సాక్షి, హైదరాబాద్ : స్థిరాస్తి రంగంలో దశాబ్దన్నరకు పైగా అనుభవమున్న అభిరామన్ డెవలపర్స్ హైదరాబాద్–బెంగళూరు జాతీయ రహదారిలో మరో బడా ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుట్టనుంది. అపురూపాస్ డ్యూక్స్ అర్బన్ విలేజ్ పేరిట నందిగామలో 59 ఎకరాలను అభివృద్ధి చేయనుంది. హెచ్‌ఎండీఏ అనుమతి పొందిన ఈ వెంచర్‌ను ఆదివారం ప్రారంభించనున్నట్లు కంపెనీ ఎండీ టి. మహేందర్ తెలిపారు. ఇందులో 200 గజాల నుంచి 1,067 గజాల వరకు ప్లాట్లుంటాయి.
చిల్డ్రన్స్ ప్లే ఏరియా, ఫ్లవర్ గార్డెన్, జాగింగ్ ట్రాక్, మల్టీపర్పస్ కోర్ట్, ల్యాడ్‌స్కేపింగ్, బాస్కెట్‌బాల్ కోర్ట్స్, క్లబ్ హౌస్ వంటి అన్ని రకాల ఆధునిక వసతులుంటాయి. 40–80 ఫీట్ల రోడ్లు, కట్టుదిట్టమైన భద్రత, భూగర్భ విద్యుత్, మురుగు నీటి వ్యవస్థ, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ వంటి ఏర్పాట్లూ ఉంటాయి.
జాన్సన్ అండ్ జాన్సన్, ప్రొక్టర్ అండ్ గ్యాంబల్ (పీఅండ్‌జీ) వంటి బహుళ జాతి కంపెనీలకు కూతవేటు దూరంలో ఉంది ఈ ప్రాజెక్ట్. ఇక్కడి నుంచి 2 నిమిషాల్లో కొత్తూరుకు, 10 నిమిషాల ప్రయాణ వ్యవధిలో షాద్‌నగర్ ఎంఎంటీఎస్‌కు, 15 నిమిషాల్లో ఓఆర్‌ఆర్‌కు చేరుకోవచ్చు. 24 కి.మీ. దూరంలో శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment