ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ ధర్నా | ysrcp strike at ongole collectorate, says mlc ummareddy | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ ధర్నా

Published Tue, Dec 6 2016 6:55 PM | Last Updated on Wed, Jul 25 2018 4:09 PM

ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ ధర్నా - Sakshi

ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ ధర్నా

హైదరాబాద్: ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, ప్రభుత్వ వైఫల్యాలపై దృష్టిపెట్టాలని పార్టీ నేతలకు వైఎస్ఆర్సీపీ అధినేత, ఏపీలో ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సూచించారని ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తెలిపారు. మంగళవారం సాయంత్రం 'గడప గడపకు వైఎస్ఆర్' అంశంపై పార్టీ నేతలతో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమీక్ష జరిపారు. సమీక్షలో చర్చించిన అంశాలపై ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి మీడియాతో మాట్లాడారు. బుత్ కమిటీలు, అనుబంధ సంఘాల కమిటీల నియామకాన్ని తర్వలో పూర్తి చేయాలని వైఎస్ జగన్ అదేశించినట్లు చెప్పారు.

రాష్ట్ర ప్రజల ఆరోగ్యం పట్ల టీడీపీ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ ఈ 9న ఒంగోలు కలెక్టరేట్ వద్ద వైఎస్ఆర్ సీపీ ధర్నా చేపట్టనుందని ఎమ్మెల్సీ తెలిపారు. ఈ ధర్నాలో పార్టీ అధినేత వైఎస్ జగన్ పొల్గొని రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టనున్నారని శాసనమండలిలో వైఎస్ఆర్సీపీ పక్ష నేత ఉమ్మారెడ్డి వివరించారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement