నాలుగు పుస్తకాలు రూ.24 కోట్లు!
లండన్: ఇంగ్లిష్ మహా నాటకకర్త, కవి విలియం షేక్‌స్పియర్ కు సంబంధించిన నాలుగు పుస్తకాలు వేలంలో రికార్డు ధరకు అమ్ముడు పోయాయి. క్రిస్టీస్ నిర్వహించిన వేలంలో సుమారు రూ. 24 కోట్ల(3.67 మిలియన్ డాలర్లు) ఈ పుస్తకాలకు అమెరికాకు చెందిన ప్రైవేటు సేకరణదారు దక్కించుకున్నారు.
ఇందులో మొదటి పుస్తకమే దాదాపు రూ. 17.5 కోట్లు(2.6 మిలియన్ డాలర్లు) పలికింది. రెండో పుస్తకం సుమారు 1.8 కోట్లు(2.8 లక్షల డాలర్లు), మూడో పుస్తకం దాదాపు రూ. 3.5 కోట్లు(5.33 లక్షల డాలర్లు), నాలుగో పుస్తకం రూ.47 లక్షలు(69,889 డాలర్లు) పలికాయని జిన్హువా వార్తా సంస్థ తెలిపింది.