
సాక్షి, న్యూఢిల్లీ : ఇంకా ఒక్క రోజైతే పెద్ద నోట్లను రద్దు చేసి ఏడాది పూర్తవుతుంది. తొలి వార్షికోత్సవం పూర్తవుతున్న సందర్భంగా మోదీ ప్రభుత్వం హఠాత్తుగా తీసుకున్న ఈ నిర్ణయంపై బ్యాంకర్లు స్పందించారు. పెద్ద నోట్ల రద్దు తమకు మంచే చేసిందని, డిపాజిట్లు భారీగా పెరుగడంతో పాటు డిజిటలైజేషన్ చాలా వేగవంతంగా విస్తరించేలా చేసిందని అభిప్రాయం వ్యక్తంచేశారు. గతేడాది నవంబర్ 8 రాత్రి ప్రధాని నరేంద్రమోదీ దేశాన్ని ఉద్దేశించి చేసిన ప్రసంగంలో పెద్ద నోట్లు రూ.500, రూ.1000 రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. బ్లాక్‌మనీ, అవినీతి నిర్మూలనకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు.
'' బ్యాంకింగ్ రంగం పరంగా తీసుకుంటే, పెద్ద నోట్ల రద్దుతో అధికారిక బ్యాంకింగ్ సిస్టమ్‌లోకి చాలా నగదు వచ్చి చేరింది. ఇది బ్యాంకింగ్ రంగానికి మంచి పరిణామం. కరెంట్ అకౌంట్, సేవింగ్స్ అకౌంట్ డిపాజిట్లు కనీసం 250-300 బేసిస్‌లో పెరిగాయి. ఇది నిజంగా మాకు చాలా పెద్ద సానుకూలమైన విషయం'' అని ఎస్‌బీఐ చైర్మన్ రజ్‌నీష్ చెప్పారు. బ్యాంకింగ్ రంగంలోకి వచ్చిన డిపాజిట్లు ట్రిలియన్ల కొద్దీ ఉన్నాయి. దీంతో బ్యాంకుల్లో ఫండ్స్ పెరిగాయి. మొత్తంగా మనీ మార్కెట్ రేట్లు కిందకి దిగొచ్చాయని పేర్కొన్నారు. పెద్ద నోట్ల రద్దుతో అధికారిక ఫైనాన్సియల్ సేవింగ్స్ పెరిగాయని, మ్యూచువల్ ఫండ్స్, ఇన్సూరెన్స్‌లోకి ఫండ్స్ వెల్లువ ఎగిసిందని ఐసీఐసీఐ బ్యాంకు చీఫ్ ఎగ్జిక్యూటివ్ చందా కొచ్చర్ తెలిపారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత డిజిటలైజేషన్ చాలా వేగవంతంగా విస్తరించదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment