అలహాబాద్ బ్యాంక్ లాభం 25% అప్ | Allahabad Bank Q4 net profit rises 25% | Sakshi
Sakshi News home page

అలహాబాద్ బ్యాంక్ లాభం 25% అప్

Published Thu, May 8 2014 1:13 AM | Last Updated on Sat, Sep 2 2017 7:03 AM

అలహాబాద్ బ్యాంక్ లాభం 25% అప్

అలహాబాద్ బ్యాంక్ లాభం 25% అప్

కోల్‌కతా: అలహాబాద్ బ్యాంక్ జనవరి-మార్చి(క్యూ4) కాల ంలో రూ. 158 కోట్ల నికర లాభాన్ని అందుకుంది. అంతక్రితం ఏడాది(2012-13) ఇదే కాలంలో ఆర్జించిన రూ. 126 కోట్లతో పోలిస్తే ఇది 25% వృద్ధి. ఇదే కాలానికి నికర వడ్డీ ఆదాయం(ఎన్‌ఐఐ) రూ. 4,252 కోట్ల నుంచి రూ. 4,811 కోట్లకు పుంజుకోగా, మొత్తం ఆదాయం కూడా రూ. 4,777 కోట్ల నుంచి రూ. 5,237 కోట్లకు ఎగసింది.

 

నికర మొండిబకాయిలు(ఎన్‌పీఏలు) 3.19% నుంచి 4.15%కు పెరిగాయి. నికర వడ్డీ మార్జిన్లు(ఎన్‌ఐఎం) 2.75% నుంచి 2.67%కు తగ్గాయి. ఫలితాల నేపథ్యంలో బ్యాంక్ షేరు బీఎస్‌ఈలో దాదాపు 9% పతనమై రూ. 95 వద్ద ముగిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement