ఎయిర్టెల్ ఎం-కామర్స్కు పేమెంట్ బ్యాంకు లైసెన్స్
న్యూఢిల్లీ: దేశీ టెలికం దిగ్గజ సంస్థ ‘భారతీ ఎయిర్‌టెల్’ మొబైల్ కామర్స్ అనుబంధ కంపెనీ ‘ఎయిర్‌టెల్ ఎం-కామర్స్ సర్వీసెస్’ (ఏఎంఎస్‌ఎల్)కు ఆర్‌బీఐ నుంచి పేమెంట్ బ్యాంక్ లెసైన్స్ లభించింది. ఈ విషయాన్ని ఎయిర్‌టెల్ సంస్థ బీఎస్‌ఈకి నివేదించింది. పేమెంట్ బ్యాంకు కార్యకలాపాలకు సంబంధించి ఆర్‌బీఐ గతేడాది ఆగస్ట్‌లో రిలయన్స్ ఇండస్ట్రీస్, ఆదిత్య బిర్లా నువో, వొడాఫోన్ ఎం-పైసా, డిపార్ట్‌మెంట్ ఆఫ్ పోస్ట్ వంటి తదితర సంస్థలతోపాటు ఎయిర్‌టెల్ ఏఎంఎస్‌ఎల్‌కు కూడా సూత్రప్రాయ అంగీకారం తెలిపింది.