Vikram Bakshi
-
మెక్‌డొనాల్డ్స్ కోసం 5 దిగ్గజ సంస్థలు పోటీ
సాక్షి, న్యూఢిల్లీ: కన్నాట్ ప్లాజా రెస్టారెంట్స్ లిమిటెడ్ యజమాని విక్రమ్ భక్షితో తలెత్తిన వివాదంతో తూర్పు, ఉత్తర భారతంలో భారీ ఎత్తున్న మెక్‌డొనాల్డ్స్ మూతపడిన సంగతి తెలిసిందే. ఈ వివాద నేపథ్యంలోనే మెక్‌డొనాల్డ్స్ ఇండియాలో భాగస్వామ్యం సంపాదించుకోవడం కోసం ఐదు దిగ్గజ రెస్టారెంట్, ఫుడ్ బిజెనెస్‌లు పోటీ పడుతున్నాయి. స్పెషాలిటీ రెస్టారెంట్లు, జుబిలెంట్ ఫుడ్‌వర్క్, మూన్ బెవరేజస్, లైట్ బైట్ ఫుడ్స్, హార్డ్‌క్యాసిల్ రెస్టారెంట్లు, మెక్‌డొనాల్డ్స్ ఉత్తర, తూర్పు ప్రాంతాల వ్యాపారాలను దక్కించుకోవడానికి ఆసక్తి చూపుతున్నట్టు తెలిసింది. మరోవైపు ఈ కంపెనీ విషయంలో న్యాయవివాదం కొనసాగుతున్నప్పటికీ, దీని ఎలా దక్కించుకోవాలని ఈ ఫుడ్, రెస్టారెంట్ దిగ్గజాలు వ్యూహాలు రచిస్తున్నాయని రిపోర్టులు తెలిపాయి. విక్రమ్ భక్షికి చెందిన కన్నాట్ ప్లాజా రెస్టారెంట్లతో ఉన్న ఫ్రాంచైజీల ఒప్పందాన్ని మెక్‌డొనాల్డ్స్ ఇండియా రద్దు చేసింది. దీంతో వేల సంఖ్యలో ఉద్యోగులు రోడ్డున పడ్డారు. వందల సంఖ్యలో రెస్టారెంట్లు మూత పడ్డాయి. ఎకనామిక్స్ టైమ్స్ రిపోర్టు ప్రకారం హార్డ్‌క్యాసిల్ రెస్టారెంట్లు సౌత్, వెస్ట్ మెక్‌డొనాల్డ్స్‌ను నిర్వహిస్తున్నాయి.. స్పెషాలిటీ రెస్టారెంట్లు, మెయిన్ ల్యాండ్ చైనా, ఓలలో యజమాన్యం కలిగ ఉండగా.. జుబిలెంట్ ఫుడ్‌వర్క్స్, డామినోస్ పిజ్జా, డంకిన్ డొనట్స్ బ్రాండ్లను.. మూన్ బెవరేజస్ కోకా-కోలాను.. లైట్ బైట్ ఫుడ్స్ పంజాబ్ గ్రిల్, ఆసియా సెవన్‌ను ప్రమోట్ చేస్తున్నాయి. విక్రమ్ భక్షి, మెక్‌డొనాల్డ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన జాయింట్ వెంచర్ సీపీఆర్ఎల్ తూర్పు, ఉత్తర భారతంలో 169 మెక్‌డొనాల్డ్స్ రెస్టారెంట్లను నిర్వహించింది. వీటిలో 40 అవుట్లెట్లు ఢిల్లీలోనే ఉన్నాయి. ఒప్పందం ముగియడంతో మెక్‌డొనాల్డ్స్ పేరును, సిస్టమ్‌ను, ట్రేడ్మార్కును, డిజైన్‌ను వాడుకోవడానికివీల్లేదంటూ సీపీఆర్ఎల్ను ఆదేశించింది. ఈ రద్దు నిర్ణయానికి వ్యతిరేకంగా విక్రమ్ భక్షి, న్యాయ పోరాటానికి దిగారు. దీనిపై ఇంకా వివాదం కొనసాగుతూనే ఉంది. -
43 మెక్‌డొనాల్డ్స్ మూత, ఉద్యోగాలు గోవింద
