వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సీఎం అయితేనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమవుతుందని ప్రజలు బలంగా విశ్వసిస్తున్నారని ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖరరెడ్డి అన్నారు.
వీరారెడ్డిపాలెం (కలిగిరి), న్యూస్‌లైన్: వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సీఎం అయితేనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమవుతుందని ప్రజలు బలంగా విశ్వసిస్తున్నారని ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖరరెడ్డి అన్నారు. వీరారెడ్డిపాళెంలో సోమవారం ఎన్నికల ప్రచారంలో మాట్లాడారు. రానున్నవి మంచి రోజులని, జగన్ సీఎం అయి జనరంజక పాలన అందించే సమయం ఎంతో దూరం లేదన్నారు.
రానున్న ఎన్నికల్లో నెల్లూరు ఎంపీగా మేకపాటి రాజమోహన్‌రెడ్డిని, ఉదయగిరి ఎమ్మెల్యేగా తనను మంచి మెజార్టీతో గెలిపిం చాలని చంద్రశేఖరరెడ్డి కోరారు. జగన్ ప్రభుత్వంలో తమకు సముచిత స్థానం ఉం టుందని, నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామన్నారు. ఎమ్మెల్యే వెంట జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు పాలూరు మాల్యాద్రిరెడ్డి, మండల కన్వీనర్ నోటి శ్రీనివాసులురెడ్డి, బాపతి చెన్నారెడ్డి, కాటం రవీంద్ర, నర్రావుల అంకిరెడ్డి ఉన్నారు.
ప్రజాభిమానమే జగన్‌కు శ్రీరామరక్ష
జలదంకి : ప్రజాభిమానమే జగన్‌కు శ్రీ రామరక్ష అని ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖరరెడ్డి అన్నారు. మండలంలోని హనుమకొండపాళెం, కృష్ణాపాడు, సోమవరప్పాడు, కొత్తపాళెం, బోయలపాడు, వేములపాడు, కమ్మవారిపాళెం, చామదల గ్రామాల్లో సోమవారం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మేకపాటి మాట్లాడుతూ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సీఎం అయితే నే వైఎస్సార్ సువర్ణయుగం మళ్లీ వ స్తుందన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి వైఎస్సార్‌సీపీ ని ఆదరించాలన్నారు.
తమను గెలిపిస్తే నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతామన్నారు. సీమాంధ్ర అభివృద్ధికి జగన్ నాయకత్వం అవసరమన్నారు. జగన్ ముఖ్యమంత్రి అయి, తాను ఎ మ్మెల్యేగా గెలిచిన వెంటనే కావలి కాలువను పూర్తిస్థాయిలో ఆధునికీకరించి జలదంకి మండల రైతాంగానికి శాశ్వతంగా తాగునీటి కొరత లేకుండా చేస్తానన్నారు. తనను ఆశీర్వదించి గెలిపిం చాలని ఓటర్లను కోరారు. వైఎస్సార్‌సీపీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు మేదరమెట్ల వెంకటకృష్ణారెడ్డి, మండల కన్వీనర్ పాలవల్లి మాలకొండారెడ్డి, రావి ప్రసాద్, తమ్మినేని సతీష్, ఎస్వీ శేషారెడ్డి తదితరులు పాల్గొన్నారు.