ఢిల్లీ-విశాఖ మార్గంలో ఎయిర్ఏషియా విమానాలు | air asia extends to two more new routes | Sakshi
Sakshi News home page

ఢిల్లీ-విశాఖ మార్గంలో ఎయిర్ఏషియా విమానాలు

Published Fri, Oct 30 2015 9:52 AM | Last Updated on Sun, Sep 3 2017 11:44 AM

ఢిల్లీ-విశాఖ మార్గంలో ఎయిర్ఏషియా విమానాలు

ఢిల్లీ-విశాఖ మార్గంలో ఎయిర్ఏషియా విమానాలు

చవక విమానయాన ఆఫర్లతో తరచు ఆకట్టుకునే ఎయిర్ ఏషియా సంస్థ మరో రెండు కొత్త మార్గాల్లో విమాన సర్వీసులు ప్రారంభించింది. న్యూఢిల్లీ- విశాఖపట్నం, న్యూఢిల్లీ- గువాహటి మార్గాలు కొత్తగా ప్రారంభమయ్యాయి. ఈ రెండు మార్గాల్లోను ప్రమోషనల్ ఆఫర్లను ఎయిర్ ఏషియా ప్రకటించింది. న్యూఢిల్లీ- విశాఖ మార్గంలో టికెట్ రూ. 3490గా తెలిపింది. ఈ ఆఫర్ కింద నవంబర్ ఒకటోతేదీ లోగా టికెట్లు బుక్ చేసుకోవాలి, నవంబర్ 20 నుంచి అక్టోబర్ 29 వరకు ప్రయాణాలు చేయొచ్చు.

ఇది కాక, కొచ్చి- బెంగళూరు, బెంగళూరు-గోవా మార్గాల్లో రూ. 1590కే టికెట్లు అంటూ మరో ఆఫర్‌ను కూడా ఎయిర్ ఏషియా ప్రకటించింది. బెంగళూరు నుంచి పుణుకు రూ. 1990 టికెట్ పెట్టింది. ఇక దీపావళి సందర్భంగా కౌలాలంపూర్ నుంచి విశాఖపట్నం, గోవా, హాంకాంగ్‌, మిరి నగరాలకు రూ. 850 నుంచి మొదలుపెట్టి మరో ఆఫర్ ప్రకటిచింది. ఫిబ్రవరి 29 వరకు చేసే ప్రయాణాలకు ఇది వర్తిస్తుంది. నవంబర్ 1 నుంచి టికెట్లు అందుబాటులో ఉంటాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement