సాక్షి, హైదరాబాద్: బీఎస్‌ఎన్‌ఎల్ 18వ ఆవిర్భావ వేడుకల సందర్భంగా వినియోగదారులకు పలు ఆఫర్లను ప్రకటించింది. సోమవారం అబిడ్స్‌లోని బీఎస్‌ఎన్‌ఎల్ భవన్‌లో జరిగిన సమావేశంలో చీఫ్ జనరల్ మేనేజర్ (సీజీఎం) వి.సుందర్ ఈ ఆఫర్ల వివరాలను తెలిపారు. అలాగే గత నెల 24 నుంచి 28 వరకు వివిధ టాప్‌అప్ రీచార్జ్ చేసుకున్న వారిలో లక్కీడ్రా ద్వారా ఎంపిక చేసిన విజేతల పేర్లను ప్రకటించారు. ఈ నెల 1 నుంచి 18 వరకు వివిధ కొత్త పథకాలు అమల్లో ఉంటాయని సీజీఎం చెప్పారు.
బీఎస్‌ఎన్‌ఎల్ అమేజాన్ ఆఫర్, ప్రతిభాప్లస్, లాంచ్ ఆఫర్, ఎస్టీవీ–141, కాంబోవోచర్, అదనపు డేటా కోసం ప్రమోషనల్ ఆఫర్ అందుబాటులో ఉన్నాయన్నారు. ప్రీపెయిడ్ కస్టమర్ల కోసం యూఏఈ, యూఎస్‌ఏ, నేపాల్, సౌదీ అరేబియా, ఒమన్, ఖతార్, శ్రీలంక, బంగ్లాదేశ్, మయన్మార్‌లలో రోమింగ్ సదుపాయం కల్పించామని తెలిపారు. రూ.400 టాప్‌అప్‌లపై 10 శాతం క్యాష్‌బ్యాక్ ఆఫర్ ఉందని చెప్పారు. వేగవంతమైన ఇంటర్‌నెట్ కోసం 4జీ టవర్లను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇందుకోసం జడ్చర్ల, వైరాలలో టవర్లను పరీక్షిస్తున్నట్లు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment