మరింత తగ్గనున్న చైనా వృద్ధి స్పీడ్?
బీజింగ్: అమెరికా తరువాత ప్రపంచంలో రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ చైనా వృద్ధి వేగం 2015తో పోల్చితే 2016లో మరింత తగ్గనున్నట్లు వార్తలు వస్తున్నాయి. రెండేళ్లలో పోల్చితే వృద్ధి 6.9 శాతం నుంచి 6.7 శాతానికి తగ్గుతున్నట్లు జాతీయ అభివృద్ధి, సంస్కరణల వ్యవహారాల సహాయమంత్రి షవోషీ ఉటంకిస్తూ, ప్రభుత్వ జిన్హువా వార్తా సంస్థ ఒక వార్తను వెలువరించింది.
అధికారిక గణాంకాలు వచ్చే కొద్ది రోజుల్లో వెలువడవచ్చని భావిస్తున్నారు. 25 సంవత్సరాల్లో ఎన్నడూ లేనంతగా 2015లో జీడీపీ 6.9 శాతం పడిపోయింది. గత ఏడాది అమెరికా ఆర్థిక పరిమాణం మొత్తం 68.91 ట్రిలియన్ యన్‌లు (దాదాపు 9.96 ట్రిలియన్లు). ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వృద్ధి 6.5%, 7% శ్రేణిలో ఉండాలని చైనా లక్ష్యంగా పెట్టుకుంది. తొలి మూడు త్రైమాసికాల్లో ఈ రేటు 6.7 %.