bibek debroy
-
పీఎం ఆర్థిక సలహా మండలి ఛైర్మన్ కన్నుమూత
ఆర్థికవేత్త, ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి ఛైర్మన్ 'బిబేక్ దెబ్రాయ్' (69) శుక్రవారం ఉదయం 7 గంటలకు కన్నుమూశారు. ఈయన మృతికి నరేంద్ర మోదీ నివాళులు అర్పిస్తూ.. దేబ్రాయ్ ఉన్నత పండితుడని అభివర్ణించారు.డా. బిబేక్ దెబ్రాయ్ ఆర్థిక శాస్త్రం, చరిత్ర, సంస్కృతి, రాజకీయాలు, ఆధ్యాత్మికత వంటి విభిన్న రంగాలలో బాగా ప్రావీణ్యం కలిగి ఉన్నారు. తన రచనల ద్వారా భారతదేశ మేధో దృశ్యంలో చెరగని ముద్ర వేశారు. ప్రాచీన గ్రంథాలపై పని చేయడంలో ఆనందాన్ని పొందారని మోదీ ఎక్స్ ఖాతాలో పేర్కొన్నారు.కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కూడా బిబేక్ దెబ్రాయ్ మృతికి సంతాపం తెలియజేసారు. ఆయన విశిష్ట ఆర్థికవేత్త, నిష్ణాతులైన రచయిత, అద్భుతమైన విద్యావేత్త. ఆర్థిక సమస్యలను అవలీలగా పరిష్కరిస్తూ.. భారతదేశ అభివృద్ధికి విశేష కృషి చేసిన ఈయన ప్రశంసనీయులని తన ఎక్స్ ఖాతాలో పేర్కొన్నారు.Dr. Bibek Debroy Ji was a towering scholar, well-versed in diverse domains like economics, history, culture, politics, spirituality and more. Through his works, he left an indelible mark on India’s intellectual landscape. Beyond his contributions to public policy, he enjoyed… pic.twitter.com/E3DETgajLr— Narendra Modi (@narendramodi) November 1, 20242019 జూన్ 5 వరకు నీతి ఆయోగ్ సభ్యులుగా పనిచేసిన దెబ్రాయ్ పద్మశ్రీ అవార్డు గ్రహీత. పూణేలోని గోఖలే ఇన్స్టిట్యూట్ ఆఫ్ పాలిటిక్స్ అండ్ ఎకనామిక్స్ (GIPE)కి ఛాన్సలర్‌గా పనిచేసిన ఈయన.. అనేక పుస్తకాలు, పేపర్లు, ప్రముఖ కథనాలను రచించారు. అంతే కాకుండా అనేక వార్తాపత్రికలతో కన్సల్టింగ్/కంట్రిబ్యూటింగ్ ఎడిటర్‌గా కూడా ఉన్నారు.నరేంద్రపూర్‌లోని రామకృష్ణ మిషన్ స్కూల్లో చదువుకున్న దెబ్రాయ్ కోల్‌కతాలోని ప్రెసిడెన్సీ కాలేజీలో పనిచేశారు. ఆ తరువాత ఢిల్లీలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్‌లో పనిచేశారు. ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా కూడా బాధ్యతలు నిర్వహించారు.Deeply saddened by the passing of Dr. Bibek Debroy. He was a distinguished economist, a prolific author as well as an excellent academician. He will be admired for his policy guidance on economic issues and noteworthy contributions to India’s development. His columns in… pic.twitter.com/y1niSMlxU7— Dharmendra Pradhan (@dpradhanbjp) November 1, 2024 -
‘జీఎస్టీ వల్ల ప్రభుత్వ ఆదాయం పోతోంది’.. ఎవరన్నారీ మాట?
జీఎస్టీతో అన్ని రకాల వస్తువుల రేట్లు పెరిగిపోయాయని ఓవైపు దేశ ప్రజలు గగ్గోలు పెడుతుంటే మరోవైపు ప్రధాన మంత్రి ఎకనామిక్ అడ్వైజరీ కౌన్సిల్ చైర్మన్ బిబేక్ దేబ్రాయ్ మాత్రం జీఎస్టీ వల్ల ప్రభుత్వం ఆదాయాన్ని కోల్పోతోందని వ్యాఖ్యానించారు. ఒకే రేటుతో ఆదాయం తటస్థంగా ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు. తాజాగా కలకత్తా ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ జీఎస్టీలో చాలా సరళీకరణ జరిగిందన్నారు. "ఆదర్శ జీఎస్టీ అనేది ఒకే రేటును కలిగి ఉండాలి. దీని ప్రభావం ప్రభుత్వ ఆదాయం మీద పడకూడదు. జీఎస్టీని మొదటిసారి ప్రవేశపెట్టినప్పుడు కేంద్ర ఆర్థిక శాఖ లెక్కల ప్రకారం, సగటు పన్ను రేటు కనీసం 17 శాతం ఉండాలి. కానీ, ప్రస్తుత జీఎస్టీ 11.4 శాతం. జీఎస్టీ కారణంగా ప్రభుత్వం ఆదాయాన్ని కోల్పోతోంది’’ అని బిబేక్ దేబ్రాయ్ పేర్కొన్నారు. అత్యధికంగా ఉన్న 28 శాతం జీఎస్టీ రేటు తగ్గాలని ప్రజలతోపాటు జీఎస్టీ కౌన్సిల్ సభ్యులు కోరుకుంటున్నారని, అయితే అత్యల్పంగా ఉన్న సున్నా, 3 శాతం జీఎస్టీ రేట్లు పెరగాలని మాత్రం ఎవరూ కోరుకోవడం లేదని బిబేక్ అన్నారు. అందుకే మనకు సరళీకృత జీఎస్టీ అసాధ్యమని చెప్పారు. అలాగే జీఎస్టీ నిబంధనల్లోనూ చాలా దుర్వినియోగం జరుగుతోందన్నారు. ఇదీ చదవండి: Renters Insurance: ఇల్లు లేకపోయినా హోమ్ ఇన్సూరెన్స్! ఎందుకు.. ఏంటి ప్రయోజనం? -
భారత ఎకానమీ వృద్ధిపై వివేక్ దేవరాయ్ కీలక వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: భారత్ ఆర్థిక వ్యవస్థ రానున్న 25 సంవత్సరాల్లో వార్షికంగా సగటున 7 నుంచి 7.5 శాతం వృద్ధి రేటును సాధిస్తే, దేశం 2047 నాటికి ‘ఎగువ మధ్య తరగతి’ ఆదాయ దేశంగా ఆవిర్భవిస్తుందని ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి (ఈఏసీ-పీఎం) చైర్మన్ వివేక్ దేవ్రాయ్ పేర్కొన్నారు. అదే విధంగా దేశం అప్పటికి 20 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా ఆవిర్భవిస్తుందని కూడా విశ్లేషించారు. తలసరి ఆదాయం 10,000 డాలర్లకు చేరుతుందని అన్నారు. దీనివల్ల భారత్ సమాజ స్వభావం పూర్తిగా రూపాంతరం చెందుతుందని పేర్కొన్నారు. ఒక దేశ తలసరి ఆదాయం 12,000 డాలర్లు దాటితే ఆ దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా పరిగణించాలని ప్రపంచ బ్యాంక్ సూచిస్తోంది. రాష్ట్రాలదే కీలకపాత్ర... ప్రస్తుతం భారత్ ఎకానమీ విలువ 2.7 ట్రిలియన్ డాలర్లు. ప్రపంచంలో అభివృద్ధి చెందుతున్న దేశంగా అతిపెద్ద ఆరవ ఆర్థిక వ్యవస్థ హోదాను పొందుతోంది. 2047 నాటికి దేశం అభివృద్ధి చెందిన దేశంగా ఆవిర్భవించాలని ప్రధాని మోదీ లక్షించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ‘ది కాంపిటేటివ్‌నెస్ రోడ్‌మ్యాప్ ఫర్ ఇండియా@100’ పేరుతో వివేక్ దేవ్రాయ్ ఈ నివేదికను విడుదల చేశారు. హార్వర్డ్ బిజినెస్ స్కూల్‌కు చెందిన ఇనిస్టిట్యూట్ ఫర్ కాంపిటీటివ్నెస్ ప్రొఫెసర్ మైఖేల్ ఇ పోర్టర్, క్రిస్టియన్ కెటెల్స్, అమిత్ కపూర్లతో భాగస్వామ్యంతో ఈ ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి నివేదిక రూపొందింది. దేశాభివృద్ధిలో రాష్ట్రాల పాత్ర కీలకమని పేర్కొన్న ప్రధాని ఆర్థిక సలహాదారు, రాష్ట్రాలు తమ వృద్ధి రికార్డులను ఎంత ఎక్కువగా నమోదుచేస్తే అంత ఎక్కువగా భారత్ పురోగతి సాధ్యమవుతుందని నివేదిక విడుదల సందర్భంగా దేవ్రాయ్ పేర్కొన్నారు. 1947లో బ్రిటీష్ పాలన నుండి స్వాతంత్య్రం వచ్చినప్పుడు భారత్‌ను ’మూడో–ప్రపంచ’ దేశంగా వర్గీకరించారు. అయితే గత ఏడు దశాబ్దాలలో దేశ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) కేవలం రూ. 2.7 లక్షల కోట్ల నుండి రూ. 150 లక్షల కోట్లకు పెరిగింది. నివేదికకు సంబంధించి కొన్ని ముఖ్యాంశాలు.. ♦ వృద్ధి, పోటీతత్వ పెంపొందడం కోసం ఒక పొందికైన వ్యూహాన్ని అనుసరించాలి. ఇందుకు దేశం పారిశ్రామిక, ప్రాంతీయ విధానాలను పునర్వ్యవస్థీకరించాలి. రంగాల వారీగా, ప్రాంతాల వారీగా వృద్ధికి విధాన రూపకల్పన జరగాలి. ♦ భారత్ ఎకానమీ ఫండమెంటల్స్, స్థూల దేశీయోత్పత్తి పరిస్థితులు బలంగా ఉన్నాయి. ప్రపంచంలోనే భారత్ ఎకానమీ వేగంగా పురోగమిస్తోంది. అయితే బలహీన సామాజిక పురోగతి, పెరుగుతున్న అసమానతలు, ప్రాంతాల మధ్య సమన్వయం లేకపోవడం వంటి అంశాల వల్ల చాలా మంది భారతీయుల జీవన నాణ్యతలో ఆశించిన మెరుగుదలను సాధించలేకపోతున్నాం. ♦ ఉపాధిని పెంపొందించే, ఉద్యోగార్ధులకు అడ్డంకులను తగ్గించే సామాజిక విధానాలను భారతదేశం ప్రారంభించాల్సిన అవసరం ఉంది. ♦ తగిన విధంగాలేని, కాలం చెల్లిన నియంత్రణ పరమైన నిబంధనలు, వ్యవస్థాపరమైన లోటుపాట్లు భారతదేశాన్ని వెనక్కి నెడుతున్నాయి. ♦ కార్మిక చట్టాలు పెద్ద సంస్థలపై అధిక వ్యయాల భారాలకు కారణమవుతున్నాయి. భూ చట్టాల వల్ల తరచుగా అభివృద్ధి కోసం భూమిని పొందడం కష్టతరం అవుతోంది. ఆయా అంశాల్లో కీలక సంస్కరణలు జరగాలి. ఇక జనాభాకు తగ్గట్టుగా వ్యవసాయ వస్తువులు, ఉత్పత్తుల ధరలను స్థిరంగా ఉంచండంపై దృష్టి సారించాలి. ♦ భారత్ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం ఇంతకుముందు ఎన్నడూ లేని విధంగా విదేశీ వాణిజ్యం, పెట్టుబడులకు మరింత ద్వారాలు తెరిచింది. అయితే ఇప్పటికీ అడ్డంకులు ఉన్నాయి. ముఖ్యంగా టారిఫ్ యేతర అడ్డంకులు మరింత తగ్గాలి. ప్రపంచ మార్కెట్లకు సేవలను అందించడానికి సంబంధించి ఒక ఆకర్షణీయ స్థానం సంపాదించడానికి విధాన రూపకల్పన భారత్ ముందు ప్రస్తుతం ఉన్న అతిపెద్ద సవాలు. -
సరసమైన ధర, సబ్సిడీ... అంత ఈజీ కాదు
కోవిడ్ రెండోదశ చాలా ఉధృతంగా వచ్చింది. అయినా పౌరుల్లో మాత్రం స్పృహ ఇంకా కొరవడుతూనే ఉంది. ప్రతిరోజూ 3 లక్షలకు పైగా కేసులు, మొత్తం కోటిన్నర మందికిపైగా బాధి తులు, 1.86 లక్షల మరణాలు.. ఈ అంకెలు చూస్తేనే భయం అనిపిస్తున్నా.. రాబోయే కాలంలో ఇవి మరింతగా ఎక్కు వయ్యే ప్రమాదం కళ్లెదుటే కనిపిస్తోంది. కోవిడ్ పరీక్షలు, బాధితుల మరణాల విషయంలో కొన్ని రాష్ట్రాలు ఇస్తున్న లెక్కలు ఎంతవరకు నిజమన్న అనుమానాలూ తలెత్తుతు న్నాయి. కానీ వీటన్నింటి కంటే ప్రజల నిర్లక్ష్యమే చాలా ప్రమా దకరం. వైరస్ ప్రస్తుతం విజృంభిస్తున్న తీరు చూస్తే దాన్ని నిరో ధించడం మన చేతుల్లోనే ఉందని అర్థమవుతుంది. జూలై లోపు రెండోదశ ఉధృతి తగ్గుతుందన్న ఆశలు ఏమాత్రం లేవు. ఇలాంటి సమయంలో మనం ఏం చేయాలి? టీకా వేసుకోవడం ఒక్కటే ప్రస్తుత తరుణంలో వైరస్‌ను అడ్డుకోవడానికి కొంతలో కొంత ఉత్తమ మార్గం. అయినా టీకా వేయించుకున్నంత మాత్రాన భౌతికదూరం నిబం ధనలను మాత్రం వదలకూడదు. టీకా వేయించుకుంటే కరోనా వచ్చే అవకాశాలు చాలావరకు తగ్గుతాయి. ఒకవేళ వచ్చినా.. వ్యాధి తీవ్రత బాగా తగ్గుతుంది. ఈ కథనం రాసే సమయానికి దేశంలో 13.5 కోట్ల టీకాలు వేశారు. వారిలో 11.5 కోట్ల మంది తొలిడోసు తీసుకున్నారు. రోజుకు సుమారు 50 లక్షలమందికి వేయొచ్చని ఓ అంచనా. ఈ లెక్కన మొత్తం జనాభాకు టీకాలు వేయడానికి ఎంత సమయం పడుతుందో లెక్క వేసుకోవచ్చు. భారతదేశ జనాభా, వైశాల్యం.. వీటన్నింటి దృష్ట్యా చూస్తే అందరికీ టీకాలు అంత త్వరగా వేయడం కష్టమే. ప్రస్తుతం సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, భారత్ బయోటెక్ టీకాలే అందుబాటులో ఉన్నాయి. త్వరలో స్పుత్నిక్ కూడా వస్తుంది. డిమాండు- సరఫరా పరిస్థితిని బట్టే టీకా ధర ఎంతన్నది నిర్ణయిస్తారు. ప్రభుత్వం టీకాను ధరల నియంత్రణ పరిధిలోకి తెస్తే.. మార్కెట్ అస్తవ్యస్తం అవుతుంది. క్లియరెన్స్ సేల్ పద్ధతిలో టీకాలను ఎవరూ ఇవ్వలేరు. అందువల్ల ప్రభుత్వం నిర్ణయించే ధర కూడా అలాంటి ధర కంటే ఎక్కువగానే ఉండాలి. మూడోదశ టీకా వ్యూహం ప్రకారం.. కంపెనీలు ముందుగానే టీకా ధర వెల్ల డిస్తాయి. ఈ ధర ఒక్కో డోసు రూ. వెయ్యి కంటే తక్కువగానే ఉండే అవకాశం లేదు. రూ. 150, రూ. 200 అనేది సాధారణ ధర కంటే చాలా తక్కువ. దురదృష్టవశాత్తు ప్రజలు చెల్లించలేరన్న భావనతో ముందుగా తక్కువ ధరలు నిర్ణయిస్తారు. కానీ భరించ లేనివారికి మాత్రమే సబ్సిడీ ధరలకు ఇవ్వడం వేరు.. అందరికీ అలా ఇవ్వడం వేరు. టీకా డిమాండు ఎప్పుడూ సరఫరా కంటే ఎక్కువగానే ఉంటుంది. కానీ ఆ ధరకు టీకా ఉత్పత్తి చేయడం వల్ల వారికి ఎలాంటి ప్రోత్సాహం అందదు. మొత్తం జనాభా అందరికీ ప్రభుత్వమే టీకాలు వేయించాలా అన్నది కూడా ఒక ప్రశ్నే. తొలుత 60 ఏళ్లు దాటిన వారికి, 45 ఏళ్లు దాటినవారిలో వేరే ఆరోగ్య సమస్యలు ఉన్నవారికే టీకాలు ఇచ్చారు. వీరిలో చాలామంది ఉత్పాదకతకు దూరంగా ఉన్నవారే. ఉత్పాదక రంగంలో యువత ఉంటారు. ఆర్థిక కార్యకలాపాలు, జీవనోపాధి దెబ్బతినకుండా చూడాలంటే.. ఉత్పాదక రంగం లోని వారికి తొలుత టీకాలు ఇవ్వాలి. కానీ రాజకీయ పరంగా చూస్తే ఇది అంత సులభం కాదు. మూడోదశలో 50% టీకాలను కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చి, మిగిలినది మార్కెట్ ధరకు రాష్ట్ర ప్రభుత్వాలకు, ప్రైవేటు ఆసుపత్రులకు ఇస్తామన్నారు. దానివల్ల 18 ఏళ్లు దాటిన వారం దరికీ టీకాలు ఇవ్వచ్చు. ఈ పద్ధతి వల్ల సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, భారత్ బయోటెక్ సంస్థలు ఉత్పత్తి పెంచగలవు. ఈ రెండు కంపెనీలూ విదేశాలకూ టీకాను సరఫరా చేయడానికి ముందే ఒప్పందాలు చేసుకున్నాయి. ఈ లెక్కన టీకా ఉత్పత్తి పెరిగి, అది అందరికీ అందుబాటు లోకి రావాలంటే కనీసం 2021 సెప్టెంబర్ వరకు వేచిచూడాలి. అప్పటికీ కొంత కొరత ఉంటుంది. టీకా ముడిపదార్థాల ఎగుమ తిని నియంత్రించడానికి అమెరికాలో డిఫెన్స్ ప్రొడక్షన్ యాక్ట్ అమలుచేశారు. దీనికితోడు ప్రపంచ వాణిజ్య ఒప్పందం నేప థ్యంలో టీకా ఉత్పత్తికి లైసెన్సు తప్పనిసరి. ఇంతటి సంక్లిష్ట పరి స్థితుల్లో టీకా ఉత్పత్తి చేయడం, దాన్ని సరసమైన ధరలకే అందించడం అంటే కంపెనీలకు అసాధ్యం. కేంద్ర ప్రభుత్వం తమకు అందే 50% కోటాలో ఎంత మొత్తాన్ని ఏయే రాష్ట్రాలకు ఎలా సరఫరా చేస్తుందన్నది చూడాలి. ఆ టీకాలు చాలకపోతే.. రాష్ట్రాలు తమంతట తాముగా కొనుగోలు చేయాల్సి వస్తుంది. అలాగే ప్రైవేటు ఆసుపత్రులూ టీకా ఉత్పత్తి సంస్థల నుంచి నేరుగా కొనుక్కోవాలి. తప్పనిసరిగా మార్కెట్ ధరలకు అను గుణంగానే వారు వెచ్చించాల్సి ఉంటుంది. బిబేక్ దేబ్ రాయ్ ప్రధాని ఆర్ధిక సలహా మండలి చైర్మన్ (ది న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ సౌజన్యంతో) -
మినహాయింపులకు మంగళం పాడాలి
న్యూఢిల్లీ: పన్నుల మినహాయింపుల కోసం దేశీ పారిశ్రామిక రంగం చేస్తున్న ప్రయత్నాలను ప్రధాని ఆర్థిక సలహా మండలి చైర్మన్ బిబేక్ దేబ్రాయ్ తప్పుపట్టారు. అంతేకాదు, ఈ తరహా మినహాయింపులను పూర్తిగా తొలగించాలని వ్యాఖ్యానించారు. అలా చేస్తే పన్నుల ఆదాయం వాటా దేశ జీడీపీలో 22 శాతానికి పెరుగుతుందని చెప్పారు. ‘‘ఆదాయ పన్ను చట్టం సమీక్ష కోసం ప్రభుత్వం నియమించిన ప్యానెల్ ఈ అంశంపై దృష్టి సారించే అవకాశం ఉంది కూడా’’ అన్నారాయన. ‘‘పన్నుల ఎగవేత ఉంది. కానీ, ఎక్కువ శాతం జరుగుతున్నది పన్నుల ఎగవేత కాదు. పన్నులను తప్పించుకోవడం. ఇది పూర్తిగా చట్టబద్ధమే. ఎందుకంటే పలు రకాల మినహాయింపులను అనుమతించడం వల్లే’’ అని వివరించారు. ప్రత్యక్ష పన్నులకు సంబంధించి మినహాయింపుల తొలగింపు అంశం వచ్చే బడ్జెట్లో ఉండకపోవచ్చన్నారు. -
జీఎస్టీతో వృద్ధి జోరు.. చెత్త!
♦ ప్రస్తుతమున్న స్వరూపం అనుకూలం కాదు ♦ బహుళ పన్ను రేట్లతో సమస్యలు ♦ 13వ ఆర్థిక సంఘంలో పేర్కొన్నదే ఆదర్శనీయం ♦ నీతి ఆయోగ్ సభ్యుడు వివేక్ దేవ్రాయ్ విమర్శలు న్యూఢిల్లీ: కీలకమైన ఆర్థిక విధానాల్లో ప్రభుత్వానికి మార్గదర్శనం చేసే నీతి ఆయోగ్ సంస్థ సభ్యుడు, ప్రముఖ ఆర్థిక నిపుణుడు వివేక్ దేవ్రాయ్... ప్రభుత్వం అమలు చేస్తున్న జీఎస్టీపై విమర్శలు గుప్పించారు. ముందుగా ఖరారైన స్వరూపాన్ని పూర్తిగా మార్చేశారని, దీనితో జీడీపీ వల్ల ఒరిగేది ఏమీ ఉండదనే తీరులో ఆయన మాట్లాడారు. వస్తు సేవల పన్ను (జీఎస్టీ) అమలు తర్వాత స్థూల దేశీయోత్పత్తి 1 నుంచి 1.5 శాతం మేర వృద్ధి చెందుతుందంటూ వస్తున్న వార్తలన్నీ ‘పూర్తి పనికిమాలినవి’గా కొట్టి పడేశారు. అయితే, కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ, రెవెన్యూ కార్యదర్శి హస్ముఖ్ అధియా సైతం జీఎస్టీతో జీడీపీ పుంజుకుంటుందని ప్రకటించారు కదా! అని విలేకరులు ప్రశ్నించగా... తాను వారితో విభేదించనని దేవ్రాయ్ స్పష్టం చేశారు. హిందీ వార్తా చానల్ ఆజ్‌తక్ జీఎస్టీపై నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న దేవ్రాయ్ ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘అసంపూర్ణ జీఎస్టీతో జీడీపీ ఎంత మేర పెరుగుతుందన్న సంఖ్యపై నాకు అవగాహన లేదు. ఇది ఎక్కువే ఉండొచ్చు లేదా తక్కువ కావచ్చు. కానీ 1.5 శాతం పెరుగుతుందన్నది మాత్రం ఆదర్శవంతమైన జీఎస్టీతో. ఈ సంఖ్య 13వ ఆర్థిక సంఘం నివేదికలో భాగంగా పేర్కొన్న జీఎస్టీ ఆధారంగా ఇచ్చినది. మనం దీనికి దగ్గర్లో కూడా లేమిప్పుడు’ ’అని వివేక్ దేవ్రాయ్ తన అభిప్రాయాలను కుండ బద్ధలు కొట్టినట్టు చెప్పారు. మనకు తగినది కాదు... భారత జీఎస్టీ ఆదర్శనీయమైనది కాదన్నారు. మన జీఎస్టీ సమాఖ్య స్వరూపంలో ఉండడమే అందుకు కారణంగా పేర్కొన్నారు. ఒకటికి మించిన రేట్ల స్వరూపం ఇబ్బందికరమేనని అభిప్రాయపడ్డారు. బహుళ పన్ను రేట్లు అడ్డంకులకు దారితీస్తాయని, తాను మాత్రం ఏక పన్నును సిఫారసు చేస్తానని చెప్పారాయన. ‘‘ఉన్నత వర్గాల వారు వాడుకునే వాటిపై అధిక పన్ను రేటు, పేద వారు వినియోగించే వాటిపై తక్కువ పన్ను రేటు విధిస్తారా..? ఓ ఆర్థిక వేత్తగా అలా చేయకూడదు. కావాలంటే ఈ పనిని ప్రత్యక్ష పన్నుల్లో చేసుకోవాలి. అంతేకానీ, పరోక్ష పన్నుల్లో కాదు. ఈ అంశాలకు పరిష్కారం వేరే విధంగా చూడాలి’’ అని దేవ్రాయ్ అభిప్రాయపడ్డారు. ఇక ప్రపంచంలో 140–160 దేశాల్లో జీఎస్టీ అమల్లో ఉందంటూ వస్తున్న వార్తలు కూడా చెత్తేనని, ఆరేడు దేశాలకు మించి దీన్ని అమలు చేయడం లేదన్నారు. చిన్న స్టీల్ కంపెనీలకు సమస్యే న్యూఢిల్లీ: జీఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత స్వల్ప కాలంలో స్టీల్ పరిశ్రమలోని అవ్యవస్థీకృత విభాగంలో ఉన్న వారికి ఇబ్బందులు ఎదురుకావచ్చని భారత స్టెయిన్లెస్ స్టీల్ అభివృద్ధి సంఘ(ఐఎస్‌ఎస్‌డీఏ) ఆందోళన వ్యక్తం చేసింది. వీరందరూ టెక్నాలజీని అందిపుచ్చుకోలేరని పేర్కొంది. ‘‘వ్యవస్థీకృత తయారీదారులు సన్నద్ధం కాగలరు. వారు ఉద్యోగులు, వనరులను సమకూర్చుకోగలరు. సలహాదారులను, చార్టర్డ్ అకౌంటెంట్లను నియమించుకోగలరు. అవ్యవస్థీకృత రంగంలోని వారికి (చిన్న తరహా సంస్థలు) ఇవి సాధ్యం కావు. కొంత కాలం పాటు గందరగోళం ఉంటుంది. కొత్త పన్ను చట్టం ఎక్కువగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) ఆధారితమైనది. కానీ ఈ రంగంలో చిన్న సంస్థలు ఐటీని వినియోగించడం తక్కువే. దీన్ని నేర్చుకోవాల్సి ఉంటుంది’’ అని ఐఎస్‌ఎస్‌డీఏ ప్రెసిడెంట్ కేకే పహూజా తెలిపారు. ఆర్థిక రంగానికి ‘జీఎస్టీ’ బూస్ట్ న్యూఢిల్లీ: జీఎస్టీ పట్ల దేశీయ పరిశ్రమ అపార విశ్వాసాన్ని వ్యక్తం చేసింది. ఇది ఆర్థిక వ్యవస్థకు ఎంతో ప్రేరణను ఇస్తుందని, అంతర్జాతీయ సంస్థలు భారత్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ప్రోత్సాహాన్నిస్తుందని కొనియాడింది. శనివారం నుంచి అమల్లోకి వస్తున్న కొత్త పన్ను వ్యవస్థ నిర్వహణకు తాము సర్వసన్నద్దంగా ఉన్నట్టు తెలిపింది. ఎన్నో ప్రయోజనాలు మధ్య కాలానికి స్థూల ఆర్థిక రంగంపై జీఎస్టీ ప్రభావం పూర్తిగా సానుకూలంగా ఉంటుందని భావిస్తున్నాం. పన్ను ఎగవేతలను అరికట్టడం వల్ల ద్రవ్యోల్బణం కూడా తగ్గుతుంది. పన్ను పరిధి విస్తరించడం వల్ల ప్రభుత్వానికి ఆదాయాలు కూడా పెరుగుతాయి. ద్రవ్యలోటు ఇక ముందూ నియంత్రణలోనే ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్లో ఎగుమతుల పరంగా పోటీతత్వం పెరుగుతుంది. ఎఫ్‌డీఐలకు కూడా ప్రోత్సాహం లభిస్తుంది. – చంద్రజిత్ బెనర్జీ, సీఐఐ డైరెక్టర్ జనరల్ వ్యాపారం మరింత సులభం చరిత్ర సృష్టించడానికి బిగ్‌బ్యాంగ్ సంస్కరణ సిద్ధంగా ఉంది. ఈ ఒకే ఒక్క కీలకమైన పన్ను సంస్కరణతో వ్యాపార సులభతర నిర్వహణ విషయంలో అంతర్జాతీయంగా భారత్ ఎన్నో స్థానాలు ముందుకు వెళుతుంది. – సందీప్ జజోడియా, అసోచామ్ ప్రెసిడెంట్ అందరికీ లాభం దేశ ఆర్థిక రంగానికి గణనీయమైన లాభం చేకూరుతుంది. పలు పన్ను చట్టాలను అర్థం చేసుకునే ఇబ్బంది తొలగిపోవడం వల్ల పన్ను చెల్లింపుదారుకూ ప్రయోజనం చేకూరుతుంది. – ఫిక్కీ