విజయవాడ టు హైదరాబాద్ ఫ్లైట్ చార్జీ రూ.1888 | Air Costa to start flights to Madurai from Hyderabad, Chennai | Sakshi
Sakshi News home page

విజయవాడ టు హైదరాబాద్ ఫ్లైట్ చార్జీ రూ.1888

Published Sat, Jun 21 2014 12:46 AM | Last Updated on Sat, Sep 2 2017 9:07 AM

విజయవాడ టు హైదరాబాద్  ఫ్లైట్ చార్జీ రూ.1888

విజయవాడ టు హైదరాబాద్ ఫ్లైట్ చార్జీ రూ.1888

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: చౌక విమానయాన టికెట్ల రేసులోకి విజయవాడ కేంద్రంగా పనిచేస్తున్న ఎయిర్‌కోస్టా కూడా వచ్చి చేరింది. విజయవాడ-హైదరాబాద్, విజయవాడ-చెన్నై, మధురై - చెన్నై మార్గాల్లో తక్కువ ధరలకే విమాన టికెట్ల ఆఫర్‌ను ఎయిర్‌కోస్టా ప్రకటించింది. విజయవాడ నుంచి హైదరాబాద్‌కు లేదా హైదరాబాద్ నుంచి విజయవాడకు ఒకసారి ప్రయాణానికి అన్ని పన్నులతో కలిపి రూ. 1,888లకే అందుబాటులోకి తీసుకొచ్చింది. అదే విధంగా చెన్నై-మధురై మార్గంలో కూడా రూ.1,888లకే ప్రయాణించే అవకాశాన్ని కల్పిస్తోంది.
 
 అదే విజయవాడ-చెన్నై మార్గంలో ఒక వైపు రూ.2,999లకే ప్రయాణించొచ్చని ఎయిర్‌కోస్టా విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. పరిమిత సంఖ్యలో అందుబాటులో ఉన్న  ఈ చౌక టికెట్లను జూన్ 20 సాయంత్రం ఆరు గంటల నుంచి జూన్ 23 వ తేదీ సాయంత్రం ఆరుగంటల లోపు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా బుక్ చేసుకున్న టికెట్లతో జూలై 3 నుంచి ఆగస్టు 31 లోపు ప్రయాణించవచ్చని ఎయిర్‌కోస్టా ఆ ప్రకటనలో పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement