చైనా స్మార్ట్‌ఫోన్ కంపెనీల జోరు
గతేడాది భారత్‌లో 40 శాతం మార్కెట్ వాటా
బీజింగ్: చైనా స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీలు ప్రపంచంలోనే రెండో అతిపెద్ద స్మార్ట్‌ఫోన్ మార్కెట్ కలిగిన భారత్‌లో జెట్ స్పీడ్‌తో దూసుకెళ్తున్నాయి. ఇవి గతేడాది ఇండియాలో మొత్తంగా 40 శాతం వాటాను కైవసం చేసుకున్నాయి. ఈ విషయాలు గ్లోబల్ రీసెర్చ్ సంస్థ ఐడీసీ నివేదికలో వెల్లడైనట్లు చైనా డైలీ పేర్కొంది. ఐడీసీ నివేదిక ప్రకారం.. చైనా కంపెనీల రాకతో దేశీ కంపెనీల మార్కెట్ వాటా క్షీణించింది.
భారత్‌లోని వృద్ధి అవకాశాలను అందిపుచ్చుకోవడంపై స్మార్ట్‌ఫోన్ కంపెనీలు దృష్టి కేంద్రీకరించాయి. అందుకే స్మార్ట్‌ఫోన్ కంపెనీల మధ్య ధరల యుద్ధం తీవ్రంగా కొనసాగుతోంది. భారత్‌లో స్మార్ట్‌ఫోన్ ధర సగటున రూ.6,800గా ఉంది. కాగా ఒప్పొ కంపెనీ భారత్‌లో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుకు దాదాపు 215 మిలియన్ డాలర్లను ఇన్వెస్ట్ చేయాలని యోచిస్తోంది.