న్యూఢిల్లీ: పన్నుల మినహాయింపుల కోసం దేశీ పారిశ్రామిక రంగం చేస్తున్న ప్రయత్నాలను ప్రధాని ఆర్థిక సలహా మండలి చైర్మన్ బిబేక్ దేబ్‌రాయ్ తప్పుపట్టారు. అంతేకాదు, ఈ తరహా మినహాయింపులను పూర్తిగా తొలగించాలని వ్యాఖ్యానించారు. అలా చేస్తే పన్నుల ఆదాయం వాటా దేశ జీడీపీలో 22 శాతానికి పెరుగుతుందని చెప్పారు.
‘‘ఆదాయ పన్ను చట్టం సమీక్ష కోసం ప్రభుత్వం నియమించిన ప్యానెల్ ఈ అంశంపై దృష్టి సారించే అవకాశం ఉంది కూడా’’ అన్నారాయన. ‘‘పన్నుల ఎగవేత ఉంది. కానీ, ఎక్కువ శాతం జరుగుతున్నది పన్నుల ఎగవేత కాదు. పన్నులను తప్పించుకోవడం. ఇది పూర్తిగా చట్టబద్ధమే. ఎందుకంటే పలు రకాల మినహాయింపులను అనుమతించడం వల్లే’’ అని వివరించారు. ప్రత్యక్ష పన్నులకు సంబంధించి మినహాయింపుల తొలగింపు అంశం వచ్చే బడ్జెట్‌లో ఉండకపోవచ్చన్నారు.
Comments
Please login to add a commentAdd a comment