శ్రీ వికారి నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, ఫాల్గుణ మాసం, తిథి బ.తదియ సా.4.54 వరకు, తదుపరి చవితి, నక్షత్రంచిత్త రా.9.10 వరకు, తదుపరి స్వాతి, వర్జ్యం ఉ.6.14 నుంచి 7.44 వరకు, తిరిగి రా.2.24 నుంచి 3.54 వరకు, దుర్ముహూర్తం ఉ.10.10 నుంచి 10.56 వరకు, తదుపరి ప.2.54 నుంచి 3.44 వరకు అమృతఘడియలు... ప.3.12 నుంచి 4.44 వరకు.
సూర్యోదయం : 6.15
సూర్యాస్తమయం : 6.04
రాహుకాలం : ప.1.30 నుంచి 3.00 వరకు
యమగండం : ఉ.6.00 నుంచి 7.30 వరకు
భవిష్యం
మేషం: ఉద్యోగయోగం. కీలక నిర్ణయాలు. వ్యవహారాలలో విజయం. ఆప్తుల నుంచి శుభవార్తలు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత అనుకూలిస్తాయి.
వృషభం: కొత్త పనులు చేపడతారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. విలువైన సమాచారం. కాంట్రాక్టులు లభిస్తాయి. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త ఆశలు.
మిథునం: సన్నిహితులతో వివాదాలు. ధనవ్యయం. వ్యాపార, ఉద్యోగాలలో ఒత్తిడులు పెరుగుతాయి. ఆరోగ్యభంగం. దూరప్రయాణాలు. అనుకున్న పనుల్లో కొంత జాప్యం తప్పదు.
కర్కాటకం: మిత్రులతో మాటపట్టింపులు. ప్రయాణాలు వాయిదా. శ్రమాధిక్యం. దైవదర్శనాలు. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగాలలో నిరుత్సాహం. అనుకోని ధనవ్యయం.
సింహం: వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో చిక్కులు కాస్త తొలగుతాయి. విందువినోదాలు. ఉద్యోగయత్నాలు అనుకూలిస్తాయి. పాత బాకీలు వసూలవుతాయి. శుభవార్తలు వింటారు.
కన్య: పనులలో కొంత జాప్యం. దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింతగా ఒత్తిడులు. బంధువులతో స్వల్ప వివాదాలు. అనారోగ్యం. శ్రమ పెరుగుతుంది.
తుల: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు వింటారు. ఆర్థిక ప్రగతి కనిపిస్తుంది. ఉద్యోగాలలో పురోగతి. వ్యాపారాలు విస్తరిస్తారు. విందువినోదాలు. చిన్ననాటి మిత్రుల కలయిక.
వృశ్చికం: ముఖ్యమైన పనులు కొన్ని వాయిదా వేస్తారు. శ్రమాధిక్యం. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితి. ధనవ్యయం. ప్రయాణాలలో అవాంతరాలు.
ధనుస్సు: సన్నిహితులతో సఖ్యత. విలువైన వస్తువులు సేకరిస్తారు. ఆభరణాలు, వాహనాలు కొంటారు. దైవదర్శనాలు. విందువినోదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అవాంతరాలు తొలగుతాయి.
మకరం: పరిచయాలు పెరుగుతాయి. ఆత్మీయులతో ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపారాభివృద్ధి. ఉద్యోగాలలో మరింత ప్రగతి సా«ధిస్తారు. కీలక నిర్ణయాలు. విందువినోదాలు.
కుంభం: కుటుంబంలో కొద్దిపాటి చికాకులు. ఆకస్మిక ప్రయాణాలు. పనుల్లో అవాంతరాలు. ఆరోగ్యం మందగిస్తుంది. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగులకు మార్పులు ఉండవచ్చు.
మీనం: వ్యయప్రయాసలు. ధనవ్యయం. కుటుంబంలో కొన్ని చికాకులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఆటుపోట్లు. దూరపు బంధువుల కలయిక. విద్యార్థులకు నిరుత్సాహం.– సింహంభట్ల సుబ్బారావు
Comments
Please login to add a commentAdd a comment