శ్రమించే వాతావరణాన్ని సృష్టించాలి: కొచర్
గాంధీనగర్: భారత్‌ను ఆర్థిక సేవల కేంద్రంగా రూపొందించాలని ఐసీఐసీఐ బ్యాంక్ ఎండీ, సీఈవో చందా కొచర్ బుధవారం చెప్పారు. దీని కోసం మరింత వృద్ధి సాధిం చాల్సిన అవసరముందని పేర్కొన్నారు. అంతేకాకుండా ద్రవ్యలోటు, కరంట్ అకౌంట్ లోటుల్లో స్థిరత్వాన్ని సాధించాలని, ద్రవ్యోల్బణాన్ని నియంత్రణలో ఉంచాలని ఆమె సూచించారు.
ఆర్థిక సేవలు మరింత వృద్ధి చెందడానికి భారత్‌లో అపారమైన అవకాశాలున్నాయని చెప్పారు. ఇక్కడి గుజరాత్ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ టెక్(గిఫ్ట్) సిటీలో ‘ఆర్థిక సేవలు-ఆర్థిక వృద్ధికి కీలక చోదక శకి’్త అన్న అంశంపై నిర్వహించిన సెమినార్‌లో ఆమె మాట్లాడారు. దేశంలో సమర్థవంతమైన, పటిష్టమైన శ్రమించే వాతావరణాన్ని సృష్టించాల్సి ఉందని గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ ప్రేక్షకుడిగా పాల్గొన్న ఈ సెమినార్‌లో ఆమె ఉద్ఘాటించారు.