నీరవ్ మోదీ (ఫైల్ ఫోటో)
న్యూఢిల్లీ : పంజాబ్ నేషనల్ బ్యాంకులో భారీ కుంభకోణానికి పాల్పడిన డైమాండ్ కింగ్ నీరవ్ మోదీ, దర్యాప్తు సంస్థ సీబీఐకి ఝలకిచ్చాడు. విచారణకు హాజరు కావాలంటూనీరవ్ మోదీ అధికారిక ఈ-మెయిల్ అడ్రస్‌కు సీబీఐ పంపిన మెయిల్‌కు సమాధానమిచ్చాడు. తాను విచారణకు హజరు రానంటూ తేల్చేశాడు. విదేశాల్లో తనకు వ్యాపారాలు ఉన్నాయని, వాటికి హాజరు కావాల్సి ఉందంటూ తలపొగరు సమాధానమిచ్చాడు. మరోవైపు తాను ఎక్కడున్న విషయాన్ని కూడా బహిర్గతం చేయలేదు. నీరవ్ మోదీ ఇచ్చిన నెగిటివ్ సమాధానానికి సీబీఐ అధికారులు మరో మెయిల్ పంపారు.
కచ్చితంగా వచ్చే వారం విచారణకు హాజరుకావల్సిందేనంటూ ఆదేశించారు. అదేవిధంగా ప్రస్తుతమున్న దేశ హై కమిషన్‌ను సంప్రదించాలని కూడా ఆదేశాలు జారీచేసింది. భారత్‌కు రావడానికి అన్ని రకాల ఏర్పాట్లు తాము చేయనున్నట్టు కూడా సీబీఐ పేర్కొంది. పంజాబ్ నేషనల్ బ్యాంకులో రూ. 12,717 కోట్ల కుంభకోణానికి పాల్పడిన నీరవ్ మోదీ విదేశాలకు పారిపోయిన సంగతి తెలిసిందే. ఈ కుంభకోణం వెలుగులోకి రాకముందే అతను దేశం విడిచి వెళ్లిపోయారు. స్కాం వెలుగులోకి వచ్చాక అతని భారత్‌కు రప్పించడానికి దర్యాప్తు ఏజెన్సీలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment