జెట్ ఎయిర్‌వేస్ డిస్కౌంట్ ఆఫర్ | Airlines announce discounted fares to attract flyers | Sakshi
Sakshi News home page

జెట్ ఎయిర్‌వేస్ డిస్కౌంట్ ఆఫర్

Published Thu, Feb 26 2015 1:19 AM | Last Updated on Sat, Sep 2 2017 9:54 PM

జెట్ ఎయిర్‌వేస్ డిస్కౌంట్ ఆఫర్

జెట్ ఎయిర్‌వేస్ డిస్కౌంట్ ఆఫర్

అంతర్జాతీయ రూట్లలో 35% వరకూ..
న్యూఢిల్లీ: జెట్ ఎయిర్‌వేస్ సంస్థ అంతర్జాతీయ రూట్లలో బేస్ చార్జీల్లో 5 నుంచి  35% వరకూ డిస్కౌంట్‌ను ఇస్తోంది. ఈ తగ్గింపు తమ భాగస్వామి ఎతిహాద్ నెట్‌వర్క్‌కు కూడా వర్తిస్తుందని జెట్ ఎయిర్‌వేస్ తెలిపింది. ఈ ఆఫర్‌కు బుకింగ్స్ బుధవారం నుంచే ప్రారంభమయ్యాయని, వారం వరకూ ఉంటాయని పేర్కొంది, ఈ ఆఫర్‌లో బుక్ చేసుకున్న టికెట్లతో ఈ నెల 25 నుంచి డిసెంబర్ 12 వరకూ ప్రయాణించాల్సి ఉంటుందని వివరించింది.

ప్రీమియర్, ఎకానమీ క్లాస్‌లకు ఈ ఆఫర్ వర్తిస్తుందని తెలిపింది. తామందిస్తున్న ఈ డిస్కౌంట్ ఆఫర్ న్యూయార్క్, సావో పోలో, టొరంటో, కువైట్, కఠ్మాండు, బ్యాంకాక్,  సింగపూర్, తదితర విమాన సర్వీసులకు వర్తిస్తాయని పేర్కొంది.  స్పైస్‌జెట్ రూ.3,799 కనిష్ట ధర నుంచి అంతర్జాతీయ రూట్లలో విమాన టికెట్లను ఆఫర్ చేసిన ఒక్క రోజు తర్వాత జెట్ డిస్కౌంట్ ప్రకటన వెలువడింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement