నారు. ప్రస్తుత ఎమ్మెల్యే బొల్లినేని వెంకటరామారావు నియోజకవర్గంలో వేల కోట్ల రూపాయల అభివృద్ధి చేశామని చెబుతున్నా.. పట్టణంలో తాగునీరు లేక బిందెనీటి కోసం ప్రజలు అల్లాడుతున్నారన్నారు. అధికార పార్టీ నాయకులు ట్యాంకర్ల ద్వారా సరఫరా చేసే నీటితో కూడా రాజకీయాలు చేస్తుండడం దారుణమన్నారు.
రాబోయే ఎన్నికల్లో సీఎంగా జగన్‌ను, ఎంపీగా మేకపాటి రాజమోహన్‌రెడ్డిని, ఎమ్మెల్యేగా తనను గెలిపించాలని కోరారు. అనంతరం ట్యాంకర్ ద్వారా తాగునీటిని మహిళలకు సరఫరా చేశారు. ఆయన వెంట బూత్ కన్వీనర్లు జబ్బార్, ఎస్దానీ, వైఎస్సార్‌సీపీ నాయకులు గానుగపెంట శ్రీనివాసులరెడ్డి, గానుగపెంట ఓబుల్‌రెడ్డి, ఉప్పుటూరి హరి, శ్రీనివాసులు, గడియాల్చి ఎస్ధానీ, రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment