
అరబిందో ఫార్మా రికార్డు లాభాలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: అరబిందో ఫార్మా డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసిక నికర లాభంలో 39 శాతం వృద్ధి నమోదయ్యింది. అంతకుముందు ఏడా ది ఇదే కాలానికి రూ. 384 కోట్లుగా ఉన్న నికర లాభం ఇప్పుడు రూ. 535 కోట్లకు చేరింది. ఒక త్రైమాసికంలో ఈ స్థాయి లాభాలను నమోదు చేయడం ఇదే ప్రథమం.
ఇదే సమయంలో అమ్మకాలు 10 శాతం వృద్ధితో రూ. 3,166 కోట్ల నుంచి రూ. 3,455 కోట్లకు పెరిగింది. అమెరికా కంపెనీ నాట్రోల్‌ని కొనుగోలు చేయడంతో ఈ ఫలితాలను గతేడాదితో పోల్చి చూడలేమని కంపెనీ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. వాటాదారులకు 70 శాతం మధ్యంతర డివిడెండ్‌ను బోర్డు ప్రకటించింది. రూపాయి ముఖ విలువ కలిగిన షేరుకు 70 పైసలు డివిడెండ్‌గా ఇవ్వాలన్న నిర్ణయానికి వాటాదారుల అనుమతి లభించాల్సి ఉంది.