Christie
-
గోవాలో బ్రిటన్ హోం సెక్రటరీ తండ్రికి ఉన్న ఆస్తి కబ్జా... విచారణకు ఆదేశం
పనాజీ: బ్రిటన్ ప్రధానిగా లిజ్ ట్రస్ పగ్గాలు చేపట్టిన వెంటనే భారత సంతతికి చెందిన సుయెల్లా బ్రేవర్మన్ని హోం సెక్రటరీగా నియమించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు బ్రిటన్ హోం సెక్రటరీ బ్రేవర్మన్ తండ్రి క్రిస్టీ ఫెర్నాండజ్కి గోవాలోని అస్సాగోలో సుమారు 13, 900 చ.కిమీ పూర్వీకులు ఆస్తి ఉంది. ఆ ఆస్తి కబ్జాకి గురయ్యిందని బ్రేవర్మన్ తండ్రి క్రిస్టీ ఫెర్నాండెజ్ ఫిర్యాదు చేసినట్లు గోవా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్(సిట్) అధికారి నిధి వాసన్ తెలిపారు. ఫెర్నాండజ్ ఫిర్యాదు ఆధారంగా తాము కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామని చెప్పారు. ఫెర్నాండెజ్‌కు అతని కుటుంబసభ్యులకు చెందిన అస్సగావో గ్రామంలో సర్వే నెంబర్ 253/3, 252/3లో ఉన్న ఆస్తులను ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు పవర్ ఆఫ్ అటార్నీ ద్వారా ఇన్వెంటరీ ప్రోసీడింగ్లను దాఖలు చేశారని ఫిర్యాదు చేశారని పోలీసు వర్గాలు తెలిపాయి. ఆయా వ్యక్తుల ఈ ఏడాది జులై 27న ఆ ప్రోసీడింగ్లను దాఖలు చేసినట్లు ఆగస్టులో తనకు తెలిసిందని ఫిర్యాదులో తెలిపారు. ఈ విషయాన్ని ఈమెయిల్ ద్వారా ఫెర్నాండజ్ గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ జస్పాల్ సింగ్ గోవా ఎన్నారై కమిషనరేట్లకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో గోవా ఎన్నారై కమీషనర్ నరేంద్ర సవైకర్ మాట్లాడుతూ... తమ శాఖకు గతవారమే ఈమెయిల్ వచ్చిందని, దీన్ని రాష్ట్ర హోం శాఖకు పంపించామని తెలిపారు. ఈ మేరకు గోవా ప్రభుత్వం ఇలాంటి భూ కబ్జా కేసులను నివారించేందుకు ఈ ఏడాది ప్రారంభంలో పోలీస్, రెవెన్యూ, ఆర్కెవ్స్, పురావస్తు శాఖ అధికారులతో కూడిన సిట్‌ని ఏర్పాటు చేసింది. ఈ సిట్ రాష్ట్రంలో ఇలాంటి భూ కబ్జా కేసులకు సంబంధించి సుమారు 100కు పైగా కేసులను దర్యాప్తు చేస్తోంది. (చదవండి: గేమింగ్ యాప్ స్కామ్.... సుమారు రూ. 7 కోట్లు స్వాధీనం) -
వజ్రాల వేలం.. కోట్లలో అమ్ముడుపోయాయి!
-
కత్తికి పదునే కాదు.. ధర కూడా ఎక్కువే
మన భారతదేశంలో వజ్ర వైడుర్యాలకు కొదువే లేదు. భారత్‌ను పాలించిన మహారాజులు వాడిన అపురూప ఆభరణాలు ఎన్నో ఎన్నెన్నో... మరి అలాంటి ఆభరణాలు, వజ్రాలు, రత్నాలు వేలం వేయగా వచ్చిన డబ్బెంతో తెలిస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే. అమూల్యమైన ఈ సంపదను దక్కించుకున్న ఆ సంస్థ ఏంటి? నిజాం నవాబు వాడిన కత్తి ఎంత ధరకు అమ్ముడుపోయింది? ఎన్ని దేశాలు ఈ వేలంలో పాల్లొన్నాయి.... ఆ విశేషాల కోసం ఈ వీడియో వీక్షించండి. -
గోల్కొండ వజ్రానికి రూ.45 కోట్లు
న్యూయార్క్: భారత్‌ను పాలించిన మహారాజులు, మొఘలులు వినియోగించిన వజ్రాభరణాలు న్యూయార్క్‌లో నిర్వహించిన ఓ వేలంపాటలో కోట్లకు అమ్ముడుపోయాయి. ప్రఖ్యాత క్రిస్టీస్ వేలంసంస్థ ఈ వేలం నిర్వహించింది. గోల్కొండలో దొరికిన మిర్రర్ ఆఫ్ ప్యారడైజ్ వజ్రం, నిజాం ధరించిన గొలుసు, ఆర్కాట్ నవాబుకు చెందిన వజ్రం, స్వర్ణాభరణాలు, కత్తులు, రత్నాలుసహా దాదాపు 400 పురాతన వస్తువులను వేలం వేశారు. ‘మహారాజులు, మొఘలుల వైభవం’ పేరిట నిర్వహించిన ఈ వేలంలో క్రిస్టీస్ సంస్థకు రూ.756 కోట్లు వచ్చాయి. భారతీయ నగలు, కళాఖండాలు గతంలో ఎన్నడూ ఇంతటి భారీ ధరకు అమ్ముడుపోలేదని క్రిస్టీస్ పేర్కొంది. 2011లో ఎలిజబెత్ రాణి సేకరించిన వస్తువులు రూ.14.4 కోట్ల ధర పలికాయి. గోల్కొండలో దొరికిన 52.58 క్యారెట్ల బరువైన మిర్రర్ ఆఫ్ ప్యారడైజ్ వజ్రం రూ.45 కోట్లు పలికింది. ఆర్కాట్ నవాబుకు చెందిన 17 క్యారెట్ల గోల్కొండ వజ్రం(ఆర్కాట్–2) రూ.23.5 కోట్లకు అమ్ముడుపోయింది. హైదరాబాద్ నిజాం ధరించిన 33 వజ్రాలు పొదిగిన హారం రూ. 17 కోట్లు పలికింది. ఇండోర్ మహారాజు యశ్వంత్ రావ్ హాల్కర్ 2 ధరించిన రత్నాలతో కూడిన గొలుసు రూ. 1.44 కోట్లు, జైపూర్ రాజమాత గాయత్రీ దేవి ధరించిన వజ్రపుటుంగరం రూ. 4.45 కోట్లు, 1680–1720 కాలానికి చెందిన వజ్రాలు పొదిగిన హుక్కా సెట్ రూ.5.3కోట్లు, సీతారామాంజనేయుల ప్రతిమలున్న మరో హారం రూ. 5.12 కోట్లు పలికాయి. 5 వరసల ముత్యాల గొలుసు రూ.11.8 కోట్లకు, వజ్రాలహారం రూ. 1.5 కోట్లకు అమ్ముడుపోయాయి. ఖతార్‌కు చెందిన రాజకుటుంబం సేకరించిన ఈ ఆభరణాలను క్రిస్టీస్ వేలం వేసింది. మొఘల్ మహారాజు షాజహాన్ వాడిన బాకు రూ.23.4 కోట్లు పలికింది. హైదరాబాద్ నిజాం నవాబు వాడిన కత్తి రూ. 13.4 కోట్లు పలికింది. భారత్‌కు చెందిన ఒక కత్తి ఇంత ధర పలకడం ఇదే మొదటిసారి. భారత్ సహా 45 దేశాలకు చెందిన ఔత్సాహికులు ఈ వేలంలో పాల్గొన్నారు. జైపూర్, ఇండోర్, బరోడా రాజవంశీకులకు చెందిన ఆభరణాలు, వస్తువులనూ ఈ వేలంలో పెట్టారు. షాజహాన్ కత్తి మిర్రర్ ఆఫ్ ప్యారడైజ్ వజ్రం -
అమెరికాలో వేలానికి షాజహాన్ కత్తి
న్యూఢిల్లీ: మొఘల్ చక్రవర్తి షాజహాన్‌కు చెందిన వజ్రాలు పొదిగిన కత్తి, కపుర్తలా రాజు జగత్జిత్ సింగ్‌కు చెందిన ఖడ్గం సహా 400 పురాతన వస్తువులను జూన్ 19న వేలం వేయనున్నట్లు క్రీస్టీ సంస్థ తెలిపింది. సింహం తలలాంటి పిడితో వజ్రాలు పొదిగిన జగత్జిత్ సింగ్ ఖడ్గం ప్రారంభధర రూ.69 లక్షలుగా ఉంటుందని వెల్లడించింది. అలాగే మొఘల్ చక్రవర్తి షాజహాన్‌కు చెందిన కత్తికి ఈ వేలంలో రూ.17.36 కోట్లు దక్కవచ్చని భావిస్తున్నారు. జైపూర్‌రాజు సవాయ్ మాన్సింగ్–2 భార్య రాణి గాయత్రీదేవికి చెందిన వజ్రాలు, ముత్యాలు పొదిగిన హారానికి రూ.10.42 కోట్లు రావొచ్చని అంచనా వేస్తున్నారు. పట్టాభిషేకం సందర్భంగా నిజాం రాజులు వాడిన వజ్రాలు, రత్నాలు, కెంపులు పొదిగిన ఖడ్గం 6.94 కోట్ల నుంచి రూ.10.42 కోట్ల వరకూ దక్కవచ్చని క్రీస్టీ సంస్థ పేర్కొంది. వీటితో పాటు టిప్పు సుల్తాన్ లాకెట్‌తో పాటు పలు ఆభరణాలు, వజ్రాలు, అలంకరణ వస్తువులను జూన్ 14–18 మధ్య న్యూయార్క్‌లో ప్రదర్శనకు ఉంచనున్నట్లు చెప్పింది. -
అమ్మకానికి తొలి యాపిల్ కంప్యూటర్
న్యూఢిల్లీ: టెక్ దిగ్గజం యాపిల్ తొలినాళ్లలో తయారు చేసిన కంప్యూటరు అమ్మకానికి వస్తోంది. మే 16 నుంచి 24 దాకా ఆన్లైన్లో నిర్వహించే వేలంలో క్రిస్టీస్ సంస్థ దీన్ని విక్రయిస్తోంది. దీని ధర 4,00,000– 6,50,000 డాలర్ల దాకా (సుమారు రూ. 2.81 కోట్ల నుంచి రూ. 4.56 కోట్ల దాకా) పలకవచ్చని అంచనా వేస్తున్నారు. 1976లో యాపిల్ తొలి విడతలో తయారు చేసిన 200 యాపిల్–1 కంప్యూటర్స్‌లో ప్రస్తుతం కొన్ని మాత్రమే మిగిలి ఉన్నాయి. వీటిల్లో ఒకటి ఇప్పుడు వేలానికొచ్చింది. యాపిల్ సహ వ్యవస్థాపకులు స్టీవ్ జాబ్స్, స్టీవ్ వోజ్నియాక్ దీన్ని రూపొందించారు. ‘అప్పట్లో సుమారు 200 యాపిల్–1 కంప్యూటర్స్‌ను తయారు చేశారు. 666.66 డాలర్ల ధరకు విక్రయించారు. 1977లో రేటును 475 డాలర్లకు తగ్గించారు. అదే ఏడాది ఆఖరు నాటికి యాపిల్– ఐఐ అందుబాటులోకి వచ్చింది. దీంతో ఆ తర్వాత నుంచి యాపిల్–1 అమ్మకాలను నిలిపివేశారు‘ అని క్రిస్టీస్ సంస్థ పేర్కొంది. 1977 అక్టోబర్‌లో యాపిల్–1 అమ్మకాలను నిలిపివేసిన తర్వాత వాటిని కొనుక్కున్న వారు తిరిగి ఇస్తే కొంత డిస్కౌంటుతో కొత్త కంప్యూటర్ను కొనుగోలు చేసే ఆఫర్లను యాపిల్ ప్రకటించింది. అలా తిరిగొచ్చిన వాటిలో చాలామటుకు కంప్యూటర్స్ ధ్వంసం కాగా.. యాపిల్–1 కంప్యూటర్స్‌లో సుమారు సగం మాత్రమే మిగిలాయి. వీటినే క్రిస్టీస్ ప్రస్తుతం అమ్మకానికి తెస్తోంది. -
హ్యాండ్ బ్యాగు ధర వింటే షాక్!
హాంగ్‌కాంగ్: సాధారణంగా మహిళలు షాపింగ్‌కు వెళితే కొన్ని వందలో, లేక వేలో ఖర్చుపెట్టి హ్యాండ్ బ్యాగును కొంటారు. కానీ ఈ ఫొటోలో కనిపిస్తున్న ఈ బ్యాగు ధర ఎంత ఉంటుందనుకుంటున్నారు. కాస్త ఖరీదైన బ్యాగ్ అయితే రూ.5 వేలు, లేక రూ.10 వేలు అని భావిస్తున్నారు కదూ.. అయితే ఈ మహిళ చేతిలో కనిపిస్తున్న ఈ బ్యాగు ధర వింటే ఎవరిరైనా దిమ్మతిరిగి పోతుంది. హ్యాండ్ బ్యాగు ధర 3,80,000 డాలర్లు (భారత కరెన్సీలో 2.448 కోట్ల రూపాయలు). ఈ బ్యాగు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన హ్యాండ్ బ్యాగుగా రికార్డు నెలకొల్పింది. చూడటానికి మామూలుగా కనిపిస్తున్న ఈ బ్యాగును అరుదుగా కనిపించే తెల్లని మొసలి చర్మంతో రూపొందించారు. 18 క్యారట్ల బంగారంతో పాటు వందకు పైగా వజ్రాలు పొదిగిన ఈ బ్యాగును క్రిస్టీ అనే సంస్థ హాంగ్‌కాంగ్‌లో బుధవారం వేలం వేసింది. ఓ వ్యక్తి 2.448 కోట్ల రూపాయలకు బ్యాగును సొంతం చేసుకున్నాడు. ఆ సంస్థ అతడి వివరాలు మాత్రం వెల్లడించలేదు. గతేడాది క్రిస్టీ సంస్థ నిర్వహించిన వేలంలోనే 3 లక్షల డాలర్లకు అమ్ముడుపోయిన బ్యాగు రికార్డును తాజా వేలంలో తెల్లటి మొసలి చర్మంతో, వజ్రాలు పొదిగిన బ్యాగు చెరిపివేసింది. -
నాలుగు పుస్తకాలు రూ.24 కోట్లు!
లండన్: ఇంగ్లిష్ మహా నాటకకర్త, కవి విలియం షేక్స్పియర్ కు సంబంధించిన నాలుగు పుస్తకాలు వేలంలో రికార్డు ధరకు అమ్ముడు పోయాయి. క్రిస్టీస్ నిర్వహించిన వేలంలో సుమారు రూ. 24 కోట్ల(3.67 మిలియన్ డాలర్లు) ఈ పుస్తకాలకు అమెరికాకు చెందిన ప్రైవేటు సేకరణదారు దక్కించుకున్నారు. ఇందులో మొదటి పుస్తకమే దాదాపు రూ. 17.5 కోట్లు(2.6 మిలియన్ డాలర్లు) పలికింది. రెండో పుస్తకం సుమారు 1.8 కోట్లు(2.8 లక్షల డాలర్లు), మూడో పుస్తకం దాదాపు రూ. 3.5 కోట్లు(5.33 లక్షల డాలర్లు), నాలుగో పుస్తకం రూ.47 లక్షలు(69,889 డాలర్లు) పలికాయని జిన్హువా వార్తా సంస్థ తెలిపింది. -
ఆర్ట్ మార్కెట్ అదుర్స్..!
ఆ హాల్ అంతా గుండుసూది పడినా వినిపించేంత నిశ్శబ్దంగా ఉంది. అక్కడ కూర్చున్నవాళ్లలో కోట్లకు పడగలెత్తిన అపర కుబేరులున్నారు. టాప్ కార్పొరేట్ల నుంచి బడా వ్యాపారవేత్తలకూ కొదవలేదు. అంతేకాదు ఖరీదైన సూట్లు, కళ్లు చెదిరే వజ్రాభరణాలతో అక్కడికి వచ్చినవాళ్లతో మెరిసిపోతోంది ఆ ప్రదేశం. అందరిలోనూ ఒకటే ఉత్కంఠ. ఇంతలో ఒక వ్యక్తి రూ.12.5 కోట్లు అంటూ చెయ్యెత్తాడు. ఏంటి ఇదంతా అనుకుంటున్నారా! భారతీయ చిత్రకారుడు గీసిన పెయిం టింగ్‌కు వేలంలో పలికిన తొలి బిడ్ ఇది. ప్రపంచప్రఖ్యాత వేలం సంస్థ ‘క్రిస్టీస్’ ఇటీవలే భారత్‌లో నిర్వహించిన తొలి వేలం బంపర్ సక్సెస్‌కు ఇది నిదర్శనం. మన ఆర్ట్ మార్కెట్ భవిష్యత్తు మరింత వర్ణ రంజితంగా మారనుందనేందుకు ఈ స్పందనే తార్కాణమని పరిశీలకులు చెబుతున్నారు. వాసుదేవ్ గయ్‌తోండే గీసిన 60x40 అంగుళాల ఆయిల్ పెయింటింగ్‌కు క్రిస్టీస్ వేలంలో ధర అంతకంతకూ పెరుగుతూపోయింది. అసలు ఈ సంస్థ ఊహించిన ధరకు తొలి బిడ్ రెట్టింపు కావడం గమనార్హం. కొద్ది నిమిషాల్లోనే ఒక వ్యక్తి రూ.18 కోట్లకు పైగా బిడ్‌ను వేశాడు. మరిన్ని చేతులు వేలంలో పైకిలేచాయి. వేలం ధర పెంచేందుకు పోటీపడ్డారు. దీంతో నిశ్శబ్దం పటాపంచలై సందడి వాతావరణం నెలకొంది. చూస్తుండగానే ఈ ‘అన్టైటిల్డ్’ ఆయిల్ ఆన్ కాన్వాస్ చిత్రానికి రేటు రూ. 19 కోట్లను దాటింది. చివరకు ఏడు నిమిషాల పోటాపోటీ బిడ్డింగ్ అనంతరం రూ.23.7 కోట్లకు ఈ పెయింటింగ్ అమ్ముడుపోయింది. పసిడి వర్ణంలో ఉన్న ఈ ల్యాండ్‌స్కేప్‌ను ఆయన 1979లో చిత్రించారు(2001లో గయ్‌తోండే మరణించారు). అమెరికాకు చెందిన ఒక ప్రైవేటు ఆర్ట్ కలెక్టర్(ప్రముఖ ఆర్టిస్ట్‌ల చిత్రకళా ఖండాలను సేకరించే వ్యక్తి) దీన్ని ఇంత భారీ మొత్తాన్ని వెచ్చించి చేజిక్కించుకున్నాడు. రూపాయల్లో చూస్తే వేలంలో ఒక భారతీయ ఆర్టిస్ట్ చిత్రానికి లభించిన అత్యధిక మొత్తంగా దీన్ని పేర్కొంటున్నారు. తయెబ్ మెహతా ‘మహిషాసుర’ చిత్రం(ఎక్రలిక్ ఆన్ కాన్వాస్-ఈ సిరీస్‌లో ఒక పెయింటింగ్) రూ.19.7 కోట్లకు అమ్ముడై వేలంలో రెండో స్థానంలో నిలిచింది. ఇంకా ఈ వేలంలో విఖ్యాత ఆర్టిస్ట్ ఎంఎఫ్ హుస్సేన్‌తో పాటు రవీంద్రనాథ్ ఠాగూర్, అవనీంద్రనాథ్, అమృతా షెర్గిల్, మంజిత్ బవా, ఎస్‌హెచ్ రజా, అర్పితా సింగ్ వంటి దిగ్గజ చిత్రకారుల పెయింటింగ్‌లు సైతం కొలువుతీరాయి. కార్పొరేట్ల హల్చల్... ముంబైలోని తాజ్‌మహల్ ప్యాలెస్ హోటల్లోని ప్రత్యేక ప్రదేశం(క్రిస్టల్ రూమ్)లో ఈ కళాఖండాల వేలం జరిగింది. ఇందులో పాల్గొనేందుకు వచ్చినవాళ్లు ధరించిన దుస్తులు, అత్యంత ఖరీదైన నగలు.. పెయింటింగ్‌లలోని రంగులతో పోటీపడ్డాయి. ఆర్ట్ కలెక్టర్లు, కార్పొరేట్ దిగ్గజాలు ఒకరితోఒకరు మమేకమై అక్కడి చిత్రరాజాల గురించి చర్చల్లో మునిగితేలారు. ప్రధానంగా ఇక్కడ ఆందరి దృష్టినీ ఆకర్షించినవాళ్లలో ఆర్పీజీ ఎంటర్ప్రైజెస్ చైర్మన్ హర్ష్ గోయెంకా ఒకరు. జేఎస్‌డబ్ల్యూ స్టీల్ అధినేత సజ్జన్ జిందాల్ భార్య సంగీతా జిందాల్, ఆమె కుమార్తె; సిటీ ఇండియా సీఈవో ప్రమిత్ ఝవేరి భార్య ముకీతా ఝవేరి కూడా అతిథుల్లో ఉన్నారు. ఢిల్టీ ఆర్ట్ గ్యాలరీ యజమాని ఆశిష్ ఆనంద్ సహా దేశంలో పేరొందిన పలు ఆర్ట్ గ్యాలరీల చీఫ్‌లు సైతం ఈ వేలానికి తరలివచ్చారు. మొత్తంమీద భారతీయ చిత్రకారులు, చిత్రకళలపై పెరుగుతున్న మక్కువ... ఇక్కడి ఆర్ట్ మార్కెట్‌కు సానుకూలాంశమని పరిశీలకులు చెబుతున్నారు. అంచనాలకు రెట్టింపు... లండన్‌కు చెందిన క్రిస్టీస్.. ముంబై వేలంలో 1.54 కోట్ల డాలర్ల(దాదాపు రూ. 95 కోట్లు) విలువైన పెయింటింగ్‌లు, కళాఖండాలను విక్రయించింది. ఇది ఆ సంస్థ అంచనా వేసిన మొత్తంకంటే రెట్టింపునకు పైనే. అంతక్రితం షాంఘై వేలంలో క్రిస్టీస్ 2.5 కోట్ల డాలర్ల విలువైన నగలు, శిల్పాలు, వాచీలను విక్రయించింది. ‘వేలంలో పాల్గొన్నవారిలో ఆసక్తి, జోష్‌తో అనూహ్య విజయం సాధించాం. వచ్చే డిసెంబర్ కంటే ముందే భారత్‌లో మళ్లీ వేలం నిర్వహించాలన్నంత ఆసక్తి మాలో నింపింది. విదేశాల నుంచి కూడా ఇక్కడికి భారీ సంఖ్యలో క్లయింట్లు తరలిరావడం, ఫోన్లతోనూ బిడ్డింగ్‌లో పాల్గొనడం గమనించదగ్గ అంశం’ అని క్రిస్టీస్ సీఈవో స్టీవెన్ మర్ఫీ వ్యాఖ్యానించారు.