ట్విట్టర్ ఫాలోవర్స్లో బాద్షా రికార్డ్ | Shah Rukh Khan reaches 15m followers mark on Twitter | Sakshi
Sakshi News home page

ట్విట్టర్ ఫాలోవర్స్లో బాద్షా రికార్డ్

Published Thu, Sep 3 2015 12:25 PM | Last Updated on Mon, May 28 2018 4:05 PM

ట్విట్టర్ ఫాలోవర్స్లో బాద్షా రికార్డ్ - Sakshi

ట్విట్టర్ ఫాలోవర్స్లో బాద్షా రికార్డ్

బాలీవుడ్ సూపర్ స్టార్ షారూక్ ఖాన్ మరో అరుదైన ఘనత సాధిచాడు. ఇప్పటికే సంపన్నుడైన ఇండియన్ హీరోగా రికార్డ్ సృష్టించిన బాద్షా అభిమానుల విషయంలోనే అదే స్టామినా చూపించాడు. అందుకే సోషల్ నెట్వర్కింగ్ సైట్స్ లోనూ భారీ ఫాలోయింగ్ తో దూసుకుపోతున్నాడు. ట్విట్టర్ లో ఇప్పటి వరకు అమితాబ్ మాత్రమే సాధించిన కోటి 50 లక్షల ఫాలోవర్స్ రికార్డ్ ను షారూఖ్ కూడా అందుకున్నాడు.

ఇప్పటి వరకు కోటి 70 లక్షల ఫాలోవర్స్తో  హైయస్ట్ మెంబర్స్ ఫాలో అవుతున్న రికార్డ్ అమితాబ్ పేర ఉండగా, షారూఖ్ కోటి 50 లక్షల ఫాలోవర్స్తో రెండో స్ధానంలో ఉన్నాడు. తనకు ఈ రికార్డ్ అందించిన ఫ్యాన్స్కు మేసేజ్ రూపంలో కృతజ్ఞతలు తెలియజేశాడు కింగ్ఖాన్. షారూఖ్ తరువాతి స్ధానంలో కోటి 40 లక్షల ఫాలోవర్స్ తో అమీర్ ఖాన్, ఆ తర్వాత స్ధానంలో కోటి 30 లక్షల 70 వేల ఫాలోవర్స్తో సల్మాన్ఖాన్లు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement