హ్యాండ్ బ్యాగు ధర వింటే షాక్! | a luxury handbag has shattered the world auction record in Hong Kong | Sakshi
Sakshi News home page

హ్యాండ్ బ్యాగు ధర వింటే షాక్!

Published Thu, Jun 1 2017 7:33 PM | Last Updated on Tue, Sep 5 2017 12:34 PM

హ్యాండ్ బ్యాగు ధర వింటే షాక్!

హ్యాండ్ బ్యాగు ధర వింటే షాక్!

హాంగ్‌కాంగ్‌: సాధారణంగా మహిళలు షాపింగ్‌కు వెళితే కొన్ని వందలో, లేక వేలో ఖర్చుపెట్టి హ్యాండ్ బ్యాగును కొంటారు. కానీ ఈ ఫొటోలో కనిపిస్తున్న ఈ బ్యాగు ధర ఎంత ఉంటుందనుకుంటున్నారు. కాస్త ఖరీదైన బ్యాగ్ అయితే రూ.5 వేలు, లేక రూ.10 వేలు అని భావిస్తున్నారు కదూ.. అయితే ఈ మహిళ చేతిలో కనిపిస్తున్న ఈ బ్యాగు ధర వింటే ఎవరిరైనా దిమ్మతిరిగి పోతుంది. హ్యాండ్ బ్యాగు ధర 3,80,000 డాలర్లు (భారత కరెన్సీలో 2.448 కోట్ల రూపాయలు). ఈ బ్యాగు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన హ్యాండ్ బ్యాగుగా రికార్డు నెలకొల్పింది.

చూడటానికి మామూలుగా కనిపిస్తున్న ఈ బ్యాగును అరుదుగా కనిపించే తెల్లని మొసలి చర్మంతో రూపొందించారు. 18 క్యారట్ల బంగారంతో పాటు వందకు పైగా వజ్రాలు పొదిగిన ఈ బ్యాగును క్రిస్టీ అనే సంస్థ హాంగ్‌కాంగ్‌లో బుధవారం వేలం వేసింది. ఓ వ్యక్తి 2.448 కోట్ల రూపాయలకు బ్యాగును సొంతం చేసుకున్నాడు. ఆ సంస్థ అతడి వివరాలు మాత్రం వెల్లడించలేదు. గతేడాది క్రిస్టీ సంస్థ నిర్వహించిన వేలంలోనే 3 లక్షల డాలర్లకు అమ్ముడుపోయిన బ్యాగు రికార్డును తాజా వేలంలో తెల్లటి మొసలి చర్మంతో, వజ్రాలు పొదిగిన బ్యాగు చెరిపివేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement