న్యూఢిల్లీ: ద్రవ్య, పరపతి సాధనంగా బంగారం సరికాదన్న అభిప్రాయానికే కేంద్రం ఓటు చేస్తున్నట్లు కనబడుతోంది. నగదు నిల్వల నిష్పత్తి (సీఆర్‌ఆర్), స్టాట్యూటరీ లిక్విడిటీ రేషియో (ఎస్‌ఎల్‌ఆర్) అవసరాలకు- ప్రతిపాదిత ‘బంగారం డిపాజిట్’ పథకం ద్వారా సమీకరించిన మెటల్‌ను వినియోగించుకోవాలన్న ఆలోచనను కేంద్రం విరమించుకున్నట్లు అత్యున్నత స్థాయి వర్గాలు వెల్లడించాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) అభిప్రాయానికి విరుద్ధమైన నిర్ణయాన్ని తీసుకోరాదన్న ఉద్దేశమే దీనికి ప్రధాన కారణంగా కూడా తెలుస్తోంది. రెండు వారాల్లో బంగారం డిపాజిట్ పథకానికి కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేయనుందని సమాచారం. సెప్టెంబర్ మొదటి వారం నుంచీ పథకం అమల్లోకి వచ్చే అవకాశం ఉందని కూడా తెలుస్తోంది.