
న్యూఢిల్లీ: కొత్తగా మళ్లీ ఖాతాదారులను చేర్చుకునేందుకు రిజర్వ్ బ్యాంక్ నుంచి అనుమతులు లభించినట్లు ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ తెలియజేసింది. అలాగే ఖాతాదారుల వివరాల ధృవీకరణ కోసం ఆధార్ ఈ–కేవైసీని ఉపయోగించుకునేందుకు విశిష్ట గుర్తింపు కార్డుల ప్రాధికార సంస్థ యూఐడీఏఐ నుంచి కూడా అనుమతి లభించినట్లు తెలియజేసింది. ఎయిర్‌టెల్ మొబైల్ సబ్‌స్క్రయిబర్ల అనుమతి లేకుండానే వారి పేరున ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంకు ఖాతాలు తెరవడం, కోట్ల కొద్దీ రూపాయల వంటగ్యాస్ సబ్సిడీ మొత్తాలు వీటిల్లోకి మళ్లడం.. కొన్నాళ్ల కిందట వివాదాస్పదమైన సంగతి తెలిసిందే.
దీంతో కొత్త కస్టమర్లను చేర్చుకోరాదంటూ ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్‌ను ఆర్‌బీఐ ఆదేశించింది. అలాగే ఆధార్ డేటా బేస్‌ను ఉపయోగించుకోకుండా టెలికం సంస్థ ఎయిర్‌టెల్, ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్‌కి ఇచ్చిన ఈ–కేవైసీ లైసెన్సులను యూఐడీఏఐ సస్పెండ్ చేసింది కూడా. ఈ ఏడాది మార్చిలో ఎయిర్‌టెల్ లైసెన్సును పునరుద్ధరించినప్పటికీ, పేమెంట్స్ బ్యాంక్ లైసెన్సుపై సస్పెన్షన్ కొనసాగింది.
Comments
Please login to add a commentAdd a comment