న్యూఢిల్లీ : మెక్‌డొనాల్డ్స్ విషయంలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. కన్నాట్ ప్లాజా రెస్టారెంట్ల(సీపీఆర్ఎల్) 50:50 జాయింట్ వెంచర్ విక్రమ్ బక్షికి, మెక్‌డొనాల్డ్స్‌కు మధ్య వివాదాలు తలెత్తడంతో మెక్డీలు మూత పడే స్థాయికి వచ్చింది. ఢిల్లీలో నిర్వహిస్తున్న మొత్తం 55 రెస్టారెంట్లలో 43 మూడింటిని మూతవేయాలని సీపీఆర్ఎల్ బోర్డు నిర్వహించింది. నేటి(గురువారం) నుంచి ఇవి మూతపడనున్నాయి. '' ఇది చాలా దురదృష్టకరం. కానీ సీపీఆర్‌ఎల్‌కు చెందిన 43 రెస్టారెంట్లను తాత్కాలికంగా మూసి వేయాల్సి వస్తుంది'' అని సీపీఆర్ఎల్ మాజీ మేనేజింగ్ డైరెక్టర్ విక్రమ్ బక్షి చెప్పారు. సీపీఆర్ఎల్ మొత్తం 168 రెస్టారెంట్లను ఆపరేట్ చేస్తోంది. బక్షి ప్రస్తుతం మేనేజింగ్ డైరెక్టర్‌గా లేనప్పటికీ, ఆయన, తన భార్యతో కలిసి సీపీఆర్ఎల్లో బోర్డు సభ్యులుగా ఉంటున్నారు. సీపీఆర్ఎల్ బోర్డులో మెక్‌డొనాల్డ్స్‌కు చెందిన ఇద్దరు ప్రతినిధులూ ఉన్నారు. కానీ బుధవారం ఉదయం స్కైప్ ద్వారా నిర్వహించిన బోర్డు మీటింగ్‌లో మెక్‌డొనాల్డ్స్ అవుట్లెట్లను మూసివేయాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. ఈ నిర్ణయంతో 1,700 మంది ఉద్యోగాలు కోల్పోనున్నారు. అయితే మూసివేసే విషయానికి గల ప్రధాన కారణాలను ఈ జాయింట్ వెంచర్ భాగస్వామి వెల్లడించలేదు. బక్షికి, మెక్‌డొనాల్డ్స్‌కు వివాదం తలెత్తడంతో, సీపీఆర్ఎల్ కచ్చితంగా చేయాల్సిన రెగ్యులేటరీ హెల్త్ లైసెన్సులను కూడా రెన్యువల్ చేయించలేదు. 2013 ఆగస్టులో సీపీఆర్ఎల్ మేనేజింగ్ డైరెక్టర్‌గా తొలగించబడ్డ బక్షి, మెక్‌డొనాల్డ్స్‌తో వివాదానికి దిగారు. ఈ విషయంపై కంపెనీ లా బోర్డులో విచారణ కూడా జరుగుతోంది. బక్షికి వ్యతిరేకంగా మెక్‌డొనాల్డ్స్ కూడా లండన్ కోర్టులో ఆర్బిట్రేషన్ దాఖలు చేసింది. నార్త్, ఈస్ట్ ఇండియాలో మాత్రమే మెక్డీలను కన్నాట్ ప్లాజా రెస్టారెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్వహిస్తోంది. సౌత్, వెస్ట్ ఇండియాలో మెక్‌డొనాల్డ్స్ ఆపరేషన్లను హార్డ్ క్యాసిల్ రెస్టారెంట్ల ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా వెస్ట్‌లైఫ్ డెవలప్మెంట్ లిమిటెడ్ నిర్వహిస్తోంది. సీపీఆర్ఎల్ ప్రస్తుతం తీసుకున్న నిర్ణయం మెక్‌డొనాల్డ్స్‌కు ప్రమాదకరమని బ్రాండింగ్ నిపుణులు చెబుతున్నారు.