న్యూఢిల్లీ: సహారా గ్రూప్ చీఫ్ సుబ్రతారాయ్ విడుదలకు ఆ సంస్థ తాజాగా శుక్రవారం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. గ్రూప్ సంస్థలు రెండు మార్కెట్ నిబంధనలకు వ్యతిరేకంగా దాదాపు రూ. 25,000 కోట్లు సమీకరించిన కేసులో రాయ్ మార్చి 4 నుంచీ తీహార్ జైలులో ఉన్న సంగతి తెలిసిందే. బెయిల్ మంజూరు సంబంధించి రూ.10,000 కోట్ల చెల్లించాలన్న అత్యున్నత న్యాయస్థానం షరతు వ్యవహారంలో విదేశాల్లోని మూడు హోటెల్స్ అమ్మకాలకు సంబంధించిన వివరాలను అందజేయాలని సుప్రీంకోర్టు సహారా గ్రూప్‌ను ఆదేశించింది.
రూ.10,000 కోట్ల నిధుల సమీకరణకు సంబంధించి జరుగుతున్న ప్రక్రియను రాయ్ న్యాయవాది ఈ సందర్భంగా సుప్రీంకోర్టుకు వివరించారు. ఇటీవల సహారా గ్రూప్ కార్యాలయాలపై ఆదాయపు పన్ను శాఖ అధికారుల దాడుల గురించి కూడా న్యాయమూర్తులు ఈ సందర్భంగా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా స్వాధీనం చేసుకున్న రూ.143 కోట్లు ఉద్యోగుల మూడు నెలల వేతనాలకు ఉద్దేశించినవని సహారా న్యాయవాది తెలిపారు. కేసు తదుపరి విచారణ వచ్చే శుక్రవారానికి వాయిదా పడింది.
రాయ్ విడుదలకు మళ్లీ సుప్రీంలో పిటిషన్
Published Sat, Nov 29 2014 1:28 AM | Last Updated on Sun, Sep 2 2018 5:20 PM
Advertisement