27 శాతం పెరిగిన పరోక్ష పన్ను వసూళ్లు
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వపు ఆదాయంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఐదు నెలల్లో మంచి వృద్ధి నమోదయ్యింది. దీనికి ప్రత్యక్ష, పరోక్ష పన్ను వసూళ్లు కారణంగా నిలిచాయి. ఏప్రిల్-ఆగస్ట్ మధ్య కాలంలో పరోక్ష పన్ను వసూళ్లు 27.5 శాతం వృద్ధితో రూ.3.36 లక్షల కోట్లకు, ప్రత్యక్ష పన్ను వసూళ్లు 15.03 శాతం వృద్ధితో రూ.1.89 లక్షల కోట్లకు చే రాయి. దీంతో మొత్తం ప్రత్యక్ష, పరోక్ష పన్ను వసూళ్లు (ఆగస్ట్ చివరకి) రూ.5.25 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. కాగా ప్రభుత్వం 2016-17లో ప్రత్యక్ష పన్ను వసూళ్లలో 12.64 శాతం వృద్ధిని (రూ.8.47 లక్షల కోట్లు), పరోక్ష పన్ను వసూళ్లలో 10.8 శాతం (రూ.7.79 లక్షల కోట్లు) అంచనా వేస్తోంది.