
సీడీఎస్ఎల్ ‘ఈ-లాకర్’ సౌలభ్యం
హైదరాబాద్: ప్రముఖ సెక్యూరిటీస్ డిపాజిటరీ ‘సీడీఎస్‌ఎల్’ తాజాగా ‘ఈ-లాకర్’ సౌల భ్యాన్ని అందుబాటులోకి తెచ్చిం ది. ఇన్వెస్టర్లు దీని సాయంతో వారి వ్యక్తిగత, ఆర్థిక, ఇతర అంశాలకు చెందిన డాక్యుమెంట్లను భద్రంగా దాచుకోవచ్చని సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. ఈజి/ఈజియెస్ట్‌లో రిజిస్టర్ చేసుకున్న ఇన్వెస్టర్లకు ఈ సదుపాయాన్ని ఉచితంగా అందుబాటులో ఉంటుందని పేర్కొంది. ఈజి/ఈజియెస్ట్ లాగిన్ ఐడీ ద్వారా ఈ-లాకర్‌లో ఇన్వెస్టర్లు వారి డాక్యుమెంట్లను అప్‌లోడ్/డౌన్‌లోడ్ చేసుకోవచ్చని వివరించింది.