China smartphone market share
-
ఐఫోన్‌కు షాక్, సేల్స్ పెరిగిన భారత్‌లో తొలిస్థానం ఆ ఫోన్‌దే!!
భారత్‌లో యాపిల్ ఐఫోన్ సేల్స్ రాకెట్ వేగంతో దూసుకెళ్తున్నాయి. ఎన్నడూ లేని విధంగా గతేడాది క్యూ4 ఫలితాల్లో ఒక్క ఇండియన్ స్మార్ట్ ఫోన్ మార్కెట్లో ఐఫోన్ 34 శాతం సేల్స్ నమోదయ్యాయి. అయితే ఊహించని విధంగా ఐఫోన్ సేల్స్ జరిగినప్పటకీ.. దేశీయ మార్కెట్లో తొలి ఐదుస్థానాల్లో ఉన్న మిగిలిన స్మార్ట్ ఫోన్లకు సరైన పోటీ ఇవ్వకపోవడం ఆసక్తి కరంగా మారింది కౌంటర్ పాయింట్ రీసెర్చ్ రిపోర్ట్ ప్రకారం..క్యూ4 ఫలితాల్లో భారత్‌లో ఐఫోన్ సేల్స్ షావోమీ, శాంసంగ్, రియల్మీ, వివో, ఒప్పోల స్థానాల్ని అధిగమించలేకపోయింది. అందుకు కారణం ఐఫోన్ ఖరీదు ఎక్కువగా ఉండడటమేనని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇతర ఫోన్ తయారీదారులతో పోలిస్తే మార్కెట్ వాటా పరంగా ఐఫోన్ వెనుకబడి ఉండగా.. బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం, వాటిలో కొన్ని స్మార్ట్ ఫోన్ల కంటే ఎక్కువ ఆదాయాన్ని ఆర్జించినట్లు కొన్ని గణాంకాలు వెలుగులోకి వచ్చాయి. భారత్ లో ఐఫోన్ ధరలు ఎక్కువగా ఉన్నాయి. అయినప్పటికీ 2021,4వ త్రైమాసికంలో యాపిల్ సుమారు 2.3 మిలియన్ యూనిట్లను రవాణా చేసింది. శాంసంగ్ 7.2 మిలియన్ ఫోన్లను,షావోమీ మొత్తం 9.3 మిలియన్ యూనిట్ల షిప్ మెంట్‌తో ఆగ్రస్థానంలో కొనసాగుతుంది. ఇతర ప్రధాన బ్రాండ్లతో పోల్చితే తక్కువ అమ్మకాలు జరిపినప్పటికీ దేశీయంగా క్యూ4 2021లో 2.09 బిలియన్ల ఆదాయాన్ని గడించి ఉండొచ్చని, శాంసంగ్ దాదాపు 2 బిలియన్ల వరకు వసూలు చేసినట్లు సమాచారం. పండుగ సీజన్లో కస్టమర్లు ఐఫోన్ 12, ఐఫోన్ 13 సేల్స్ దూకుడు పెంచాయి. గతేడాది డిసెంబర్ నెలలో ఐఫోన్ 12ను రూ.50వేలకు అమ్మడంతో పాటు ఐఫోన్ 13పై క్యాష్ బ్యాక్ ఆఫర్లు ప్రకటించడంతో కొనుగోలుదారులు ఐఫోన్లను సొంతం చేసేందుకు ఇంటస్ట్ర్ చూపించారు. ఈ సందర్భంగా.. గత త్రైమాసికంలో దేశీయ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో యాపిల్ సేల్స్‌పై కౌంటర్‌పాయింట్ రీసెర్చ్ హెడ్ నీల్ షా మాట్లాడుతూ..ఈ సేల్స్ తో భారత్ లో ఐఫోన్ మరో మలుపు తిరిగింది. కోవిడ్‌లోనూ భారతీయులు ప్రీమియం ఫోన్లపై డబ్బులు ఖర్చు చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. టెక్నాలజీతో ముడిపడి ఉన్న ఫోన్లను సొంతం చేసేందుకు కొనుగోలు దారులు సిద్ధంగా ఉన్నారని వ్యాఖ్యానించారు. -
5g Smartphone : దూసుకెళ్తున్న అమ్మకాలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశంలో ఈ ఏడాది స్మార్ట్ఫోన్ల అమ్మకాలు జోరుగా ఉంటాయని కౌంటర్‌పాయింట్ రిసెర్చ్ అంచనా వేస్తోంది. విక్రయాలు 14 శాతం అధికమై 17.3 కోట్ల యూనిట్లకు చేరతాయని వెల్లడించింది. జూలై–డిసెంబరు కాలంలోనే 10 కోట్లకుపైగా స్మార్ట్ఫోన్లు కస్టమర్ల చేతుల్లోకి వెళ్లనున్నాయి. కోవిడ్–19 పరిమితులు ఎత్తివేసిన తర్వాత జూన్ మొదలుకుని కస్టమర్ల నుంచి డిమాండ్ ఉంది. ఆగస్ట్–నవంబర్ మధ్య అమ్మకాల హవా ఉంటుంది. చైనా తర్వాత స్మార్ట్ఫోన్ల రంగంలో భారత్ ప్రపంచంలో రెండవ స్థానంలో ఉంది. ఫీచర్ ఫోన్ల నుంచి వినియోగదార్లు అప్‌గ్రేడ్ అవుతున్నారు. ప్రస్తుతం దేశంలో 32 కోట్ల మంది ఫీచర్ ఫోన్లను వాడుతున్నారు. ఇక కొన్నేళ్లలోనే స్మార్ట్‌ఫోన్ మార్కెట్ 20 కోట్ల మార్కును దాటనుంది. 2019లో దేశంలో 15.8 కోట్ల స్మార్ట్ఫోన్లు విక్రయమయ్యాయి. గతేడాది స్వల్పంగా 4 శాతం తగ్గి 15.2 కోట్ల యూనిట్లు నమోదయ్యాయి. అంచనాలను మించి..: సెకండ్ వేవ్ వచ్చినప్పటికీ అంచనాలను మించి మార్కెట్ వేగంగా పుంజుకుంది. 2021 జనవరి–జూన్ కాలంలో అత్యధిక అమ్మకాలను సాధించింది. కోవిడ్ కేసులు నియంత్రణలో ఉండి, వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగితే ఆర్థిక పరిస్థితి మెరుగుపడి కస్టమర్లలో సెంటిమెంట్ బలపడుతుందని టెక్నోవిజన్ ఎండీ సికందర్ తెలిపారు. కాగా, 2020లో 5జీ మోడళ్ల వాటా కేవలం 3 శాతమే. ఈ ఏడాది ఇది 19 శాతం వాటాతో 3.2 కోట్ల యూనిట్లను తాకనుంది. 5జీ చిప్సెట్ చవక కావడం, స్మార్ట్ఫోన్ల ధర తగ్గడంతో ఈ విభాగంలో అమ్మకాలు దూసుకెళ్లనున్నాయి. ఎంట్రీ లెవెల్లో సగటు ధర ఏడాదిలో 40 శాతం తగ్గింది. ప్రస్తుతం రూ.15,000లోపు ధరలో 5జీ స్మార్ట్‌ఫోన్ లభిస్తోంది. చదవండి: 'మాధవ్ సార్ ఇంకా ఎన్నిరోజులు మమ్మల్ని కాపీ కొడతారు' -
చైనా స్మార్ట్‌ఫోన్ కంపెనీల జోరు
గతేడాది భారత్‌లో 40 శాతం మార్కెట్ వాటా బీజింగ్: చైనా స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీలు ప్రపంచంలోనే రెండో అతిపెద్ద స్మార్ట్‌ఫోన్ మార్కెట్ కలిగిన భారత్‌లో జెట్ స్పీడ్‌తో దూసుకెళ్తున్నాయి. ఇవి గతేడాది ఇండియాలో మొత్తంగా 40 శాతం వాటాను కైవసం చేసుకున్నాయి. ఈ విషయాలు గ్లోబల్ రీసెర్చ్ సంస్థ ఐడీసీ నివేదికలో వెల్లడైనట్లు చైనా డైలీ పేర్కొంది. ఐడీసీ నివేదిక ప్రకారం.. చైనా కంపెనీల రాకతో దేశీ కంపెనీల మార్కెట్ వాటా క్షీణించింది. భారత్‌లోని వృద్ధి అవకాశాలను అందిపుచ్చుకోవడంపై స్మార్ట్‌ఫోన్ కంపెనీలు దృష్టి కేంద్రీకరించాయి. అందుకే స్మార్ట్‌ఫోన్ కంపెనీల మధ్య ధరల యుద్ధం తీవ్రంగా కొనసాగుతోంది. భారత్‌లో స్మార్ట్‌ఫోన్ ధర సగటున రూ.6,800గా ఉంది. కాగా ఒప్పొ కంపెనీ భారత్‌లో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుకు దాదాపు 215 మిలియన్ డాలర్లను ఇన్వెస్ట్ చేయాలని యోచిస్తోంది.