మూడో అతిపెద్ద మొబైల్ ఆపరేటర్‌గా ఎయిర్‌టెల్
న్యూఢిల్లీ: ఎయిర్‌టెల్ ప్రపంచంలోనే మూడో అతిపెద్ద మొబైల్ ఆపరేటర్‌గా అవతరించింది. వరల్డ్ సెల్యులార్ ఇన్‌ఫర్మేషన్ సర్వీసెస్ (డబ్ల్యూసీఐఎస్) గణాంకాల ప్రకారం.. ఎయిర్‌టెల్ వినియోగదారులు 30 కోట్లకు పైగా ఉన్నారు. దాదాపు 62 కోట్ల మంది వినియోగదారులతో చైనా మొబైల్ అగ్రస్థానంలో, 40 కోట్ల మంది వినియోగదారులతో వోడాఫోన్ గ్రూప్ (యూకే) రెండో స్థానంలో ఉంది. చైనా యూనికామ్ (29 కోట్ల మంది), అమెరికా మోవిల్ (27 కోట్ల మంది) వరుసగా నాలుగు, ఐదో స్థానాల్లో ఉన్నాయి. ఎయిర్‌టెల్ కార్యకలాపాలు 1995లో న్యూఢిల్లీ కేంద్రంగా ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం ఎయిర్‌టెల్ సేవలు 20 దేశాల కు విస్తరించాయి.