ప్రసాద్! ఈక్విటీ ఫండ్లు ఎంచుకోండి!! | Choose equity funds..prasad | Sakshi
Sakshi News home page

ప్రసాద్! ఈక్విటీ ఫండ్లు ఎంచుకోండి!!

Published Mon, Jul 13 2015 12:04 AM | Last Updated on Sun, Sep 3 2017 5:23 AM

ప్రసాద్! ఈక్విటీ ఫండ్లు ఎంచుకోండి!!

ప్రసాద్! ఈక్విటీ ఫండ్లు ఎంచుకోండి!!

నాకు 33 ఏళ్లు. హైదరాబాద్‌లోని ఒక ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం. నెల జీతం రూ.63,000. వార్షికంగా రూ.7,56,000. భార్య, ఐదేళ్ల బాబు, రెండేళ్ల పాప ఉన్నారు. నాకు, నా భార్యకు కొన్ని బీమా పాలసీలు, కొన్ని పొదుపు పథకాల్లో పెట్టుబడులు ఉన్నాయి.
 
బీమా పాలసీలు...
- నా పేరిట రూ.లక్ష మనీ బ్యాక్ పాలసీ. వార్షిక ప్రీమియం రూ.5,000
- నా పేరిటరూ. లక్ష కవరేజీతో బీమా కిరణ్ పాలసీ. వార్షిక ప్రీమియం రూ.800
- ఆఫీస్ ఇస్తున్న బీమా కవరేజీ రూ.25,00,000
- ఆఫీస్ ఇస్తున్న వైద్య బీమా ఫ్లోటింగ్ పాలసీ. కవరేజీ రూ.3,50,000
- మ్యాక్స్ బుపా కవర్ రూ.3,00,000.
- నా భార్య పేరిట రూ.లక్ష కవరేజీతో మనీ బ్యాక్ పాలసీ. వార్షిక ప్రీమియం రూ.6,000
 
ప్రస్తుత నెలవారీ ఖర్చులు...
- గృహ అవసరాలకు: రూ.8,000
- కారు లోన్ చెల్లింపులు: రూ.9,000
- ఆర్‌డీ అలాగే పీపీఎఫ్: రూ. 5,000
- బీమా:  రూ.1,000
- స్కూల్ ఫీజు రూ.6,000.
- అత్యవసర నిధికి వ్యయం రూ.6,000
- మొత్తం ఖర్చు రూ. 35,000

పొదుపు... ఇతర పెట్టుబడులు
- నా భార్య పేరిట నెలకు రూ.2000 చొప్పున బ్యాంక్‌లో ఆర్‌డీ.
- పీపీఎఫ్‌లో నెలకు రూ.3,000 చొప్పున పొదుపు
- షేర్లలో రూ.70,000 పెట్టుబడులు

అప్పులు..
- నెలకు రూ.9,000 చొప్పున ఇంకా 24 నెలలు కారు రుణం చెల్లింపు

ప్రణాళికలు...
ప్రస్తుత రూ.70,000కు తోడు ఇకపై ప్రతి ఏటా రూ.50,000 చొప్పున షేర్లలో ఇన్వెస్ట్ చేద్దామనుకుంటున్నాను. రూ.30,000 మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు పెడదామనుకుంటున్నాను. ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి? ఎందుకంటే పిల్లల చదువు, వారి పెళ్లిళ్లు, నా రిటైర్మెంట్ ఇవన్నీ మున్ముందు ఉన్నాయి. నేను ఏం చేస్తే బాగుంటుంది?
- ప్రసాద్, హైదరాబాద్
 
పెట్టుబడులు/పోర్ట్‌ఫోలియో సూచనలు...
- మీ కుటుంబ ఆర్థిక భద్రతకు తొలుత జీవిత బీమా కావాలి. రూ.50 లక్షల జీవిత బీమా అవసరం ఉంది.
- కుటుంబం మొత్తానికి వైద్య అవసరాలకు బీమా చేయించండి
- దీర్ఘకాలంలో సంపద సృష్టికి ఈక్విటీ, మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు అవసరమే.
- దురదృష్టకర పరిస్థితులు ఎదురయితే, ఎటువంటి ఇబ్బందీ లేకుండా ఒక చైల్డ్ పాలసీ కూడా కావాలి.
- మీ ప్రస్తుత పాలసీలు సంప్రదాయబద్ధమెనవి. వీటిని నిలిపేస్తే పలు పెనాల్టి రుసుములు చెల్లించాలి. కాబట్టి వీటిని కొనసాగించండి. తద్వారా వచ్చే డబ్బును పిల్లల విద్య, రిటైర్‌మెంట్ అవసరాలు వంటికి వినియోగించవచ్చు. సాంప్రదాయ పాలసీలు గనుక, వీటిపై 6 నుంచి 7.5 శాతం వరకూ వడ్డీ వచ్చే అవకాశం ఉంటుంది.
- మీరు బ్యాంక్, రికరింగ్ డిపాజిట్లలో ప్రస్తుతం పెట్టుబడులు పెడుతున్నట్లు చెబుతున్నారు. అయితే ట్యాక్స్ అనంతరం వీటి ద్వారా మీకు కొంచెం తక్కువ రిటర్న్స్ వచ్చే వీలుంది. క్రమంగా ఈ పొదుపులను ఈక్విటీ, బ్యాలెన్స్‌డ్ మ్యూచువల్ ఫండ్ స్కీమ్‌లలోకి మార్చుకోండి. తద్వారా తగిన రిటర్న్స్ పొందే వీలుంటుంది.
- ఈక్విటీ, ఎంఎఫ్‌లలో పెట్టుబడులకు సలహాలను అడిగారు. మ్యూచువల్ ఫండ్స్ డైవర్సిఫైడ్ ఈక్విటీ స్కీమ్స్‌లో పెట్టుబడులు బాగుంటాయి. ఇవి అధిక ఇబ్బందుల సర్దుబాటు ధోరణిలో రిటర్న్స్ అందిస్తాయి.
- ఆయా మార్గాల ద్వారా మీరు మంచి ఆర్థిక లక్ష్యాలను సాధిస్తారని భావిస్తున్నాను.
 
మీరు బీమా పాలసీలు, ఆర్‌డీ, పీపీఎఫ్ వంటివి ఎప్పుడు... ఎంతవరకూ తీసుకున్నారు... తత్సంబంధ అంశాలు తెలపలేదు. అయితే ఆయా అంశాలకు సంబంధించి ఒక అంచనా ప్రకారం మీకు అందుబాటులో ఉంటుందనుకున్న డబ్బును పరిగణనలోకి తీసుకుని తాజా సూచన చేస్తున్నా. భవిష్యత్తు అవసరాలు ఎలా ఉండవచ్చన్నది చూస్తే...

 
- రిటైర్‌మెంట్‌కు, విద్యకు, వివాహాల డబ్బు అవసరాలకు 6, 7.5, 6 శాతం చొప్పున ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకోవడం జరిగింది...
- ప్రస్తుతం ఉన్న మీ ఆదాయ, వ్యయాలను, పొదుపులను మాత్రమే పరిగణనలోకి తీసుకోవడం జరిగింది.

 
ఈ మ్యూచువల్ ఫండ్స్‌ను పరిశీలించవచ్చు...


Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement