William Shakespeare
-
ప్రపంచంలోనే మొదటి కోవిడ్ టీకా తీసుకున్న వ్యక్తి మృతి
లండన్: ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా కోవిడ్–19 టీకా తీసుకున్న వ్యక్తిగా చరిత్ర సృష్టించిన విలియం షేక్స్పియర్(81) సోమవారం కన్నుమూశారు. యూనివర్సిటీ హాస్పిటల్ కోవెంట్రీ, వారి్వక్‌షైర్‌లో గత ఏడాది డిసెంబర్ 8న మొట్టమొదటి ఫైజర్ టీకా డోస్ తీసుకున్న పురుషునిగా షేక్స్పియర్ రికార్డు నెలకొల్పారు. అంతకుముందు, అదే ఆస్పత్రిలో మార్గరెట్ కీనన్(91)కోవిడ్ టీకా తీసుకుని, మొట్టమొదటి వ్యక్తిగా రికార్డు సృష్టించారు. కోవిడ్‌యేతర రుగ్మతలతో అదే ఆస్పత్రిలో చేరిన షేక్స్పియర్ ఈనెల 20న కన్నుమూసినట్లు ఆస్పత్రి వర్గాలు ప్రకటించాయి. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారని బీబీసీ తెలిపింది. -
నాలుగు పుస్తకాలు రూ.24 కోట్లు!
లండన్: ఇంగ్లిష్ మహా నాటకకర్త, కవి విలియం షేక్స్పియర్ కు సంబంధించిన నాలుగు పుస్తకాలు వేలంలో రికార్డు ధరకు అమ్ముడు పోయాయి. క్రిస్టీస్ నిర్వహించిన వేలంలో సుమారు రూ. 24 కోట్ల(3.67 మిలియన్ డాలర్లు) ఈ పుస్తకాలకు అమెరికాకు చెందిన ప్రైవేటు సేకరణదారు దక్కించుకున్నారు. ఇందులో మొదటి పుస్తకమే దాదాపు రూ. 17.5 కోట్లు(2.6 మిలియన్ డాలర్లు) పలికింది. రెండో పుస్తకం సుమారు 1.8 కోట్లు(2.8 లక్షల డాలర్లు), మూడో పుస్తకం దాదాపు రూ. 3.5 కోట్లు(5.33 లక్షల డాలర్లు), నాలుగో పుస్తకం రూ.47 లక్షలు(69,889 డాలర్లు) పలికాయని జిన్హువా వార్తా సంస్థ తెలిపింది. -
ఆ రైటర్ కు అక్రమ సంతానముందా?
లండన్: జగమెరిగిన విశ్వవిఖ్యాత రచయిత విలియమ్ షేక్స్పియర్. 16వ శతాబ్దానికి చెందిన ఈ బ్రిటిష్ రచయితకు అక్రమ సంతానం ఉందా? అంటే తాజా పుస్తకం ఔననే అంటోంది. ఈ లెజండరీ రచయితకు అక్రమ సంబంధం ద్వారా ఓ కొడుకు పుట్టాడని, అతని కోసం ఓ గేయాన్ని కూడా రాశారని తాజా పుస్తకం వెల్లడించింది. పిల్లాడిగా ఉన్నప్పుడు విలియమ్ డెవెనంట్ను ఉద్దేశించి 'మై లవ్లీ బాయ్' అంటూ సానెట్ 126ను షేక్స్పియర్ రాశారు. డెవెనంట్ పెరిగి పెద్దయిన తర్వాత ప్రముఖ రచయితగా పేరొందారు. ఈ ఇద్దరి ముఖాల్లో పోలికలు ఉండటం, కళ్లు ఒకేవిధంగా ఉండటంతో డెవెనంట్ షేక్స్పియర్ కొడుకు అయి ఉంటాడని తాజా పుస్తకం 'షేక్స్పియర్స్ బాస్టర్డ్'లో పేర్కొన్నారు. షేక్స్పియర్ 400 జయంతి సందర్భంగా సిమన్ ఆండ్రూ స్టిర్లింగ్ డెవెనంట్ ఆత్మకథగా ఈ పుస్తకాన్ని ప్రచురిస్తున్నారు. షేక్స్పియర్ డెవెనంట్ తండ్రి అని, అయితే అప్పటి పండితులు వారిద్దరిని అణచివేశారని అప్పటి వదంతుల ప్రకారం తెలుస్తున్నది రచయిత ఈ పుస్తకంలో పేర్కొన్నాడు. నిజానికి షేక్స్పియర్కు తన భార్య అన్ని హ్యాథ్‌వే ద్వారా కలిగిన కొడుకు హమ్నెట్. అతను 11 ఏళ్ల వయస్సులోనే చనిపోయాడు. షేక్స్పియర్కు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. వారు పెళ్లిలు చేసుకొని స్థిరపడ్డారు. -
కవిభల్లూక
ఉద్దండపిండాలైన కవులను పుంగవులుగానే పోల్చారు మనవాళ్లు. బహుశ నాటి కవులలో వృషభ గతి కనిపించి ఉంటుందని అప్పటి విమర్శకులకు. భగవంతుడి దయవల్ల మనకు కవిభల్లూకాలు, కవిజంబూకాలు ఎవరూ లేరు. ఆ బిరుదులకు బహుశ తగిన అర్హులెవరూ మనకు లేరు. అయితే, ప్రాచీన ఇంగ్లిష్ కవులలో అగ్రగణ్యుడిగా, విలియమ్ షేక్స్పియర్ తర్వాత అంతటి వాడుగా ఖ్యాతి పొందిన లార్డ్ బైరన్ మాత్రం ‘కవిభల్లూక’ బిరుదుకు ప్రపంచంలోనే ఏకైక అర్హుడు. ఎందుకంటారా..? లార్డ్ బైరన్ అంటే ప్రాచీనాంగ్ల మహాకవులలో ఒకరిగా సాహితీ ప్రియులలో చాలామందికి ఆయనపై ఎనలేని భక్తిప్రపత్తులు నేటికీ ఉన్నాయి. పద్నాలుగో ఏటనే కవన రచన మొదలు పెట్టిన బైరన్ కవిగారు యవ్వనారంభ కాలంలో సుప్రసిద్ధ కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలో చేరారు. తరగతికి హాజరయ్యేటప్పుడు తన వెంట తన పెంపుడు జాగిలాన్నీ తీసుకొచ్చారు. జాగిలాలను తరగతి గదుల్లోకి తీసుకు రావడం నిషిద్ధమని, విశ్వవిద్యాలయ నిబంధనలకు అది విరుద్ధమని అధికారులు అభ్యంతర పెట్టారు. అధికారుల అభ్యంతరంతో జాగిలాన్ని తరగతి గది నుంచి వెలుపలకు తీసుకుపోయినా, ఈ తతంగమంతా బైరన్ కవిగారికి అవమానకరంగా తోచింది. అధికారులకు తగిన బుద్ధి చెప్పాలనుకున్నాడు. ముందుగా విశ్వవిద్యాలయ నియమ నిబంధనలను క్షుణ్ణంగా అధ్యయనం చేశాడు. తరగతి గదులకు జాగిలాలను తేకూడదన్న నిబంధనను రూఢి చేసుకున్నాడు. అయితే, నిబంధనల్లో భల్లూకాల ప్రస్తావన లేకపోవడాన్ని కూడా గమనించాడు. అంతే, ఈసారి తరగతి గదికి ఏకంగా ఒక భల్లూకాన్నే వెంటేసుకు రావడం మొదలుపెట్టాడు. అధికారులకు ఇది ఇబ్బందిగానే ఉన్నా, భల్లూకాలపై నిషేధం లేకపోవడంతో నోరు మెదపలేకపోయారు. కూర్పు: పన్యాల జగన్నాథదాసు -
కేరళలో ‘మయసభ’!
గాల్లోంచి వస్తువులను సృష్టించడం.. కళ్ల ముందే దేనినైనా మాయం చేయడం.. మనిషి తల, శరీరాన్ని ముక్కలుగా చేసి తిరిగి అతికించడం.. ఇదంతా ఇంద్రజాలం (మ్యాజిక్) మహిమ. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాల్లో, ఎంతో మంది ఇంద్రజాలికులు ప్రదర్శించే ట్రిక్కులన్నింటినీ ఒకే చోట చూడగలిగితే.. బాగుంటుంది కదూ! ఈ అవకాశం మన దేశంలోనే తొలిసారిగా కేరళ రాజధాని తిరువనంతపురంలో అందుబాటులోకి రానుంది. ‘మ్యాజిక్ ప్లానెట్’ పేరిట అకాడమీ ఆఫ్ మ్యాజికల్ సెన్సైస్ దీనిని ఏర్పాటు చేయనుంది. 1.5 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేయనున్న ఈ ‘మ్యాజిక్ ప్లానెట్’ను ప్రపంచ ఇంద్రజాల దినోత్సవమైన అక్టోబర్ 31న ప్రారంభిస్తారు. దీని మస్కట్ ‘హారీ’ని, యానిమేటెడ్ సినిమాను 10న విడుదల చేయనున్నామని మ్యాజిక్ అకాడమీ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ గోపీనాథ్ ముతుకాడ్ వెల్లడించారు. ‘మ్యాజిక్ ప్లానెట్’లో క్రీస్తుపూర్వం 5 వేల ఏళ్లనాటి నుంచి ఇంద్రజాలానికి చెందిన అంశాలతో కూడిన మ్యూజియం, వర్చువల్ సూపర్‌మార్కెట్, షేక్స్పియర్ ‘ది టెంపెస్ట్’ ఆధారంగా ఏర్పాటు చేసే కార్యక్రమం కూడా ఉంటాయన్నారు. -
తెలుసుకోవాల్సిన పుస్తకం
డెడ్ సోల్స్ Voice of the voicelessV గా ఉండాలి రచయిత అన్నాడు నికొలాయ్ వాసిలీలిచ్ గొగోల్ (1809 - 1852). అంతేగాదు. ‘అధికార మదాంధుల్ని, నియంతల్ని, మన మీద సవారీ చేస్తున్న, మనల్ని దోపిడీ చేస్తున్న దుర్మార్గుల్ని ఎద్దేవా చెయ్యి’ అని తనను తాను నిరంతరం హెచ్చరించుకున్నాడు. అలాగ ఆనాడు రష్యాలో అమలులో ఉన్న అర్ధబానిస విధానం (సెర్ఫ్‌డమ్) లో రైతు కూలీల్ని భూస్వాములు వినియోగ వస్తువుల్లా కొనుక్కోవటాన్ని వ్యంగ్యంగా చిత్రించి పాఠకుల చేత కన్నీరు పెట్టించాడు గొగోల్. ఇందులో చిచికోవ్ అనబడేవాడు ప్రతి భూస్వామి దగ్గరకూ వెళ్లి అతడి వద్ద చచ్చిన కూలీల్ని కొనుక్కుని బ్యాంకులకు తాకట్టు పెట్టి డబ్బు చేసుకుంటాడు. ఆనాటి రైతుల దుర్భర,దయనీయ పరిస్థితులు రాతిబండలను కూడా కరిగిస్తాయి. వాళ్ల బతుకులు పశువుల కన్నా అధ్వాన్నం. భూలోక నరకాన్ని మన కళ్ల ముందు దర్శింప చేసిన రచయిత- ‘వ్యవస్థ మారాలి’ అని ప్రత్యేకంగా వ్యాఖ్యానం చేయనవసరం లేదు. దీనిని ‘మృతజీవులు’ అనే పేరుతో కొ.కు. తెలుగు అనువాదం చేశారు. ఇటీవల సంక్షిప్తరూపంలో పీకాక్ క్లాసిక్స్ ఎడిటర్ గాంధీ అనువాదం చేశారు. మార్కెట్లో ఉంది. డాన్ క్విక్సాట్ షేక్స్పియర్కు సమకాలీనుడైన స్పానిష్ రచయిత మిగ్వెల్ ది సెర్వాంటెస్ (1547-1616), తన వృద్ధాప్యంలో రాసిన పెద్ద నవల ఇది. (ఖఠజీౌ్ఠ్ట్ఛను ‘కియోటీ’గా ఉచ్ఛరిస్తారు). మొదటి భాగం 1605లో వెలువడింది. అడ్వెంచర్ పుస్తకాలు చదివి. బుర్ర పాడుచేసుకొని తనూ అడ్వెంచర్లు చెయ్యటానికి బయల్దేరిన అమాయకుడి ‘సాహస’ యాత్రలు చదవలేక పొట్ట చేత పట్టుకుని నవ్వని పాఠకులుండరు. రెండవ భాగం మరో పదేళ్ల తర్వాత వెలువడింది. ఇది చదివినవాళ్లు దీన్నో గొప్ప తాత్విక నవలగా బైబిల్ ఆఫ్ హ్యుమానిటీగా అభివర్ణించారు. ఈ పుస్తకాన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలంటే ప్రతి పాఠకుడూ దీన్ని కనీసం మూడుసార్లు- యవ్వనంలో, మధ్య వయసులో, వృద్ధాప్యంలో చదవాలంటారు. అస్తిత్వవాద సిద్ధాంతాన్ని (ఎగ్జిస్టెన్షియలిజం) ప్రతిపాదించిన జాన్ పాల్ సార్త్ ్రలాంటి తత్త్వవేత్తలకు ప్రేరణ డాన్ కియోటీ. - ముక్తవరం పార్థసారథి కథాసంధి: సాహిత్య అకాడెమీ ఫిబ్రవరి 7 సాయంత్రం ఐదున్నరకి కడప సిపి బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రంలో ‘కథాసంధి’ కార్యక్రమం నిర్వహించనుంది. సుంకోజి దేవేంద్రాచారి తన కథను పఠనం చేసి పాఠకులతో సంభాషిస్తారు. ఫిబ్రవరి 8న అదే ప్రాంగణంలో దళిత రచయిత పాలా వెంకట సుబ్బయ్య జయంతి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. వివరాలకు: 9440222117 -
రాముడి, కృష్టుడికి 'రామ్ లీలా'కు సంబంధం లేదు: భన్సాలీ
రామ్ లీలా చిత్ర టైటిల్ భారతీయ పురాణం రామ్ లీలాతోకాని, కృష్ణ భగవానుడి 'రాస్ లీలా'తో ఎలాంటి సంబంధం లేదని చిత్ర దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ స్పష్టం చేశారు. రామ్ లీలా చిత్రం విలియమ్ షేక్ స్పియర్ 'రోమియో అండ్ జూలియట్' నవల స్పూర్తితో రూపొందించాను అని తెలిపారు. రాముడికి సంబంధించిగాని, కృష్ట భగవానుడికి కథకు సంబంధించిన చిత్ర కాదని, భారత పురాణాలతో ఈ చిత్రానికి ఎలాంటి సంబంధం లేదు అని భన్సాలీ అన్నారు. అశ్లీలంగా, హింసాత్మకంగా, మితీమీరిన శృంగారంతో రామ్ లీలా చిత్రం హిందువుల మనోభావాల్ని దెబ్బతీసే విధంగా ఉన్నాయని.. కావున 15 నవంబర్ తేదిన విడుదలను నిలిపివేయాలని ఢిల్లీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రాముడికి సంబంధించిన కథ అని ప్రేక్షకులు రామ్ లీలా చిత్రం చూసే అవకాశం ఉంది అని.. హిందువుల మనోభావాల్ని దెబ్బతీసే ప్రమాధం ఉంది అని ఢిల్లీ కోర్టులో ఆరుగురు పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ చిత్రంలోని సన్నివేశాలు ఎవరి మనోభావాల్ని దెబ్బ తీసేలా లేవు.. ఎవర్ని అవమానించే రీతిలో కూడా లేవు. మత విశ్వాసాలకు భంగం వాటిల్లదు అని సంజయ్ లీలా భన్సాలీ తెలిపారు.