లండన్: ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా కోవిడ్–19 టీకా తీసుకున్న వ్యక్తిగా చరిత్ర సృష్టించిన విలియం షేక్‌స్పియర్(81) సోమవారం కన్నుమూశారు. యూనివర్సిటీ హాస్పిటల్ కోవెంట్రీ, వారి్వక్‌షైర్‌లో గత ఏడాది డిసెంబర్ 8న మొట్టమొదటి ఫైజర్ టీకా డోస్ తీసుకున్న పురుషునిగా షేక్‌స్పియర్ రికార్డు నెలకొల్పారు.
అంతకుముందు, అదే ఆస్పత్రిలో మార్గరెట్ కీనన్(91)కోవిడ్ టీకా తీసుకుని, మొట్టమొదటి వ్యక్తిగా రికార్డు సృష్టించారు. కోవిడ్‌యేతర రుగ్మతలతో అదే ఆస్పత్రిలో చేరిన షేక్‌స్పియర్ ఈనెల 20న కన్నుమూసినట్లు ఆస్పత్రి వర్గాలు ప్రకటించాయి. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారని బీబీసీ తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment