
పెరుగుతున్న బ్రాండ్ల ‘సోషల్’ ప్రచారం
న్యూఢిల్లీ: సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేసే భారత కంపెనీల సంఖ్య పెరుగుతోంది.సోషల్ నెట్‌వర్కింగ్ సైట్ల ప్రాధాన్యం, విస్తరణ పెరిగిపోతుండడమే దీనికి కారణమని ఎర్నస్ట్ అండ్ యంగ్ తాజా నివేదిక వెల్లడించింది. ఎర్నస్ట్ అండ్ యంగ్ సంస్థ సోషల్ మీడియా మార్కెటింగ్ ఇండియా ఇండియా ట్రెండ్స్ పేరుతో ఒక నివేదికను వెలువరించింది.
2013లో సోషల్ మీడియా ద్వారా మార్కెటింగ్ చేసిన కంపెనీల సంఖ్య 78 శాతంగా ఉందని, ఈ ఏడాది ఈ సంఖ్య 90 శాతానికి పెరుగుతుందని ఈ నివేదిక పేర్కొంది. ఈ కంపెనీలు తమ వార్షిక మార్కెటింగ్ బడ్జెట్‌లో 15 శాతం వరకూ సోషల్ మీడియా ద్వారా ప్రచారానికి ఖర్చు పెట్టనున్నాయని వివరించింది.