ఆ రైటర్‌ కు అక్రమ సంతానముందా? | Shakespeare had a secret son? | Sakshi
Sakshi News home page

ఆ రైటర్‌ కు అక్రమ సంతానముందా?

Published Wed, Feb 17 2016 9:59 AM | Last Updated on Sun, Sep 3 2017 5:50 PM

ఆ రైటర్‌ కు అక్రమ సంతానముందా?

ఆ రైటర్‌ కు అక్రమ సంతానముందా?

లండన్: జగమెరిగిన విశ్వవిఖ్యాత రచయిత విలియమ్‌ షేక్‌స్పియర్‌. 16వ శతాబ్దానికి చెందిన ఈ బ్రిటిష్ రచయితకు అక్రమ సంతానం ఉందా? అంటే తాజా పుస్తకం ఔననే అంటోంది. ఈ లెజండరీ రచయితకు అక్రమ సంబంధం ద్వారా ఓ కొడుకు పుట్టాడని, అతని కోసం ఓ గేయాన్ని కూడా రాశారని తాజా పుస్తకం వెల్లడించింది.

పిల్లాడిగా ఉన్నప్పుడు విలియమ్ డెవెనంట్‌ను ఉద్దేశించి 'మై లవ్లీ బాయ్‌' అంటూ సానెట్‌ 126ను షేక్‌స్పియర్ రాశారు. డెవెనంట్ పెరిగి పెద్దయిన తర్వాత ప్రముఖ రచయితగా పేరొందారు. ఈ ఇద్దరి ముఖాల్లో పోలికలు ఉండటం, కళ్లు ఒకేవిధంగా ఉండటంతో డెవెనంట్ షేక్‌స్పియర్ కొడుకు అయి ఉంటాడని తాజా పుస్తకం 'షేక్‌స్పియర్స్ బాస్టర్డ్'లో పేర్కొన్నారు. షేక్‌స్పియర్ 400 జయంతి సందర్భంగా సిమన్ ఆండ్రూ స్టిర్లింగ్ డెవెనంట్ ఆత్మకథగా ఈ పుస్తకాన్ని ప్రచురిస్తున్నారు. షేక్‌స్పియర్ డెవెనంట్ తండ్రి అని, అయితే అప్పటి పండితులు వారిద్దరిని అణచివేశారని అప్పటి వదంతుల ప్రకారం తెలుస్తున్నది రచయిత ఈ పుస్తకంలో పేర్కొన్నాడు. నిజానికి షేక్‌స్పియర్‌కు తన భార్య అన్ని హ్యాథ్‌వే ద్వారా కలిగిన కొడుకు హమ్నెట్. అతను 11 ఏళ్ల వయస్సులోనే చనిపోయాడు. షేక్‌స్పియర్‌కు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. వారు పెళ్లిలు చేసుకొని స్థిరపడ్డారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement