మెగాస్టార్‌కు దగ్గరలో కింగ్‌ ఖాన్‌ | SRK nearer to big b in Twitter followers | Sakshi
Sakshi News home page

మెగాస్టార్‌కు దగ్గరలో కింగ్‌ ఖాన్‌

Published Tue, Jan 2 2018 1:58 PM | Last Updated on Mon, May 28 2018 3:53 PM

SRK nearer to big b in Twitter followers  - Sakshi

ముంబాయి : బాలీవుడ్‌ కింగ్‌ ఖాన్‌ షారుఖ్‌ ఖాన్‌ ట్విట్టర్‌లో తన ఫాలోవర్ల సంఖ్యను పెంచుకున్నాడు.  ప్రస్తుతం కింగ్‌ ఖాన్‌కు 32.2 మంది ఫోలోవర్లు ఉన్నారు. ట్విట్టర్‌లో బాలీవుడ్‌ మెగా స్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌కు అత్యధికంగా 32.4 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. కొత్తసంవత్సరం సందర్భంగా మంగళవారం తన 32 మిలియన్ల అభిమానులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అలాగే సల్మాన్‌ ఖాన్‌కు 29.9 మిలియన్ల ఫాలోవర్లు, మిస్టర్‌ ఫర్ఫెక్ట్‌ అమిర్‌ ఖాన్‌కు 22.6 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు.

తన జీవితం, సినిమా ప్రాజెక్టుల గురించి తరచూ అభిమానులతో పంచుకోవడానికి ఎక్కువగా షారుఖ్‌ ఖాన్‌ సోషల్‌ మీడియాను ఆశ్రయిస్తాడు. కొత్త సంవత్సరం మొదటి రోజున తన రాబోయే సినిమా జీరో టీజర్‌ను విడుదల చేసిన సంగతి తెల్సిందే. ఈ సినిమాలో షారుఖ్‌ మరగుజ్జు పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో అనుష్క శర్మ, కత్రినా కైఫ్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. జీరో సినిమా డిసెంబర్‌ 21, 2018న విడుదల కానుంది.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement