న్యూఢిల్లీ: వేలానికి సిద్ధమవుతున్న సహారా గ్రూప్ యాంబీ వ్యాలీ ఆస్తుల నిర్వహణ కష్టమని బొంబాయి హైకోర్టుకు చెందిన అఫీషియల్ రిసీవర్ అత్యున్నత న్యాయస్థానానికి నివేదించారు. గతేడాది నవంబర్ 23న కేసు విచారణ సందర్భంగా సుప్రీం కీలక వ్యాఖ్యలు చేస్తూ.. యాంబీ వ్యాలీ ఆక్రమణలకు అవకాశం ఉందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. అందుకని వేలం పూర్తయ్యే వరకూ యాంబీ వ్యాలీ ఆస్తుల కస్టోడియన్‌గా వ్యవహరించాలని హైకోర్టు అధికారిక రిసీవర్‌ను ఆదేశించింది.
అయితే కస్టోడియన్‌గా విధుల నిర్వహణకు సంబంధించి కొన్ని ప్రత్యేక ఆదేశాలను ఇవ్వాలని కోరుతూ అధికారిక రిసీవర్ సుప్రీంను ఆశ్రయించారు. ఒక తేదీని నిర్ణయించి కేసు విచారణ జరుపుతామని చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని బెంచ్ సూచించింది. మదుపరులకు రెండు సహారా గ్రూప్ కంపెనీలు దాదాపు రూ.25,000 కోట్ల పునఃచెల్లింపుల కేసులో యాంబీ వ్యాలీ వేలానికి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment