న్యూయార్క్: విదేశాల్లోని హోటళ్ల వాటాల కొనుగోలు విషయంలో(న్యూయార్క్‌లోని ప్లాజా, డ్రీమ్ హోటల్స్- లండన్‌లోని గ్రాస్‌వీనర్) తమను ఘోరంగా మోసం చేశారంటూ సహారా గ్రూప్ చేసిన వాదనలను, చట్టపరంగా తీసుకుంటున్న చర్యలను ఎదుర్కొనడానికి అమెరికా సంస్థ మిరాచ్ క్యాపిటల్ సిద్ధమవుతోంది. ఈ అంశంలో చోటుచేసుకున్న పరిణామాలను అన్నింటినీ సుప్రీంకోర్టుకు లిఖితపూర్వకంగా విన్నవిస్తామని ఆ సంస్థ ప్రకటించింది. ఒప్పంద నిబంధనల ఉల్లంఘన, పరువునష్టం వంటి అంశాలకు సంబంధించి సహారాపై న్యాయపరమైన చర్యలు తీసుకోనున్నట్లు కూడా మిరాచ్ సీఈఓ సారాంశ్ శర్మ తెలిపారు.