మెక్‌డొనాల్డ్స్ కోసం 5 దిగ్గజ సంస్థలు పోటీ
మెక్‌డొనాల్డ్స్ కోసం 5 దిగ్గజ సంస్థలు పోటీ
Published Mon, Sep 18 2017 1:26 PM | Last Updated on Tue, Sep 19 2017 4:44 PM
సాక్షి, న్యూఢిల్లీ: కన్నాట్ ప్లాజా రెస్టారెంట్స్ లిమిటెడ్ యజమాని విక్రమ్ భక్షితో తలెత్తిన వివాదంతో తూర్పు, ఉత్తర భారతంలో భారీ ఎత్తున్న మెక్‌డొనాల్డ్స్ మూతపడిన సంగతి తెలిసిందే. ఈ వివాద నేపథ్యంలోనే మెక్‌డొనాల్డ్స్ ఇండియాలో భాగస్వామ్యం సంపాదించుకోవడం కోసం ఐదు దిగ్గజ రెస్టారెంట్, ఫుడ్ బిజెనెస్‌లు పోటీ పడుతున్నాయి. స్పెషాలిటీ రెస్టారెంట్లు, జుబిలెంట్ ఫుడ్‌వర్క్, మూన్ బెవరేజస్, లైట్ బైట్ ఫుడ్స్, హార్డ్‌క్యాసిల్ రెస్టారెంట్లు, మెక్‌డొనాల్డ్స్ ఉత్తర, తూర్పు ప్రాంతాల వ్యాపారాలను దక్కించుకోవడానికి ఆసక్తి చూపుతున్నట్టు తెలిసింది. మరోవైపు ఈ కంపెనీ విషయంలో న్యాయవివాదం కొనసాగుతున్నప్పటికీ, దీని ఎలా దక్కించుకోవాలని ఈ ఫుడ్, రెస్టారెంట్ దిగ్గజాలు వ్యూహాలు రచిస్తున్నాయని రిపోర్టులు తెలిపాయి. విక్రమ్ భక్షికి చెందిన కన్నాట్ ప్లాజా రెస్టారెంట్‌లతో ఉన్న ఫ్రాంచైజీల ఒప్పందాన్ని మెక్‌డొనాల్డ్స్ ఇండియా రద్దు చేసింది. దీంతో వేల సంఖ్యలో ఉద్యోగులు రోడ్డున పడ్డారు. వందల సంఖ్యలో రెస్టారెంట్లు మూత పడ్డాయి.
ఎకనామిక్స్ టైమ్స్ రిపోర్టు ప్రకారం హార్డ్‌క్యాసిల్ రెస్టారెంట్లు సౌత్, వెస్ట్ మెక్‌డొనాల్డ్స్‌ను నిర్వహిస్తున్నాయి.. స్పెషాలిటీ రెస్టారెంట్లు, మెయిన్ ల్యాండ్ చైనా, ఓలలో యజమాన్యం కలిగ ఉండగా.. జుబిలెంట్ ఫుడ్‌వర్క్స్, డామినోస్ పిజ్జా, డంకిన్ డొనట్స్ బ్రాండ్లను.. మూన్ బెవరేజస్ కోకా-కోలాను.. లైట్ బైట్ ఫుడ్స్ పంజాబ్ గ్రిల్, ఆసియా సెవన్‌ను ప్రమోట్ చేస్తున్నాయి. విక్రమ్ భక్షి, మెక్‌డొనాల్డ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన జాయింట్ వెంచర్ సీపీఆర్‌ఎల్ తూర్పు, ఉత్తర భారతంలో 169 మెక్‌డొనాల్డ్స్ రెస్టారెంట్లను నిర్వహించింది. వీటిలో 40 అవుట్‌లెట్లు ఢిల్లీలోనే ఉన్నాయి. ఒప్పందం ముగియడంతో మెక్‌డొనాల్డ్స్ పేరును, సిస్టమ్‌ను, ట్రేడ్‌మార్కును, డిజైన్‌ను వాడుకోవడానికివీల్లేదంటూ సీపీఆర్‌ఎల్‌ను ఆదేశించింది. ఈ రద్దు నిర్ణయానికి వ్యతిరేకంగా విక్రమ్ భక్షి, న్యాయ పోరాటానికి దిగారు. దీనిపై ఇంకా వివాదం కొనసాగుతూనే ఉంది.
Advertisement
Advertisement